![Hike team with Airtel Payments Bank - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/23/hike.jpg.webp?itok=96Tp3zik)
న్యూఢిల్లీ: దేశీ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘హైక్’ తాజాగా తన యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైక్ యూజర్లు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన మర్చంట్, యుటిలిటీ పేమెంట్ సర్వీసులు పొందొచ్చు. ఎక్కువ మంది భారతీయులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి, వారికి సులభ లావాదేవీల సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్ తమకు మద్దతునిస్తోందని హైక్ మెసేంజర్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్టŠస్) పతీక్ షా తెలిపారు.
అత్యుత్తమ డిజిటల్ పేమెంట్స్ సేవలు అందించేందుకు హైక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీవోవో ఎ.గణేశ్ పేర్కొన్నారు. కాగా 2012లో ప్రారంభమైన హైక్‌కు ప్రస్తుతం 10 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. తన వాలెట్ సర్వీసుల్లో 30 శాతానికిపైగా నెలవారీ వృద్ధి నమోదవుతోంది. భారతీ ఎంటర్‌ప్రైజెస్, సాఫ్ట్‌బ్యాంక్ జాయింట్ వెంచర్ ఇది.
Comments
Please login to add a commentAdd a comment