Black Deal
-
బ్లాక్ డీల్స్ హవా..
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికం(క్యూ1)లో ఓపెన్ మార్కెట్ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బల్క్ లేదా బ్లాక్ డీల్స్ భారీగా నమోదవుతున్నాయి. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో విలువరీత్యా ఇవి 76 శాతం జంప్ చేశాయి. గతేడాది(2023–24) తొలి త్రైమాసికంతో పోలిస్తే లావాదేవీల(డీల్స్) సంఖ్య సైతం 23 శాతం ఎగసింది.ప్రైమ్ డేటాబేస్ ప్రకారం ఈ క్యూ1లో 3,396 బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మకాలు రూ. 1.3 లక్షల కోట్లకు చేరాయి. గత క్యూ1లో రూ. 74,811 కోట్ల విక్రయ డీల్స్ నమోదయ్యాయి. తాజా త్రైమాసికంలో ఒక్క జూన్‌లోనే రూ. 73,000 కోట్ల విలువైన డీల్స్ జరగడం గమనార్హం! గత 11 నెలలను పరిగణిస్తే ఒక్క నెలలోనే రూ. 70,000 కోట్ల విలువైన అమ్మకాలు నమోదుకావడం ఇది మూడోసారి!! ఇంతక్రితం 2023 ఆగస్ట్‌లో రూ. 77,469 కోట్లు, డిసెంబర్లో రూ. 78,786 కోట్ల విలువైన విక్రయ డీల్స్ నమోదయ్యాయి. -
ఇండస్ నుంచి వొడాఫోన్ ఔట్!
ముంబై: దేశీ మొబైల్ టవర్ల కంపెనీ ఇండస్ టవర్స్‌లో వాటాను విక్రయించేందుకు టెలికం రంగ బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్లోగల పూర్తి వాటాను వొడాఫోన్ 2.3 బిలియన్ డాలర్లకు(రూ. 19,100 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం బ్లాక్‌డీల్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇండస్ వాటాను మొబై ల్ దిగ్గజం విక్రయించే వీలున్నట్లు తెలియజేశాయి. ఇండస్‌లో గ్రూప్‌లోని వివిధ సంస్థల ద్వారా వొడాఫోన్ 21.5 శాతం వాటాను కలిగి ఉంది. బీఎస్ఈలో ఇండస్ టవర్స్ శుక్రవారం ముగింపు ధర రూ. 341తో చూస్తే వొడాఫోన్ వాటా విలువ రూ. 19,100 కోట్లుగా విశ్లేషకులు మదింపు చేశారు. నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇటీవల నిధుల సమీకరణ బాటలో సాగుతున్న వొడాఫోన్ ఐడియా షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 16.7 వద్ద ముగిసింది. గత కొద్ది రోజులుగా వొడాఫోన్ ఐడియా షేరు ర్యాలీ బాటలో సాగుతోంది. కాగా.. డిమాండు ఆధారంగా వొడాఫోన్ గ్రూప్.. ఇండస్‌లో వాటా విక్రయాన్ని చేపట్టే వీలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వాటా విక్రయాన్ని నిర్వహించేందుకు వీలుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, బీఎన్పీ పారిబాస్లను వొడాఫోన్ ఎంపిక చేసినట్లు పేర్కొన్నాయి. అయితే వొడాఫోన్ ఇండియా, బ్రిటిష్ మాతృ సంస్థ ప్రతినిధులు ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం! 2022లోనూ.. నిజానికి 2022లో వొడాఫోన్.. ఇండస్ టవర్స్‌లోగల 28 శాతం వాటాను విక్రయించేందుకు నిర్ణయించినప్పటికీ స్వల్ప వాటాను మాత్రమే అమ్మగలిగింది. వాటా విక్రయానికి ప్రత్యర్ధి టెలికం దిగ్గజాలతో చర్చలు చేపట్టినప్పటికీ ఫలించలేదు. ఇండస్‌లో వాటా విక్రయం ద్వారా 42 బిలియన్ డాలర్లకుపైగా గల నికర రుణాల్లో కొంతమేర తిరిగి చెల్లించేందుకు వొడాఫోన్ ప్రణాళికలు వేసింది. ప్రపంచంలోనే టెలికం టవర్ల దిగ్గజాలలో ఒకటిగా నిలుస్తున్న ఇండస్ టవర్స్ దేశీయంగా రెండో పెద్ద మొబైల్ టవర్ల కంపెనీగా నిలుస్తోంది. సుమారు 2,20,000 టవర్లు కలిగిన కంపెనీలో మరో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు సైతం వాటా ఉంది. -
పేటీఎంకు అలీబాబా షాక్: కంపెనీ నుంచి ఔట్
సాక్షి,ముంబై: చైనీస్ ఈ-కామర్స్, రిటైల్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం అలీబాబా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. One97 కమ్యూని కేషన్స్ (పేటీఎం) నుంచి పూర్తిగా నిష్క్రమించింది. బ్లాక్‌డీల్ ద్వారా రెండు కోట్లకు పైగా పేటీఎం షేర్లను విక్రయించింది. ఇండియా ఈకామర్స్ బిజినెస్‌లోకి భారీ పెట్టుబడులతో దూసుకొచ్చిన అలీబాబా (పేటీఎం)లో తన మొత్తం వాటాలను అమ్మేసింది. తాజా నివేదికల ప్రకారం బ్లాక్‌డీల్ ద్వారా శుక్రవారం మొత్తం 3.4 శాతం ఈక్విటీ లేదా 2.1 కోట్ల షేర్లను విక్రయించింది. జొమాటో, బిగ్‌బాస్కెట్ తరువాత తాజాగా అలీబాబా వాటాలను పూర్తిగి సెల్ చేసింది. ఎన్ఎస్ఈలో మొత్తం 4.73 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా చూపించింది. మొత్తం టర్నోవర్ రూ.3,097 కోట్లుగా ఉంది. రెండు వారాల సగటు 8 లక్షల షేర్లకు వ్యతిరేకంగా మొత్తం 19.61 లక్షల పేటీం షేర్లు బీఎస్ఈలో చేతులు మారాయి. ఫలితంగా పేటీఎం షేరు 7.85 శాతం తగ్గి రూ.650.75 వద్ద ముగిసింది. కాగా 2023లో ఇప్పటివరకు స్క్రిప్ 22 శాతం పెరిగింది. పేటీఎంలోని 6.26 శాతం ఈక్విటీ వాటా ఉన్న అలీబాబా జనవరిలో 3.1 శాతం విక్రయించింది. విజయ్ శేఖర్శర్మ నేతృత్వంలోని కంపెనీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.778.5 కోట్ల నష్టంతో పోలిస్తే 50 శాతం తగ్గి, డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలను రూ.392 కోట్లకు తగ్గించుకుంది. సాఫ్ట్‌బ్యాంక్ మద్దతున్న పేటీఎం ఆదాయం గత ఏడాది త్రైమాసికంలో రూ.1,456 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లను ఆర్జించింది. -
జీవీకే కౌంటర్లో బ్లాక్ డీల్
సాక్షి, అమవరావతి: సోమవారం మార్కెట్లు నష్టాల్లో ముగిసినా జీవీకే ఇన్ఫ్రా షేరు 10 శాతం పెరిగి రూ. 6.90 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ.7.45 గరిష్ట స్థాయికి చేరినా చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 60 పైసల లాభంతో రూ. 6.90 వద్ద ముగిసింది. మార్కెట్ ప్రారంభంలోనే బ్లాక్‌డీల్ జరగడంతో ఈ కౌంటర్లో రోజంతా భారీగా లావాదేవీలు జరిగాయి. సాధారణంగా రెండు ఎక్స్ఛేంజీల్లో కలిపి రోజుకు 63 లక్షల షేర్లు (30 రోజుల సగటు) మారుతుంటే సోమవారం ఒక్కరోజే సుమారు 10 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం. ఉదయం 9.25 నిమిషాలకు రూ. 6.30 ధర వద్ద 5.71 కోట్ల షేర్లు బ్లాక్‌డీల్ రూపంలో చేతులు మారాయి. ఈ డీల్ విలువ రూ. 36 కోట్లు. హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మారిషస్ లిమిటెడ్ తన షేర్లను హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇండియన్ ఈక్విటీకి మార్చినట్లు బీఎస్ఈ డేటా వెల్లడిస్తోంది. ఒకానొక దశలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా జీవీకే షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్లో పుకార్లు షికార్లు చేశాయి. జీవీకేలో ప్రమోటర్లకు 54.25 శాతం వాటా ఉండగా, మార్కెట్ క్యాప్ రూ.1,094 కోట్లుగా ఉంది.