టెలికం యూజర్లకు ఛార్జీల మోత మోగనుంది. ప్రత్యర్థి రిలయన్స్ జియో రేట్లను 12-15 శాతం పెంచిన మరుసటి రోజే భారతీ ఎయిర్‌టెల్ కూడా తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లకు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ప్లాన్‌లపై టారిఫ్‌లను 10-21 శాతం పెంచింది.
దేశంలో టెల్కోలు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాను అవలంభించడానికి మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) రూ .300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. "ఈ స్థాయి ఏఆర్పీయూ నెట్వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రంలో అవసరమైన గణనీయమైన పెట్టుబడులకు వీలు కల్పిస్తుందని, మూలధనంపై స్వల్ప రాబడిని అందిస్తుందని మేము నమ్ముతున్నాం" అని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.
పెంచిన మొబైల్ టారిఫ్‌లు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ సవాళ్లతో కూడిన వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా ఉండటానికి ఎంట్రీ లెవల్ ప్లాన్లపై చాలా తక్కువ ధరల పెరుగుదల (రోజుకు 70 పైసల కంటే తక్కువ) ఉండేలా చూశామని టెల్కో తెలిపింది. వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.
ఏ ప్లాన్ ఎంత పెరిగిందంటే..
» గతంలో రూ.179గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.199
» గతంలో రూ.455గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.509
» గతంలో రూ.1799గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.1999
» గతంలో రూ.265గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.299
» గతంలో రూ.299గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.349
» గతంలో రూ.359గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.409
» గతంలో రూ.399గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.449
» గతంలో రూ.479గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.579
» గతంలో రూ.549గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.649
» గతంలో రూ.719గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.859
» గతంలో రూ.839గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.979
» గతంలో రూ.2999గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.3599
Comments
Please login to add a commentAdd a comment