సాక్షి,ముంబై: చైనీస్ ఈ-కామర్స్, రిటైల్, టెక్నాలజీ, ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం అలీబాబా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. One97 కమ్యూని కేషన్స్ (పేటీఎం) నుంచి పూర్తిగా నిష్క్రమించింది. బ్లాక్‌డీల్ ద్వారా రెండు కోట్లకు పైగా పేటీఎం షేర్లను విక్రయించింది.
ఇండియా ఈకామర్స్ బిజినెస్‌లోకి భారీ పెట్టుబడులతో దూసుకొచ్చిన అలీబాబా (పేటీఎం)లో తన మొత్తం వాటాలను అమ్మేసింది. తాజా నివేదికల ప్రకారం బ్లాక్‌డీల్ ద్వారా శుక్రవారం మొత్తం 3.4 శాతం ఈక్విటీ లేదా 2.1 కోట్ల షేర్లను విక్రయించింది. జొమాటో, బిగ్‌బాస్కెట్ తరువాత తాజాగా అలీబాబా వాటాలను పూర్తిగి సెల్ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 4.73 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా చూపించింది. మొత్తం టర్నోవర్ రూ.3,097 కోట్లుగా ఉంది.
రెండు వారాల సగటు 8 లక్షల షేర్లకు వ్యతిరేకంగా మొత్తం 19.61 లక్షల పేటీం షేర్లు బీఎస్‌ఈలో చేతులు మారాయి. ఫలితంగా పేటీఎం షేరు 7.85 శాతం తగ్గి రూ.650.75 వద్ద ముగిసింది. కాగా 2023లో ఇప్పటివరకు స్క్రిప్ 22 శాతం పెరిగింది.
పేటీఎంలోని 6.26 శాతం ఈక్విటీ వాటా ఉన్న అలీబాబా జనవరిలో 3.1 శాతం విక్రయించింది. విజయ్ శేఖర్శర్మ నేతృత్వంలోని కంపెనీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.778.5 కోట్ల నష్టంతో పోలిస్తే 50 శాతం తగ్గి, డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలను రూ.392 కోట్లకు తగ్గించుకుంది. సాఫ్ట్‌బ్యాంక్ మద్దతున్న పేటీఎం ఆదాయం గత ఏడాది త్రైమాసికంలో రూ.1,456 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లను ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment