ఏఐ మాయలో ‘పేటీఎం’ ఏం చేయబోతోందంటే? | Paytm CEO Vijay Shekhar Sharma Shares To-Do List Featuring Big AI Upgrades - Sakshi
Sakshi News home page

ఏఐ మాయలో ‘పేటీఎం’ ఏం చేయబోతోందంటే?

Published Tue, Dec 26 2023 12:17 PM | Last Updated on Tue, Dec 26 2023 12:59 PM

Paytm Ceo Vijay Shekhar Sharma Shares To Do List Featuring Big Ai Upgrades - Sakshi

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టెక‍్నాలజీ జాబ్‌ మార్కెట్‌లో  అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే అధిక సంఖ్యలో కంపెనీలు ఏఐని వినియోగిస్తున్నాయి. న్యూ ఇయర్‌ 2024లో ఏఐ టూల్స్‌ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వచ్చే ఏడాది తన గోల్‌ పేటీఎం సంస్థలో ఏఐని వినియోగించడం లక్ష్యమంటూ ఆ కంపెనీ అధినేత విజయ్‌ శేఖర్‌ శర్మ కామెంట్స్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. 

ప్రముఖ ఫిన్‌ టెక్‌ దిగ్గజం పేటీఎం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఖర్చు తగ్గించుకునే ప్రణాళిల్లో భాగంగా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల స్థానాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌తో భర్తీ చేయనుంది. ఈ తరుణంలో పేటీఎం యాప్‌లో చోటు చేసుకోనున్న మార్పుల గురించి ఆ సంస్థ అధినేత విజయ్‌ శేఖర్‌ శర్మ ఎక్స్‌.కామ్‌లో ప్రస్తావించారు. 

యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఇందులో భాగంగా పేటీఎం యాప్‌లో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్స్‌తో పాటు ఇతర పేమెంట్స్‌ బ్యాంక్స్‌ అనే కలిపే ఉన్నాయి. ఇప్పుడు వాటిల్లో నుంచి పేటీఎం పేటీఎం బ్యాంక్‌ను విడిగా హోమ్‌ స్క్రీన్‌లో అప్‌డేట్‌ చేయనున్నట్లు తెలిపారు. 

పేటీఎం ఉద్యోగులకు ఎఫెక్ట్‌
10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న టెక్నాలజీ, ప్రొడక్ట్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ ఏఐ టూల్స్‌ను వినియోగమే తన లక్ష్యమంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎప్పుడైతే పేటీఎంలో ఏఐ వినియోగం ఎక్కువైతే ఆ యాప్‌లో రిపీట్‌గా ఒకే పని చేసే ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. అదే సమయంలో పేటీఎం అనుసంధానంగా ఉన్న విభాగాల్లో మ్యాన్‌ పవర్‌ను పెంచనుంది. 

ఊహించిన దానికంటే ఎక్కువ 
పేటీంఎ యాప్‌లో ఏఐ ఉపయోగిస్తే ప్రొడక్ట్‌ డెవలప్‌ మెంట్‌ విభాగం మరింత సమర్ధవంతంగా మారే అవకాశం ఉందని భావిస్తుంది. అదే జరిగితే వారాల్లో జరిగే పని కేవలం రోజుల్లో జరగవచ్చని సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ విశ్లేషిస్తున్నారు. 

బయపడుతున్న ఉద్యోగులు
అయితే సీఈఓ పరిణామం ఎటు దారితీస్తుందోనని పేటీఎం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏఐ టూల్స్‌ వినియోగంతో భారీ మొత్తంలో ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. అదే ఏఐని వచ్చే ఏడాది మరింత విస్తృతంగా వాడుకుంటే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని బయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement