Payments Bank
-
పేమెంట్స్ వాచ్.. చేతికుంటే చాలు!
డిజిటల్ యుగంలో పేమెంట్స్ విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చెల్లింపు లావాదేవీలన్నీ ఎక్కువగా స్మార్ట్ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్లతోపాటు స్మార్ట్ వాచ్‌ల వినియోగం కూడా పెరుగుతన్న క్రమంలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.నాయిస్ కంపెనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తోంది. తాజాగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో దీన్ని పరిచయం చేసింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంటిగ్రేటెడ్ రూపే చిప్ ఉంటుంది. దీన్ని ధరించి మణికట్టు నుంచే ‘మనీ’ లావాదేవీలు పూర్తి చేయొచ్చన్నమాట. పేమెంట్స్-కమ్-ఫిట్నెస్ సొల్యూషన్‌గా వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లో హెల్త్, ఫిట్నెస్ మానిటరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.స్మార్ట్‌వాచ్ ఫీచర్లుఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో డైరెక్ట్, ‘ఆన్ ద గో’ పేమెంట్స్ కోసం డయల్‌లో ఎంబెడెడ్ రూపే చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్సీఎంసీ ఇంటిగ్రేషన్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ట్యాప్ అండ్ పే లావాదేవీలకు మద్దతునిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ సౌజన్యంతో దేశంలోని మెట్రోలు, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు ఇంకా మరెన్నో చోట్ల స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్‌తో పనిలేకుండా దీని ద్వారా రూ. 5,000 వరకూ పేమెంట్స్ చేయొచ్చు.ఇక హెల్త్, ఫిట్నెస్ ఫీచర్ల విషయానికి వస్తే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, బీపీ పర్యవేక్షణ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 130 స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేయగలదు. 150కి పైగా క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉందని ఎయిర్టెల్ తెలిపింది.ఇది ఇతర స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్లు, కాల్ రిమైండర్లు, సందేశాలను కూడా ప్రదర్శిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ స్మార్ట్‌వాచ్ ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాంక్ ఆన్లైన్, రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి త్వరలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. -
పేటీఎంకు భారీ ఊరట..
-
లాభాలపై రూ. 500 కోట్ల ప్రభావం
న్యూఢిల్లీ: పేటీఎం పేమెట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల వల్ల తమ వార్షిక నిర్వహణ లాభాలపై రూ. 300–500 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చని ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం అంచనా వేసింది. పీపీబీఎల్ డిపాజిట్లను స్వీకరించకుండా విధించిన ఆంక్షలతో, కస్టమర్లు తమ వాలెట్లలో డబ్బును డిపాజిట్ చేసే అవకాశం లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. అయితే, లాభదాయకతను మెరుగుపర్చుకునే దిశగా తమ ప్రయాణం ముందుకు కొనసాగుతుందని వివరించింది. డిసెంబర్లో పీపీబీఎల్ ద్వారా 41 కోట్ల యూపీఐ రెమిటెన్సుల లావాదేవీలు జరిగాయి. పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌కి (ఓసీఎల్) పీపీబీఎల్‌లో 49 శాతం వాటాలు ఉన్నాయి. 50 శాతం లోపు మైనారిటీ వాటాలే ఉన్నందున దాన్ని అనుబంధ సంస్థగా కాకుండా అసోసియేట్ సంస్థగా పరిగణిస్తోంది. ఒక పేమెంట్స్ కంపెనీగా పీపీబీఎల్‌తో పాటు వివిధ బ్యాంకులతో ఓసీఎల్ కలిసి పని చేస్తోందని పేటీఎం తెలిపింది. తాజా పరిణామం కారణంగా ఇకపై పీపీబీఎల్‌తో కాకుండా ఇతర బ్యాంకులతో మాత్రమే ఓసీఎల్ పని చేస్తుందని వివరించింది. పదే పదే నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఫిబ్రవరి 29 నుంచి కస్టమర్ల ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లు మొదలైన వాటిల్లో డిపాజిట్లు, టాప్‌అప్‌లను స్వీకరించరాదంటూ పీపీబీఎల్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
ఏఐ మాయలో ‘పేటీఎం’ ఏం చేయబోతోందంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ జాబ్ మార్కెట్లో అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే అధిక సంఖ్యలో కంపెనీలు ఏఐని వినియోగిస్తున్నాయి. న్యూ ఇయర్ 2024లో ఏఐ టూల్స్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వచ్చే ఏడాది తన గోల్ పేటీఎం సంస్థలో ఏఐని వినియోగించడం లక్ష్యమంటూ ఆ కంపెనీ అధినేత విజయ్ శేఖర్ శర్మ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఖర్చు తగ్గించుకునే ప్రణాళిల్లో భాగంగా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌తో భర్తీ చేయనుంది. ఈ తరుణంలో పేటీఎం యాప్‌లో చోటు చేసుకోనున్న మార్పుల గురించి ఆ సంస్థ అధినేత విజయ్ శేఖర్ శర్మ ఎక్స్.కామ్‌లో ప్రస్తావించారు. Making my todo list for 2024. 📋 What will you like to change/ upgrade in Paytm app ? 📲 We have changed new Paytm app’s Home Screen. Paytm Payments Bank and Other group entities’ offerings are clearly separated now. Makes it cleaner view. ✅ Expanding AI led customer care.… — Vijay Shekhar Sharma (@vijayshekhar) December 24, 2023 యూజర్ల ఎక్స్పీరియన్స్ కోసం ఇందులో భాగంగా పేటీఎం యాప్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్‌తో పాటు ఇతర పేమెంట్స్ బ్యాంక్స్ అనే కలిపే ఉన్నాయి. ఇప్పుడు వాటిల్లో నుంచి పేటీఎం పేటీఎం బ్యాంక్‌ను విడిగా హోమ్ స్క్రీన్‌లో అప్డేట్ చేయనున్నట్లు తెలిపారు. పేటీఎం ఉద్యోగులకు ఎఫెక్ట్ 10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న టెక్నాలజీ, ప్రొడక్ట్, ఇంజినీరింగ్ విభాగాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ టూల్స్‌ను వినియోగమే తన లక్ష్యమంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఎప్పుడైతే పేటీఎంలో ఏఐ వినియోగం ఎక్కువైతే ఆ యాప్‌లో రిపీట్‌గా ఒకే పని చేసే ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. అదే సమయంలో పేటీఎం అనుసంధానంగా ఉన్న విభాగాల్లో మ్యాన్ పవర్‌ను పెంచనుంది. ఊహించిన దానికంటే ఎక్కువ పేటీంఎ యాప్‌లో ఏఐ ఉపయోగిస్తే ప్రొడక్ట్ డెవలప్ మెంట్ విభాగం మరింత సమర్ధవంతంగా మారే అవకాశం ఉందని భావిస్తుంది. అదే జరిగితే వారాల్లో జరిగే పని కేవలం రోజుల్లో జరగవచ్చని సీఈవో విజయ్ శేఖర్ శర్మ విశ్లేషిస్తున్నారు. బయపడుతున్న ఉద్యోగులు అయితే సీఈఓ పరిణామం ఎటు దారితీస్తుందోనని పేటీఎం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏఐ టూల్స్ వినియోగంతో భారీ మొత్తంలో ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. అదే ఏఐని వచ్చే ఏడాది మరింత విస్తృతంగా వాడుకుంటే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని బయపడుతున్నారు. -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు కొత్త కార్డులు, ఆఫర్ ఏంటంటే!
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్‌ను ప్రారంభించింది. పర్యావరణ హితంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పొదుపు బ్యాంకు ఖాతాలను కలిగి తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డులు ఆవిష్కరించింది. అంతేకాకుండా, మార్కెట్లోని సాంప్రదాయ PVC కార్డులతో పోలిస్తే, తమ 50,000 కార్డుల ప్రతి బ్యాచ్ 350 కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్డ్‌లను తీసుకురానున్నామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. పర్యావరణ అనుకూలమైన ఆర్-పీవీసీ మెటీరియల్‌తో దీన్ని తయారు చేసినట్లు సంస్థ సీవోవో గణేష్ అనంతనారాయణన్ తెలిపారు. సాంప్రదాయ పీవీసీ కార్డులతో పోలిస్తే వీటి ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు తగ్గగలవని, హైడ్రోకార్బన్ల వినియోగం గణనీయంగా తక్కువ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. తొలుత క్లాసిక్ వేరియంట్లో పర్సనలైజ్డ్, ఇన్‌స్టా కార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. వీటితో రూ. 10,000 వరకు విలువ చేసే ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. -
భారతీయులకు యాపిల్ భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారతీయులకు భారీ షాకిచ్చింది. యాప్ స్టోర్‌లో యాప్‌లు, సబ్స్క్రిప్షన్ల కోసం డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు స్వస్తి పలికింది. యూజర్లు అల్ట్రనేట్గా చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని యాపిల్ తన బ్లాగ్‌లో స్పష్టం చేసింది. మనదేశానికి చెందిన వినియోగదారులు తాము సేవ్ చేసిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లతో యాప్ సబ్స్క్రిప్షన్లపై చెల్లింపులు చేయలేకపోతున్నామంటూ యాపిల్ సంస్థకు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన యాపిల్ యాజమాన్యం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ను నిలిపివేసింది. అయితే వినియోగదారులు తమ యాపిల్ ఐడీలో ఉన్న బ్యాలెన్స్‌తో యాప్‌లు, సబ్స్క్రిప్షన్ల చెల్లింపులు చేసుకోవచ్చు. యాపిల్ ఐడీలో మరింత బ్యాలెన్స్ కావాలనుకుంటే యాప్ స్టోర్ కోడ్లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐలను వినియోగించుకోవచ్చు. చదవండి👉 ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా! టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్! -
ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
వాట్సాప్ ! ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ఫోన్ లో ఎక్కువగా వినియోగించే యాప్. ఈ యాప్ తో స్నేహితులతో ముచ్చట్లు, కుటుంబ సభ్యులతో సంభాషణలు, నచ్చిన వారితో గిల్లిగజ్జాలు. ఇలా ఒకటేమిటి.‘వాట్సాప్’ గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత హిస్టరీయే ఉంది. అయితే ఇన్ని రోజులు వాట్సాప్ లో చాటింగ్ చేసిన మనం ఇకపై ఆర్ధిక లావాదేవీలను జరుపుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. చదవండి: సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామయ్యంలో వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను మంగళవారం ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.గూగుల్ పే తరహాలో మనీ ట్రాన్స్ ఫర్ చేసేందుకు రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. ఈ సందర్భంగా వాట్సాప్ పేమెంట్ డైరక్టర్ మనేష్ మహాత్మే మాట్లాడుతూ.. వాట్సాప్ నుంచి 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.వాట్సాప్ ద్వారా మనీ సెండ్ చేయడం.. అదే వాట్సాప్ నుంచి మనీ తీసుకోవడం అనేది ట్రాన్సాక్షన్ మాత్రమే. కానీ యూజర్లు వారి భావాల్ని ఒకరికొకరు పంచుకోవడం వెలకట్టలేనిది. అందుకే భవిష్యత్‌లో వాట్సాప్‌కు మరిన్ని ఫీచర్లను అప్డేట్ చేయనున్నట్లు తెలిపారు. వాట్సాప్ నుంచి డబ్బులు పంపడం ఎలా? ♦ ముందుగా వాట్సాప్ డ్యాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి ♦ రైట్ సైడ్ టాప్ లో ఉన్న మూడు డాట్స్ పై ట్యాప్ చేయాలి ♦ ట్యాప్ చేస్తే మీకు న్యూ గ్రూప్, న్యూ బ్రాడ్ కాస్ట్, లింక్డ్ డివైజెస్, స్టార్డ్ మెసేజెస్ తో పాటు చివరిగా పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ♦ ఆ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ♦ అలా పేమెంట్ మెథడ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే పేమెంట్స్ ఆప్షన్ తో డ్యాష్ బోర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో కంటిన్యూ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి ♦ కంటిన్యూ ఆప్షన్ తరువాత మీకు నచ్చిన బ్యాంక్ ను సెలక్ట్ చేసుకోవాలి. ♦ అనంతరం మీ కాంటాక్ట్ నెంబర్ ను వెరిఫై చేసుకోవాలి ♦ వెరిఫై తరువాత.. న్యూ పేమెంట్ ఆప్షన్ లో మీరు ఎవరికైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ నెంబర్ మీద క్లిక్ చేసి..డబ్బులు పంపించుకోవచ్చు. -
మోసపూరిత యాప్‌లకు పేటీఎం చెక్
న్యూఢిల్లీ: అనుమానాస్పద కార్యకలాపాలను కొనసాగించే మొబైల్ అప్లికేషన్లను గుర్తించి వాటికి చెక్ పెట్టే అధునాతన ఫీచర్‌ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘రోగ్’ పేరిట ఈ ఫీచర్‌ను అందిస్తోంది. మోసపూరిత లావాదేవీలను పసిగట్టి.. ఏ యాప్ ద్వారా సమాచారం చేరిందో తెలుసుకుని, అటువంటి యాప్‌లను గుర్తించి వాటిని అన్ఇన్స్టాల్ చేయమని వినియోగదారులకు సూచిస్తుంది. -
ఐడియా పేమెంట్స్ బ్యాంక్ మూసివేత!
ముంబై: మరో పేమెంట్స్ బ్యాంక్ మూసివేత ఖరారైంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లిక్విడేషన్‌కు తాజాగా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద మూసివేత కోసం ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హై కోర్ట్ ఈ ఏడాది సెపె్టంబర్ 18న ఆదేశాలు జారీ చేసిందని ఆర్బీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిక్విడేటర్‌గా విజయ్‌కుమార్ వి అయ్యర్‌ను బాంబై హై కోర్ట్ నియమించిందని వివరించింది. అయ్యర్ డెలాయిట్ టచ్ తొమత్సు ఇండియా ఎల్ఎల్పీలో సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని, దీంతో ఈ వ్యాపారాన్ని నిర్వహించలేమని, స్వచ్ఛంద మూసివేతను ఈ ఏడాది జూలైలోనే ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. 2015 ఆగస్టులో ఆర్బీఐ మొత్తం 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంకింగ్ కార్యకలాపాల లైసెన్స్‌లను ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించింది. నాలుగో కంపెనీ...: పేమెంట్స్ బ్యాంకింగ్ రంగం నుంచి వైదొలగిన నాలుగో కంపెనీగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. గతంలో దిలిప్ సంఘ్వి, ఐడీఎఫ్సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ల కన్సార్షియంతో పాటు టెక్ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్మెంట్లు ఈ రంగం నుంచి వైదొలిగాయి. -
ఐసీఐసీఐ లైఫ్‌తో ఎయిర్టెల్ బ్యాంక్ జట్టు
ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఐసీఐసీఐ ప్రూ లైఫ్ జీవిత బీమా పాలసీలతో పాటు ఇతరత్రా పొదుపు పథకాలను కూడా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు సులభతరంగా పొందేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. చౌక ప్రీమియంలతో మెరుగైన పథకాలను అందించడం, టెక్నాలజీని వినియోగించుకుని కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు ఐసీఐసీఐ ప్రూ లైఫ్ ఎండీ ఎన్ఎస్ కణ్ణన్ తెలిపారు. -
ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంకు ఆరంభం
ముంబై: ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించినట్టు ఆర్బీఐ తెలియజేసింది. 2014లో ఎన్ఎస్డీఎల్కు ఆర్బీఐ పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్ జారీ చేసింది. ఆ ఏడా మొత్తంగా 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్‌లిచ్చింది. వీటిలో ఇప్పటి వరకు ఎయిర్టెల్, పేటీఎం, ఫినో, ఆదిత్య బిర్లా ఐడియా, జియో, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కాల్/ నోటీసు /టర్మ్ మనీ మార్కెట్లో బారోవర్ (రుణ గ్రహీత), లెండర్ (రుణదాత)గా పాల్గొనవచ్చని మరో నోటిఫికేషన్లో ఆర్బీఐ తెలియజేసింది. -
నేడే పోస్టల్ బ్యాంక్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)ను శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో బ్యాంక్ ప్రారంభోత్సవం జరగనుండగా.. ఏకకాలంలో 650 శాఖలు, 3250 కేంద్రాల వద్ద పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన సమ్మిళిత వృద్ధిలో ఈ బ్యాంక్ పాత్ర కీలకం కానుందని పేర్కొంది. వంద శాతం ప్రభుత్వ వాటాను కలిగిన తపాలా శాఖలో 3 లక్షలకు మించి గ్రామీణ్ డాక్ సేవక్‌లు, పోస్ట్మ్యాన్లు ఉండగా.. వీరందరి ద్వారా విస్తృత స్థాయిలో సేవలను అందించనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1.55 లక్షల పోస్ట్ ఆఫీసులకు ఐపీపీబీ నెట్వర్క్ అనుసంధానం కానుంది. -
సెప్టెంబర్ 1న పోస్ట్ బ్యాంక్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రారంభోత్సవ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటిగా ఖరారైనట్లు ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బ్యాంక్ ప్రారంభంకానున్నట్లు తెలిపారు. ఆగస్టు 21న ప్రారంభంకావాల్సిన ఐపీపీబీ.. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలపై అత్యధికంగా దృష్టిసారించనున్న తమ పేమెంట్స్ బ్యాంక్.. ప్రతి జిల్లాలోనూ ఒక శాఖను కలిగి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. -
జియో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభం
ముంబై: జియో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని ఆర్బీఐ తాజాగా పేర్కొంది. 2015 ఆగస్టులో పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం పొందిన 11 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒకటి. పేమెంట్స్ బ్యాంక్‌గా జియో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యాయని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తొలిగా 2016 నవంబర్‌లో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించింది. -
మొబైల్‌కు ఒకే...పేమెంట్స్ బ్యాంకుకు షాక్
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సేవల సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు చుక్కెదురైంది. సంస్థకు చెందిన పేమెంట్స్ బ్యాంకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈకేవైసీ సౌకర్యాన్ని పునరుద్దరించడానికి యూఐడీఏఐ నిరాకరించింది. అయితే ఎయిర్టెల్ మొబైల్ సేవలకు మాత్రం ఈకేవైసీ సేవలు వినియోగించుకునేందుకు జనవరి 10 వరకు అనుమతినిచ్చింది. దాదాపు 55.63 లక్షల ఖాతాదారులకు రూ.138కోట్ల (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్)ను అందించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈకేవైసీ లైసెన్స్‌పై రిజర్వ్‌బ్యాంక్ అంతిమ విచారణ, ఆడిట్ నివేదిక వచ్చేంతవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) స్పష్టం చేసింది. ఆధార్ ఆధారిత ఈకేవైసీతో మొబైల్ చందాదారుల ధ్రువీకరణలు ఇకపైనా పూర్తి చేసేందుకు వీలు కానుంది. మార్చి 31 తర్వాత కొన్ని పరిమితుల మేరకు ఆధార్ ఈకేవైసీ లైసెన్స్‌ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి సంబంధిత ఆడిట్ నిర్వహించాల్సిందిగా ఎయిర్‌టెల్‌ను, రిజర్వ్‌బ్యాంకును యుఐడిఎఐ ఆదేశించింది. ఎయిర్టెల్ సిస్టమ్స్, దరఖాస్తులు, డాక్యుమెంటేషన్ తదితర అంశాలు లైసెన్సింగ్ నిబంధనలకనుగుణంగా ఉన్నవీ లేనిదీ ధృవీకరించాలని కోరింది. టెలికం శాఖతో కలిసి తాము నిర్వహించిన ఆడిట్లో బయటపడిన లోపాలను కంపెనీ సవరించింది. కనుక లైసెన్స్‌ను పొడిగిస్తున్నామని యూఐడీఏఐ తెలిపింది. అలాగే ఆధార్ చట్టం ప్రకారం ఎయిర్టెల్ ప్రతి త్రైమాసికానికి రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందనీ పేర్కొంది. అటు ఈ పరిణామంపై ఎయిర్టెల్ ప్రతినిధి స్పందిస్తూ.. ఆధార్ ఆధారిత ఈకేవైసీ సేవలకు తమకు అనుమతి లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. తమ మొబైల్ రిజర్వ్ బ్యాంకు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈకేవైసీపై ఉన్న నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఎయిర్ టెల్ తన చందాదారులకు తెలియకుండానే వారి పేరిట పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం తెలిసిందే. దీంతో ఆయా చందాదారుల గ్యాస్ సబ్సిడీలు వచ్చి ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో పడడంతో వివాదం చెలరేగింది. దీంతో ఈకేవైసీని దుర్వినియోగిం చేసిందన్న ఆరోపణలపై పేమెంట్స్ బ్యాంకుకు ఆ సేవలను యూఐడీఏఐ నిలిపివేసిన విషయం తెలిసిందే. -
భవిష్యత్తులో మరిన్నిఉద్యోగాలు: పేమెంట్స్ బ్యాంకు
సాక్షి,న్యూఢిల్లీ: ఈ-వాలెట్ దిగ్గజం పేటీఎం తన చెల్లింపుల సంస్థ పేమెంట్స్ బ్యాంకు సేవలను అధికారికంగా ప్రారంభించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధికారికంగా మంగళవారం ఈ బ్యాంక్‌ను లాంచ్ చేశారు. ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేసిన పేమెంట్స్ బ్యాంక్ సేవలను కేంద్ర ఆర్థికమంత్రి చేతులమీదుగా అధికారికంగా సేవలను ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇటీవల అమల్లోకి వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల నగదు లావాదేవీల ప్రాబల్యం మారుతోందని అరుణ్ జైట్లీ పేర్కొనఆరు. కొత్త చెల్లింపుల బ్యాంకు లాంచింగ్ ద్వారా చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబడిందన్నారు. దేశంలో ఆర్థికవ్యవస్థ చేరికలను మరింత విస్తరించిందని తెలిపారు. దాదాపు ప్రతిరోజు ఒకకొత్త ఆవిష్కరణతో ఆర్ధికవ్యవస్థ మరింత సాధారణీకరణకు దారితీస్తుందన్నారు. కేవలం నగదు ద్వారా లావాదేవీలు జరిపే అలవాటు క్రమంగా మారిపోతోందని జైట్లీ తెలిపారు. భారత దేశం ఆర్థికవిప్లవం శిఖర భాగాన ఉందని పే టీఎం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఫిజికల్ ఏటీఎంల స్థాపనకు పేటీఎం పనిచేస్తోందన్నారు. ఆర్థిక సేవల విప్లవంలో పేటీ ఎం భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు. అలాగే భవిష్యత్తులోదేశంలో అనేక ఉద్యోగాలు లభించనున్నాయనీ, లాంగ్ రన్లో భారీ ఉద్యోగాల కల్పనకు తాము కృషి చేస్తామన్నారు. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ద్వారా ఆన్లైన్ లావాదేవీలు ఉచితం. ఉచితంగా డిజిటల్ రుపే డెబిట్ కార్డును అందిస్తుంది. పొదుపు ఖాతాలపై 4-7 శాతం, ఫిక్స్డ్ డిపాజిట్లపై 7శాతం దాకా వడ్డీరేటును అందిస్తోంది. 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు వేస్తున్న పేటీఎం పేమెంట్స్..వినియోగదారులు బ్యాంక్ ఖాతాలను తెరిచేందుకు వీలుగా దేశమంతటా కేవైసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో హైక్ జట్టు
న్యూఢిల్లీ: దేశీ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘హైక్’ తాజాగా తన యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైక్ యూజర్లు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన మర్చంట్, యుటిలిటీ పేమెంట్ సర్వీసులు పొందొచ్చు. ఎక్కువ మంది భారతీయులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి, వారికి సులభ లావాదేవీల సర్వీసులు అందించేందుకు ఎయిర్టెల్ తమకు మద్దతునిస్తోందని హైక్ మెసేంజర్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్టŠస్) పతీక్ షా తెలిపారు. అత్యుత్తమ డిజిటల్ పేమెంట్స్ సేవలు అందించేందుకు హైక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీవోవో ఎ.గణేశ్ పేర్కొన్నారు. కాగా 2012లో ప్రారంభమైన హైక్‌కు ప్రస్తుతం 10 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. తన వాలెట్ సర్వీసుల్లో 30 శాతానికిపైగా నెలవారీ వృద్ధి నమోదవుతోంది. భారతీ ఎంటర్ప్రైజెస్, సాఫ్ట్‌బ్యాంక్ జాయింట్ వెంచర్ ఇది. -
పేటీఎం బ్యాంక్ కార్యకలాపాలు షురూ
⇔ 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ⇔ 2020 నాటికి 50 కోట్ల మంది ఖాతాదారుల టార్గెట్ న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మంగళవారం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది. అలాగే కనీస బ్యాలెన్స్ నిబంధనలు ఉండబోవని, ఆన్లైన్ లావాదేవీలకు (నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ మొదలైనవి) ఫీజులు ఉండవని పేర్కొంది. ఎయిర్టెల్, ఇండియా పోస్ట్ తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన సంస్థల్లో పేటీఎం మూడోది. చైనా దిగ్గజం ఆలీబాబా, జపాన్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న పేటీఎం.. రెండేళ్లలో తమ బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణ కోసం ప్రాథమికంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తొలి ఏడాదిలో సంస్థ31 శాఖలు, 3,000 పైచిలుకు కస్టమర్ సర్వీస్ పాయింట్స్‌ను ప్రారంభించనుంది. కస్టమరు ఖాతాలో రూ. 25,000 డిపాజిట్లు దాటితే రూ. 250 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించిన పేటీఎం.. డిపాజిట్లపై ఈ తరహా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇవ్వడం ఇదే ప్రథమమని పేర్కొంది. వ్యాపార వర్గాల కోసం కరెంటు అకౌంట్లు కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ‘ఒక కొత్త తరహా బ్యాంకింగ్ మోడల్‌ను రూపొందించేందుకు ఆర్బీఐ మాకు అవకాశం కల్పిం చింది. మా ఖాతాదారుల డిపాజిట్లు.. సురక్షితమైన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా జాతి నిర్మాణంలో పాలుపంచుకోనుండటం గర్వకారణం. డిపాజిట్లేవీ రిస్కులున్న సాధనాల్లోకి మళ్లించడం జరగదు‘ అని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెక్నాలజీ తోడ్పాటుతో 2020 నాటికల్లా 50 కోట్ల మంది ఖాతాదారులకు విశ్వసనీయ బ్యాంకుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు బ్యాంక్ సీఈవో రేణు తెలిపారు. 22 కోట్ల మంది వాలెట్ యూజర్లు... ప్రస్తుతం పేటీఎం డిజిటల్ వాలెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య 22 కోట్లుగా ఉంది. ఈ వాలెట్స్‌ను సంస్థ పేమెంట్ బ్యాంకుకు మళ్లించనుంది. యూజర్లు అకౌంటు ప్రారంభించేందుకు ఖాతాదారుల వివరాల వెల్లడి నిబంధనల (కేవైసీ) ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేవైసీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. తొలి దశలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు ఆహ్వాన ప్రాతిపదికన ఉండనున్నాయి. బ్యాంకింగ్ బీటా యాప్ ఉద్యోగులు, అనుబంధ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పేటీఎం కస్టమర్లు బ్యాంక్ వెబ్సైట్ లేదా యాపిల్ ఐవోఎస్ ప్లాట్‌ఫాంలోని పేటీఎం యాప్ ద్వారా ఇన్విటేషన్ పొందవచ్చు. -
పేటీఎం పేమెంట్ బ్యాంకు వడ్డీరేటు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: పే మెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించనున్న ఇ-వాలెట్ అగ్రగామి పేటీఎం తన పేమెంట్ బ్యాంక్ మొట్టమొదటి శాఖను నేడు( మే 23, మంగళవారం) ఢిల్లీలో ప్రారంభించనుంది. ఈ సందర్బంగా వినియోగదారులకు చెల్లించనున్న వార్షిక వడ్డీరేటును ప్రకటించింది. దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం తరువా , కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పేటీఎం తన చెల్లింపుల బ్యాంకును లాంచ్ చేస్తోంది. ఢిల్లీలో మొదట శాఖను ప్రారంభించనున్నామని, ఇతర మెట్రో నగరాల్లో రెండో విడత ప్రారంభిస్తామని 'పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. మూడు నెలలు తర్వాత రెండో విడతను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు దేశంలోని మొత్తం మూడు చెల్లింపులు (ఎయిర్టెల్, ఇండియా పోస్ట్) బ్యాంకులలో అత్యల్పంగా వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. ఏడాదికి ఎయిర్టెల్ 7.25 శాతం, ఇండియా పోస్ట్ 5.5 శాతం వడ్డీని అందిస్తోంటే పేటీఎం మాత్రం వినియోగదారులకు 4శాతం వార్షిక వడ్డీ రేటును అందించనున్నట్టు తెలిపింది. అలాగే డిపాజిట్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను వెల్లడించింది. 2020 నాటికి కంపెనీ 500 మిలియన్ల ఖాతాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రణూ సత్తీ చెప్పారు. ఈ నేపథ్యంలో మొదటి శాఖను నోయిడాలో మంగళవారం ప్రారంభించనుంది. ఈ సంవత్సరంలో 31 శాఖలు, 3,000 కస్టమర్ సర్వీస్ పాయింట్లు తెరవాలని యోచిస్తోంది. చెల్లింపుల బ్యాంకులో ఖాతా తెరిచిన మొట్టమొదటి మిలియన్ కస్టమర్లకు రు .25,000 డిపాజిట్లపై రూ.250ల స్పాట్ క్యాష్ బ్యాక్ అందిస్తామని, అన్ని ఆన్లైన్ లావాదేవీలు ఉచితమని కంపెనీ తెలిపింది. దీంతోపాటు వినియోగదారులకు రుపే కార్డులు అందిస్తుంది. అలాగే నెలకు ఐదు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితం (నాన్ మెట్రో నగరాల్లో) . ఆ తరువాత, వినియోగదారులు ప్రతి ఉపసంహరణకు రూ. 20 రూపాయలు చెల్లించాలి. తమ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసెకోవాల్సిందిగా ఇప్పటికే గత 48 గంటల్లో 2.20 కోట్ల మెసేజ్‌లను పంపించింది. మరోవైపు ఎయిర్టెల్ పేమెంట్‌బ్యాంకు ప్రతి నగదు ఉపసంహరణపై 0.65 శాతం వసూలు చేస్తుండగా, ప్రస్తుతం ఉన్న చెల్లింపుల బ్యాంకుల్లో ఇండియా పోస్ట్ మాత్రం ఇది తన ఖాతాదారులకు భారతదేశం పోస్ట్ ఎటిఎం నుంచి నగదును తీసుకోవడానికి కార్డును అందిస్తోంది. కాగా దేశంలో మొట్టమొదటి చెల్లింపులన బ్యాంకును ఎయిర్ టెల్ ప్రారంభించింది. ఆ తర్వాత ఇండియాపోస్ట్ ఎయిర్‌టెల్‌ను అనుసరించింది. -
పేటీఎంలోకి రూ.9,079 కోట్లు
♦ జపాన్ సాఫ్ట్‌బ్యాంకు నుంచి సమీకరణ ♦ పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలకు ఊతం ♦ 50 కోట్ల కస్టమర్ల లక్ష్యం న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్ సంస్థ పేటీఎం, పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాల ఆరంభంతో దేశీయ మార్కెట్లో తన దూకుడును మరింత పెంచనుంది. ఈ సంస్థ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు నుంచి తాజాగా 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9.079 కోట్లు) సమీకరించింది. ఈ నెల 23 నుంచి పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించనున్న ఈ సంస్థ తన కార్యకలాపాల విస్తృతికి తాజా నిధులు తోడ్పడనున్నాయి. దేశీయంగా ఓ స్టార్టప్‌లో పెట్టిన భారీ పెట్టుబడుల మొత్తం ఇది. డిజిటల్ సేవల విస్తృతిని ప్రోత్సహించాలన్న భారత ప్రభుత్వం విధానానికి అనుగుణంగా... కోట్లాది మంది వినియోగదారులు, విక్రయదారులకు డిజిటల్ అనుసంధానాన్ని కల్పించడం ద్వారా మొబైల్ చెల్లింపులు సహా ఆర్థిక సేవల విస్తృతికి కట్టుబడి ఉన్నామని సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు చైర్మన్, సీఈవో మసయోషిసన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పేటీఎంకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. దేశీయంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న ప్రణాళికతో ఉన్న సాఫ్ట్‌బ్యాంకు స్నాప్‌డీల్, ఓలా, హౌసింగ్ డాట్ కామ్ తదితర కంపెనీల్లో 2 బిలియన్ డాలర్లను ఇప్పటి వరకూ ఇన్వెస్ట్ చేసింది. వీటిలో అధిక భాగం చేదు ఫలితాలనే మిగిల్చాయి. వీటిలో గణనీయమైన పెట్టుబడులను నష్టాల కింద కోల్పోవడం గమనార్హం. తీవ్ర నష్టాల్లో ఉన్న స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్టులో విలీనం చేసే ప్రయత్నాల్లోనూ ఉన్న విషయం తెలిసిందే. అయితే, చైనాలో అలీబాబా గ్రూపు ఆర్థిక సేవల విషయంలో సాధించిన గొప్ప విజయం తరహాలోనే పేటీఎం కార్యకలాపాలూ ఉండడంతో ఈ సంస్థపై సాఫ్ట్‌బ్యాంకు ఎక్కువ అంచనాలను పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పేటీఎం చైనా చిప్ మేకర్ మీడియాటెక్ నుంచి 6 కోట్ల డాలర్ల(రూ.380కోట్లు)ను గతేడాది సమీకరించింది. మూడేళ్లలో రూ.10,000 కోట్లు... సాఫ్ట్‌బ్యాంకు తాజా పెట్టుబడులు తమ బృందం (పేటీఎం) నిర్వహణ, విధానానికి లభించిన గొప్ప ఆమోదనీయంగా పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ అభివర్ణించారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 50 కోట్ల మంది భారతీయులను ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు రూ.10,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు పేటీఎం విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొంది. దీన్నిబట్టి ఆర్థిక సేవలు అంతగా అందుబాటులో లేని కస్టమర్లను భారీగా చేరుకునే వ్యూహాలతో పేటీఎం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, వెల్త్ మేనేజ్మెంట్, డిపాజిట్ల సేకరణ, రుణాల జారీ తదితర సేవలు అందించే ప్రణాళికలతోనూ ఉంది. పేమెంట్స్ బ్యాంకులు సొంతంగా రుణాలు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించడం లేదు. అయితే, పేటీఎం ఐసీఐసీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, క్యాపిటల్ ఫస్ట్ తదితర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తన వేదికగా కస్టమర్లకు ఆయా సంస్థలతో రుణాలు అందించే యోచనలో ఉంది. పేటీఎం వ్యాలెట్‌కు ప్రస్తుతం 22 కోట్ల మం ది కస్టమర్లు ఉన్నారు. పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాల నేపథ్యంలో ఈ కామర్స్ కార్యకలాపాల కోసం పేటీఎం ఇటీవలే పేటీఎంమాల్ పేరుతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది. -
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు 23 నుంచి
-
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు 23 నుంచి
న్యూఢిల్లీ: పేమెంట్స్ బ్యాంకు సేవల లైసెన్స్ పొందిన పేటీఎం తన కార్యకలాపాలను ఈ నెల 23 నుంచి ప్రారంభించనుంది. ఆర్బీఐ నుంచి తుది లైసెన్స్ లభించిందని, ఈ నెల 23 నుంచి సేవలను ప్రారంభిస్తున్నామని పేటీఎం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. పేటీఎం వ్యాలెట్‌కు ప్రస్తుతం 21.8 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ వ్యాలెట్లన్నీ ఈ నెల 23 తర్వాత పేమెంట్స్ బ్యాంకుకు బదిలీ అవుతాయి. ఇది ఇష్టం లేని వారు ఆ విషయాన్ని 23వ తేదీలోపే తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు యూజర్ వ్యాలెట్‌లో ఉన్న నగదును వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. ఒకవేళ సంబంధిత వ్యాలెట్ గత ఆరు నెలలుగా ఏ విధమైన లావాదేవీలు లేకుంటే, కస్టమర్ ఆమోదం తర్వాతే వ్యాలెట్‌ను పేమెంట్స్ బ్యాంకుకు బదిలీ చేస్తారు. పేటీఏం పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటుకు విజయ్ శేఖర్శర్మ(పేటీఎం మాతృసంస్థ వన్97 వ్యవస్థాపకుడు)కు ఆర్బీఐ 2015లో సూత్రపాత్ర ఆమోదం తెలియజేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో మెజారిటీ వాటా విజయ్‌శేఖర్ శర్మ చేతిలో ఉండగా, మిగిలింది చైనా సంస్థ అలీబాబా గ్రూపునకు ఉంది. కాగా, పేటీఎం కొత్త సీఈవోగా రేణుసత్తిని నియమించినట్టు పేటీఎం తెలిపింది. త్వరలో ఆదిత్య బిర్లా...: ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో ఆర్బీఐ చిన్న ఫైనాన్స్ బ్యాంకు, పేమెంట్స్ బ్యాంకుల పేరుతో కొత్త అవకాశాలకు వీలు కల్పించింది. మొత్తం 21 సంస్థలకు ఆర్బీఐ గతేడాది సూత్రప్రాయ ఆమోదం తెలియజేయగా... వాటిలో 11 పేమెంట్స్ బ్యాంకులకు చెందినవి ఉన్నాయి. ప్రస్తుతానికి ఎయిర్టెల్, ఇండియా పోస్ట్ మాత్రమే పేమెంట్స్ బ్యాంకులను ఆరంభించగా, త్వరలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకు రంగ ప్రవేశం చేయనుంది. -
ఈ నెలాఖరుకల్లా పేటీఎమ్ చెల్లింపుల బ్యాంక్!
పేటీఎమ్ చీఫ్ విజయ్ శేఖర్ శర్మ ముంబై: పేటీఎమ్ చెల్లింపుల బ్యాంక్ ఈ నెలాఖరు కల్లా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆర్బీఐ నుంచి చెల్లింపుల బ్యాంక్ లైసెన్స్‌ను ఈ ఏడాది జనవరిలోనే పొందామని పేటీఎమ్ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెలాఖరులోనే కార్యకలాపాలు ప్రారంభించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ బ్యాంక్ సేవలు అందుబాటులోకి రావాలని చెప్పారు. ప్రస్తుత రూపంలో ఉన్న బ్యాంకింగ్ రంగం పాతదైందని ఆయన వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ సౌకర్యాలు అందని కోట్లాది మందికి ఆర్థిక సేవలందించడంపైననే తమ చెల్లింపుల బ్యాంక్ దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ విస్తృతంగా ఉన్నందున తమ వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుందని చెప్పారు. ఎస్బీఐకి 20.7 కోట్ల మంది ఖాతాదారులుండగా తమ పేటీఎమ్‌కు 21.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లున్నారని వివరించారు. పేటీఎమ్ ద్వారా నెలకు 20 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని, ఇతర ఈ–వాలెట్ల లావాదేవీలన్నీ కలిపి 19 కోట్లని శర్మ పేర్కొన్నారు. ఆన్లైన్ చెల్లింపులు, స్మార్ట్ఫోన్లను ప్రస్తావిస్తూ ఆయన ఏ వ్యాపారాన్ని అయినా తక్కువగా అంచనా వేయవచ్చని కానీ, టెక్నాలజీని అలా అంచనా వేయకూడదని చెప్పారు. టెక్నాలజీ అనేది సునామీలాంటిదని పేర్కొన్నారు. ఆన్లైన్ చెల్లింపులను మరింత విస్తరించాలంటే ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను, టెలికం కనెక్షన్లను మరింతగా మెరుగుపరచాలని ఆయన సూచించారు. -
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభం
• ఫోన్ నంబరే అకౌంటు నంబరు • సేవింగ్స్ డిపాజిట్లపై 7.25% వడ్డీ న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు విస్తరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వీటిని అధికారికంగా ప్రారంభించారు. గతేడాది నవంబర్‌లో రాజస్తాన్‌లో బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన ఎయిర్టెల్... ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రాథమికంగా రూ.3,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని, దేశవ్యాప్తంగా సర్వీసులు అందించనున్నామని భారతీ ఎంటర్‌ప్రైజస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. ప్రస్తుతం ఎయిర్టెల్ టెలికం వినియోగదారుల సంఖ్య 26 కోట్లుగా ఉంది. ఈ యూజర్ల ఊతంతో కార్యకలాపాలను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. కస్టమర్ల ఫోన్ నంబర్‌నే బ్యాంకు ఖాతా నంబరుగా కూడా ఉపయోగించుకోవచ్చని సునీల్ మిట్టల్ తెలిపారు. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై వార్షికంగా 7.25 శాతం మేర వడ్డీ రేటు ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. 2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11 కంపెనీలకు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులిచ్చింది. అయితే, చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా సంస్థలు తమ లైసెన్సులను తిరిగిచ్చేశాయి. జియో ఉచితంతో తీవ్ర ప్రభావం: మిట్టల్ న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ టెలికం రంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ విరుచుకుపడ్డారు. మార్కెట్లో అనుచిత పోటీ తప్పడం లేదన్నారు. దేన్నైనా ఉచితంగా కానీ, తక్కువ ధరకు గానీ ఇస్తే, ఆ ఇచ్చే కంపెనీతో పోటీపడడం చాలా కష్టమని ఆయన అంగీకరించారు. ఇలాంటి అసంబద్ధ పోటీ వల్ల చివరకు 4–5 కంపెనీలే రంగంలో మిగులుతాయని చెప్పారాయన. -
ఎయిర్టెల్ పెమెంట్స్ బ్యాంక్ సేవలు
• జనవరి నాటికి దేశమంతా • 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లు • తెలుగు రాష్ట్రాల్లో సర్వీసులు ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ జనవరికల్లా దేశవ్యాప్తంగా సేవలను విస్తరించనుంది. ఇటీవలే రాజస్తాన్‌లో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించిన ఎయిర్టెల్... రెండు వారాల్లోనే 1,00,000 ఖాతాలను సాధించింది. బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సేవలు మొదలుపెట్టింది. ఢిల్లీ వేదికగా వచ్చే నెలలో దేశవ్యాప్తంగా అధికారికంగా సేవలను ఆరంభించనుంది. డిజిటల్ రూపంలో నగదు స్వీకరించేలా 30 లక్షల మంది వర్తకులను సిద్ధం చేస్తామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో శశి అరోరా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల కస్టమర్లకే ప్రాధాన్యమిస్తామన్నారు. భారత్‌లో ఎయిర్‌టెల్‌కు 25 కోట్ల మంది సబ్స్క్రైబర్లు, 15 లక్షల రిటైల్ ఔట్లెట్లు ఉన్నాయి. పేమెంటు బ్యాంకు విస్తరణకు ఇవి దోహదం చేస్తాయని ఆయన వెల్లడించారు. కస్టమర్లకు రుణాలు.. దేశవ్యాప్తంగా పేమెంట్స్ బ్యాంక్ విస్తరించిన తర్వాత ఇతర సేవలను అందిస్తామని శశి అరోరా వెల్లడించారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో చేతులు కలిపి ఖాతాదారులకు రుణాలు ఇప్పిస్తామన్నారు. ‘‘భారత్‌లో 23.3 కోట్ల మందికి బ్యాంకు ఖాతాల్లేవు. వీరందరినీ చేరుకోవాలన్నదే మా లక్ష్యం. ఆధార్ ఆధారంగా రెండు నిముషాల్లోనే ఉచితంగా ఖాతా తెరుస్తాం. కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. కస్టమర్ మొబైల్ నంబరే ఖాతా సంఖ్య. తొలిసారి డిపాజిట్ చేసిన మొత్తానికి సమానంగా టాక్‌టైం ఇస్తున్నాం. డిపాజిట్లపై 7.25 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తాం. కస్టమర్లు ఎలాంటి డిజిటల్ చెల్లింపులైనా చేయొచ్చు. వీటికి ప్రాసెసింగ్ ఫీజు లేదు. వేరే బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేస్తే 0.5% చార్జీ ఉంటుంది. నగదు విత్‌డ్రాకు రూ.4 వేలలోపు రూ.25 వరకు, రూ.4 వేలపైన 0.65% చార్జీ చేస్తాం. బేసిక్ ఫోన్‌తోనూ బ్యాం కు ఖాతాను తెరవొచ్చు’ అని తెలిపారు. ఖాతాదారుకు రూ. లక్ష ఉచిత ప్రమాద బీమా ఉంది. బ్యాంకింగ్ పాయింట్లుగా..: రీచార్జ్ ఔట్లెట్లుగా ఇప్పటిదాకా కస్టమర్లకు చేరువైన రిటైల్ కేంద్రాలు ఎయిర్టెల్ బ్యాంకింగ్ పాయింట్లుగా మారతాయి. వీటిలో ఖాతా తెరవడం, నగదు జమ, స్వీకరణ సేవలను కస్టమర్లు పొందవచ్చు. దేశవ్యాప్తంగా 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లు ఏర్పాటయ్యాయి. భాగస్వాముల పనితీరు ఆధారంగా రీచార్జ్ కేంద్రాలను బ్యాంకింగ్ పాయింట్లుగా తీర్చిదిద్దుతున్నట్టు ఏపీ, తెలంగాణ సర్కిల్ సీఈవో వెంకటేష్ విజయ్ రాఘవన్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం 20,000 కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దశలవారీగా మరిన్ని కేంద్రాలకు విస్తరిస్తామన్నారు.