Vijay sekhar sharma
-
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కొత్త వ్యూహం
న్యూఢిల్లీ: ఆర్టిఫియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ స్టాక్ అభివృద్ధికి ఏఐపై పెట్టుబడులు పెడుతున్నట్టు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. మార్కెట్‌కు సేవలు అందించడం, దీర్ఘకాలం పాటు లాభదాయక వ్యాపారంగా పేటీఎంను తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. భారత్‌లో 50 కోట్ల చెల్లింపుల కస్టమర్లు, 10 కోట్ల వర్తకుల లక్ష్యం ఎంతో దూరంలో లేదన్నారు. వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి రాసిన లేఖలో శర్మ ఈ విషయాలు తెలియజేశారు. ఏఐ విస్తరణతో రిస్క్‌లు, మోసాల నుంచి ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌కు రక్షణ ఏర్పడుతుందన్నారు. చెల్లింపుల సాంకేతికత, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఎగుమతి చేయడానికి భారత్ ముందు అవకాశాలున్నట్టు చెప్పారు. ఈ మార్గంలో పేటీఎం ముందుంటుందని ప్రకటించారు. (హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: స్మార్ట్ఫోన్లు వచ్చేస్తున్నాయ్!) పేటీఎం ల్యాబ్ ఎప్పటికప్పుడు ఏఐ, బిగ్ డేటా ఫీచర్లను అభివృద్ధి చేస్తోందని చెబుతూ.. వినియోగదారులు, వర్తకులు పేటీఎం వినియోగించే విషయంలో విశ్వసనీయతకు ఇది దారితీస్తున్నట్టు చెప్పారు. చెల్లింపులు, రుణ సేవలకే పరిమితం కాకుండా, ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో లభించే వ్యాపార అవకాశాల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు శర్మ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఇందుకు సంబంధించి మంచి ఫలితాలను చూస్తారని వాటాదారులకు భరోసా ఇచ్చారు. ఈ దిశగా పేటీఎం నిపుణులు పనిచేస్తున్నట్టు చెప్పారు. -
ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఎలా అంటే?
మనం ఇప్పటి వరకు చాలా సక్సెస్ స్టోరీలు చదువుకున్నాం. పేదరికం నుంచి కుబేరులైన వ్యక్తుల గురించి.. ఉన్నత చదువులు వదిలి సక్సెస్ సాధించినవారు గురించి ఇలా ఎన్నెన్నో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ కొడుకు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఔరా అనిపించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతడు సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జన్మించిన 'విజయ్ శేఖర్ శర్మ' (Vijay Shekhar Sharma) స్కూల్ టీచర్ అయిన 'సులోమ్ ప్రకాష్' మూడవ కుమారుడు. చిన్నప్పుడు అలీఘర్ సమీపంలోని హర్దుగాంజ్ అనే చిన్న ప్రాంతంతో పాఠశాల విద్యను ప్రారంభించి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బిటెక్ పూర్తి చేసాడు. కంప్యూటర్ పట్ల ఆకర్షణ.. చదువుకునే రోజుల్లోనే విజయ్ను కంప్యూటర్ బాగా ఆకర్శించింది. దీంతో చాలా సమయం కంప్యూటర్లతోనే కాలం గడిపేవాడు. అయితే మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీ అతన్ని ఎంతగానో ఆకర్శించింది. ఇది అతన్ని ఒక కొత్త ఆలోచనలోకి తీసుకెళ్లింది. తత్ఫలితంగా 'పేటీఎమ్' (Paytm) యాప్ సృష్టించి కోట్లు సంపాదించడం మొదలుపెట్టాడు. ఆన్లైన్ పోర్టల్ ప్రారంభం.. అసాధారణ విజయాలన్నీ సాధారణ వ్యక్తుల నుంచి పుట్టుకొస్తాయనే మాట నిజం చేస్తూ.. విజయ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఎన్నెన్నో ఆటంకాలు, అపజయాలు చవి చూసిన తరువాత ఈ రోజు గొప్ప స్థాయికి చేరినట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. చదువు పూర్తయిన తరువాత తన క్లాస్‌మేట్‌తో కలిసి ఒక ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించి దాన్ని అతి తక్కువ కాలంలోనే ఇతరులకు విక్రయించారు. ఆ తరువాత 'వన్97 కమ్యూనికేషన్' పోర్టల్ ప్రారంభించారు. ప్రారంభంలో ఇది క్రికెట్ రేటింగ్ వంటి సమాచారం అందించేది. ఈ వెబ్సైట్ అనుకున్నంత సక్సెస్ పొందలేకపోయింది. తద్వారా.. తీవ్ర నష్టాలను మిగిల్చింది. దెబ్బతో అప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తం పోయింది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) రూ. 10 వేలకు ఉద్యోగం & పేటీఎమ్ స్థాపన.. అప్పటి వరకు సంపాదించిన మొత్తం డబ్బు పోవడంతో అప్పుడు చేయాల్సి వచ్చింది. రోజువారీ అవసరాలకు చిన్న చిన్న ఉద్యోగాలు రూ. 10 వేల జీతానికి పనిచేసినట్లు తెలిసింది. అయితే టెక్నాలజీని ఏ మాత్రం వదలకుండా 2011లో పేటీఎమ్ స్థాపించాడు. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఇది భారీ సక్సెస్ సాధించింది. కేవలం ఏడాది కాలంలో లక్షల సంఖ్యలో పేటీఎమ్ వ్యాలెట్స్ క్రియేట్ అయ్యాయి. అంతే కాకుండా మొదటి సారి జరిగిన పెద్ద నోట్ల ఈ యాప్‌కి మరింత గిరాకీ పెంచింది. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఎక్స్టర్ - టాటా పంచ్ ప్రత్యర్థిగా నిలుస్తుందా?) కొన్ని నివేదికల ప్రకారం, భారతదేశంలో పేటీఎమ్ ఉపయోగిస్తున్న భారతీయులు సుమారు 30 కోట్లు కంటే ఎక్కువ. అంతే కాకుండా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌కు కూడా విపరీతమైన ఆధారణ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర యూపీఐ యాప్‌లతో పేటీఎమ్ పోటీ పడుతోంది. ఈ యాప్ స్థాపించిన తరువాత విజయ్ ఆస్తులు విలువ రూ. 8,222 కోట్లకి చేరినట్లు, సంస్థ విలువ రూ. 55 వేల కోట్లు అని తెలుస్తోంది. -
ఒడిశా విషాదం:పేటీఎం కీలక నిర్ణయం..నెటిజన్ల ప్రశంసలు
డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఒడిశా రైలు ప్రమాదంలో బాధితుల సహాయార్థం కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం ద్వారా యూజర్లు అందించిన విరాళాలకు సమాన మొత్తంలో తాను కూడా చెల్లించ నుంది. ప్రమాదంలో బాధితులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు ఈ సొమ్మును వినియోగించనున్నారు. (జెరోధా ఫౌండర్, బిలియనీర్ నిఖిల్ కామత్ సంచలన నిర్ణయం) ఈ మేరకు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రతిజ్ఞ చేశారు. వినియోగదారులు చెల్లించిన ప్రతీ రూపాయిక మరో రూపాయి జోడించి.. ఇలా సేకరించిన నిధులను ఒడిశా ముఖ్యమంత్రి సహాయనిధి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని ప్రకటించారు. "విరాళం ఇచ్చిన మొత్తంపై 80జీ పన్ను మినహాయింపు పొందవచ్చు. Paytm యాప్‌లోని 'ఆర్డర్ & బుకింగ్స్' విభాగం నుండి రసీదులను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే తమ డొనేష్లనకుసంబంధించిన స్క్రీన్షాట్లను ట్విటర్లో పోస్ట్ చేశారు. (రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ఇదీ చదవండి: నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం Help the victims of the Odisha train tragedy 🙏 Paytm Foundation will match your contribution ₹ to ₹. A small donation can make a big difference❤️ Donate now on Paytm App: https://t.co/av9bdffnwS — Paytm (@Paytm) June 6, 2023 కాగా జూన్ 2న జరిగిన ప్రమాదంలో దాదాపు 288 మంది చనిపోయారని ఒడిశా ప్రభుత్వం తాజాగా ధృవీకరించింది. ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. దాదాపు 1,100 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కోసం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Contribute to Odisha Train tragedy victims through Paytm. We will match all your contributions ₹ to ₹. Thanks for your contributions 🙏🏼 https://t.co/QTQM1LhS4H — Vijay Shekhar Sharma (@vijayshekhar) June 5, 2023 -
పేటీఎంకు అలీబాబా షాక్: కంపెనీ నుంచి ఔట్
సాక్షి,ముంబై: చైనీస్ ఈ-కామర్స్, రిటైల్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం అలీబాబా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. One97 కమ్యూని కేషన్స్ (పేటీఎం) నుంచి పూర్తిగా నిష్క్రమించింది. బ్లాక్‌డీల్ ద్వారా రెండు కోట్లకు పైగా పేటీఎం షేర్లను విక్రయించింది. ఇండియా ఈకామర్స్ బిజినెస్‌లోకి భారీ పెట్టుబడులతో దూసుకొచ్చిన అలీబాబా (పేటీఎం)లో తన మొత్తం వాటాలను అమ్మేసింది. తాజా నివేదికల ప్రకారం బ్లాక్‌డీల్ ద్వారా శుక్రవారం మొత్తం 3.4 శాతం ఈక్విటీ లేదా 2.1 కోట్ల షేర్లను విక్రయించింది. జొమాటో, బిగ్‌బాస్కెట్ తరువాత తాజాగా అలీబాబా వాటాలను పూర్తిగి సెల్ చేసింది. ఎన్ఎస్ఈలో మొత్తం 4.73 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా చూపించింది. మొత్తం టర్నోవర్ రూ.3,097 కోట్లుగా ఉంది. రెండు వారాల సగటు 8 లక్షల షేర్లకు వ్యతిరేకంగా మొత్తం 19.61 లక్షల పేటీం షేర్లు బీఎస్ఈలో చేతులు మారాయి. ఫలితంగా పేటీఎం షేరు 7.85 శాతం తగ్గి రూ.650.75 వద్ద ముగిసింది. కాగా 2023లో ఇప్పటివరకు స్క్రిప్ 22 శాతం పెరిగింది. పేటీఎంలోని 6.26 శాతం ఈక్విటీ వాటా ఉన్న అలీబాబా జనవరిలో 3.1 శాతం విక్రయించింది. విజయ్ శేఖర్శర్మ నేతృత్వంలోని కంపెనీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.778.5 కోట్ల నష్టంతో పోలిస్తే 50 శాతం తగ్గి, డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలను రూ.392 కోట్లకు తగ్గించుకుంది. సాఫ్ట్‌బ్యాంక్ మద్దతున్న పేటీఎం ఆదాయం గత ఏడాది త్రైమాసికంలో రూ.1,456 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లను ఆర్జించింది. -
పేటీఎం బాస్‌గా శర్మ నియామకాన్ని ఆమోదించొద్దు
న్యూఢిల్లీ: పేటీఎం ఎండీ, సీఈవోగా విజయ్ శేఖర్ శర్మ పునర్ నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ ఇన్స్టిట్యూషనల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ (ఐఐఏఎస్) కీలక సూచన చేసింది. లిస్టెడ్ కంపెనీలు వాటాదారుల ముందు ఓటింగ్‌కు పెట్టే తీర్మానాలపై ఈ సంస్థ తన సలహా, సూచనలు చేస్తుంటుంది. పేటీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాధుర్ దియోరా పారితోషికానికి వ్యతిరేకంగా సూచన చేసింది. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ప్రెసిడెంట్, గ్రూపు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా దియోరా నియామకానికి (2022 మే 20 నుంచి ఐదేళ్లపాటు) అనుకూలంగా సూచించింది. ‘‘వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎం) షేరు ఐపీవో ఇష్యూ ధర రూ.2,150 నుంచి 63.6 శాతం పడిపోయింది. ఇది వాటాదారుల సంపదను హరించివేసింది. 2021–22 సంవత్సరంలో రూ.1,200 కోట్ల నగదు నష్టాలను ప్రకటించింది. 2022–23 మొదటి త్రైమసికంలోనూ నష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తానంటూ విజయ్ శేఖర్శర్మ గతంలో పలుమార్లు ప్రకటించారు. కానీ, అవేవీ ఆచరణలో కనిపించలేదు. కనుక కంపెనీకి నిపుణులతో కూడిన బోర్డు ఉండాలని మేము నమ్ముతున్నాం’’అని ఐఐఏఎస్ తన నివేదికలో పేర్కొంది. పదవీకాలంపై ఆందోళన విజయ్ శేఖర్ శర్మ రొటేషన్ పద్ధతిలో రిటైర్ కావాల్సిన అవసరం లేకపోవడం పట్ల ఐఐఏఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఎండీగా పదవీకాలం తర్వాత శర్మ నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో కొనసాగేట్టు అయితే బోర్డులో శాశ్వతంగా ఉండొచ్చు’’అని పేర్కొంది. బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల సీఈవోలతో పోలిస్తే అతడి పారితోషికం ఎక్కువగా ఉందని తెలిపింది. దీనిపై పేటీఎం సీనియర్ ఉద్యోగి ఒకరు స్పందిస్తూ.. ప్రాక్సీ సంస్థలు తమ సేవలు తీసుకుంటున్న క్లయింట్లకు కేవలం సూచనలు మాత్రమే చేస్తాయన్నారు. -
పేటీఎం చేతికి రహేజ క్యూబీఈ
ముంబై : పేటీఎం ఆర్థిక సేవలను విస్తరించేందుకు సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ముంబైకి చెందిన ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రహేజ క్యూబీఈని కొనుగోలు చేయనున్నారు. రహేజ క్యూబీఈలో నూరు శాతం వాటాను పేటీఎం కొనుగోలు చేస్తుందని, ముంబై సహా వివిధ ప్రాంతాల్లో పనిచేసే క్యూబీఈ ఉద్యోగులు యథావిథిగా కొనసాగుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఒప్పందం విలువ రూ 568 కోట్లుగా భావిస్తున్నారు. పేటీఎం మాతృసంస్థ ఒన్97 రహేజా క్యూబీఈ కొనుగోలును వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. పేటీఎం ఆర్థిక సేవల ప్రయాణంలో ఇది కీలక మైలురాయని, పేటీఎం కుటుంబంలోకి రహేజా క్యూబీఈని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నామని పేటీఎం ప్రెసిడెంట్ అమిత్ నయ్యర్ పేర్కొన్నారు. పటిష్టమైన నిర్వహణ బృందం కలిగిన రహేజా క్యూబీఈ కొనుగోలుతో జనరల్ ఇన్సూరెన్స్‌ను పెద్దసంఖ్యలో భారతీయుల చెంతకు చేర్చేందుకు తమకు ఉపకరిస్తుందని అన్నారు. రహేజా క్యూబీఈలో ప్రిస్మ్ జాన్సన్‌కు 51 శాతం వాటా ఉండగా క్యూబీఈ ఆస్ర్టేలియా 49 శాతం వాటా కలిగిఉంది. చదవండి : జర జాగ్రత్త.. జేబులోకి చొరబడుతున్నారు -
పేటీఎం ఫౌండర్ అనూహ్య నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డుకు ఆయన డిసెంబరు 2న ఒక లేఖ రాశారని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఇతర బాధ్యతల రీత్యా ఈ పదవినుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు విజయ్‌శేఖర్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నిబంధనల నేపథ్యంలో ఆయన పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. చెల్లింపుల బ్యాంక్ ఛైర్మన్ ఎన్బిఎఫ్సి (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ) డైరెక్టర్ పదవిని చేపట్టడాన్ని ఆర్బీఐ ఇటీవల నిషేధించింది. బ్యాంకుకు చెందిన సబ్సిడరీగా పేమెంట్ సంస్థ వుంటే తప్ప డైరెక్టర్ పదవిలో ఛైర్మన్ ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామమని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు సంస్థ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ లోహియాను డైరెక్టర్‌గా బోర్డు నియమించింది. కాగా పేటీఎం తన చెల్లింపుల బ్యాంకును 2017 మేలో భారతదేశంలో ప్రారంభించింది. -
టైమ్ జాబితాలో మోదీ, పేటీఎం విజయ్ శర్మ
-
టైమ్ జాబితాలో మోదీ, పేటీఎం విజయ్ శర్మ
టైమ్ పత్రిక ప్రతియేటా ప్రకటించే అత్యంత ప్రభావశీలురైన వంద మంది వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మలకు స్థానం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా ఈ జాబితాలో ఉన్నారు. డోనాల్డ్ ట్రంప్ ఇంకా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం పొందుతారా లేదా అన్నది కూడా ఇంకా నిర్ధారణ కాకముందే 2014 మే నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మోదీ ప్రధానమంత్రి అయ్యారని ఆ ప్రకటనలో చెప్పారు. దాదాపు మూడేళ్ల తర్వాత కూడా మోదీ ప్రభ ఏమాత్రం తగ్గలేదని, ప్రజలను సమ్మోహితులను చేయడంలో ఆయన అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయాన్ని కూడా అందులో ప్రస్తావించారు. ఇక పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అయితే భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు. నవంబర్ నెలలో భారత ప్రభుత్వం ఉన్నట్టుండి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు పేటీఎం విజయ్ ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకున్నారని తెలిపారు. 2016 ప్రారంభం నాటికి పేటీఎంకు 12.2 కోట్ల మంది యూజర్లుంటే, సంవత్సరాంతం నాటికి వారి సంఖ్య 17.7 కోట్లకు చేరుకుందని వివరించారు. చిన్న పల్లెటూరి నుంచి వచ్చి హిందీ మీడియంలో చదువుకుని దేశంలో డిజిటల్ ఎకానమీతో సంచలనం సృష్టించారన్నారు. టైమ్స్ పత్రిక ప్రతియేటా విడుదల చేసే 100 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో కళాకారులు, వ్యాపారవేత్తలు, నాయకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉంటారు.