Paytm Founder Vijay Shekhar Sharma Resigns As Paytm Financial Services Director - Sakshi
Sakshi News home page

పేటీఎం ఫౌండర్‌ అనూహ్య నిర్ణయం

Published Wed, Dec 11 2019 11:04 AM | Last Updated on Wed, Dec 11 2019 1:55 PM

Paytm founder Vi Shekhar Sharma steps down as Paytm Financial Services director - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు   పేటీఎం ఫైనాన్షియల్‌  సర్వీసెస్‌ బోర్డుకు ఆయన డిసెంబరు 2న ఒక లేఖ రాశారని  ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ నివేదించింది. ఇతర బాధ్యతల  రీత్యా  ఈ పదవినుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు విజయ్‌శేఖర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా నిబంధనల నేపథ్యంలో ఆయన పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. చెల్లింపుల బ్యాంక్ ఛైర్మన్‌ ఎన్‌బిఎఫ్‌సి (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ) డైరెక్టర్ పదవిని చేపట్టడాన్ని ఆర్‌బీఐ ఇటీవల నిషేధించింది. బ్యాంకుకు చెందిన సబ్సిడరీగా పేమెంట్‌ సంస్థ వుంటే తప్ప డైరెక్టర్‌ పదవిలో ఛైర్మన్‌ ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామమని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు సంస్థ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ లోహియాను డైరెక్టర్‌గా బోర్డు నియమించింది. కాగా పేటీఎం తన చెల్లింపుల బ్యాంకును 2017 మేలో భారతదేశంలో ప్రారంభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement