న్యూఢిల్లీ: ఆర్టిఫియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ స్టాక్ అభివృద్ధికి ఏఐపై పెట్టుబడులు పెడుతున్నట్టు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. మార్కెట్‌కు సేవలు అందించడం, దీర్ఘకాలం పాటు లాభదాయక వ్యాపారంగా పేటీఎంను తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. భారత్‌లో 50 కోట్ల చెల్లింపుల కస్టమర్లు, 10 కోట్ల వర్తకుల లక్ష్యం ఎంతో దూరంలో లేదన్నారు. వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి రాసిన లేఖలో శర్మ ఈ విషయాలు తెలియజేశారు. ఏఐ విస్తరణతో రిస్క్‌లు, మోసాల నుంచి ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌కు రక్షణ ఏర్పడుతుందన్నారు. చెల్లింపుల సాంకేతికత, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఎగుమతి చేయడానికి భారత్ ముందు అవకాశాలున్నట్టు చెప్పారు. ఈ మార్గంలో పేటీఎం ముందుంటుందని ప్రకటించారు. (హానర్ లవర్స్‌కు గుడ్ న్యూస్: స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్!)
పేటీఎం ల్యాబ్ ఎప్పటికప్పుడు ఏఐ, బిగ్ డేటా ఫీచర్లను అభివృద్ధి చేస్తోందని చెబుతూ.. వినియోగదారులు, వర్తకులు పేటీఎం వినియోగించే విషయంలో విశ్వసనీయతకు ఇది దారితీస్తున్నట్టు చెప్పారు. చెల్లింపులు, రుణ సేవలకే పరిమితం కాకుండా, ఓపెన్ నెట్‌వర్క్ ఆఫ్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)తో లభించే వ్యాపార అవకాశాల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు శర్మ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఇందుకు సంబంధించి మంచి ఫలితాలను చూస్తారని వాటాదారులకు భరోసా ఇచ్చారు. ఈ దిశగా పేటీఎం నిపుణులు పనిచేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment