న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రారంభోత్సవ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటిగా ఖరారైనట్లు ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బ్యాంక్ ప్రారంభంకానున్నట్లు తెలిపారు. ఆగస్టు 21న ప్రారంభంకావాల్సిన ఐపీపీబీ.. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలపై అత్యధికంగా దృష్టిసారించనున్న తమ పేమెంట్స్ బ్యాంక్.. ప్రతి జిల్లాలోనూ ఒక శాఖను కలిగి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment