2024–25లో భారీ లావాదేవీలు
కొనుగోళ్లను మించిన అమ్మకాలు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికం(క్యూ1)లో ఓపెన్ మార్కెట్ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బల్క్ లేదా బ్లాక్ డీల్స్ భారీగా నమోదవుతున్నాయి. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో విలువరీత్యా ఇవి 76 శాతం జంప్ చేశాయి. గతేడాది(2023–24) తొలి త్రైమాసికంతో పోలిస్తే లావాదేవీల(డీల్స్) సంఖ్య సైతం 23 శాతం ఎగసింది.
ప్రైమ్ డేటాబేస్ ప్రకారం ఈ క్యూ1లో 3,396 బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మకాలు రూ. 1.3 లక్షల కోట్లకు చేరాయి. గత క్యూ1లో రూ. 74,811 కోట్ల విక్రయ డీల్స్ నమోదయ్యాయి. తాజా త్రైమాసికంలో ఒక్క జూన్‌లోనే రూ. 73,000 కోట్ల విలువైన డీల్స్ జరగడం గమనార్హం! గత 11 నెలలను పరిగణిస్తే ఒక్క నెలలోనే రూ. 70,000 కోట్ల విలువైన అమ్మకాలు నమోదుకావడం ఇది మూడోసారి!! ఇంతక్రితం 2023 ఆగస్ట్‌లో రూ. 77,469 కోట్లు, డిసెంబర్‌లో రూ. 78,786 కోట్ల విలువైన విక్రయ డీల్స్ నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment