రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా కూడా మూడేళ్లలో మొదటిసారి టారిఫ్‌లను పెంచింది. గత రెండేళ్లలో 5జీ టెక్నాలజీలో పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు సిద్ధమైంది.
మొదటగా జియో టారిఫ్‌లను 13 నుంచి 27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ మరుసటి రోజే ఎయిర్‌టెల్ కూడా 10 నుంచి 21 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వంతు. జూలై 4 నుంచి ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్లపై టారిఫ్‌లను 10 నుంచి 23 శాతం పెంచనున్నట్లు తెలిపింది.
ప్లాన్ల కొత్త ధరలు
ఎంట్రీ లెవల్ ప్లాన్, 28 రోజుల మొబైల్ సర్వీస్‌కు కనీస రీఛార్జ్ ధరను 11 శాతం రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాపులర్ 84 రోజుల వాలిడిటీ ప్లాన్ ధరను రూ .719 నుంచి రూ .859 చేసింది. కంపెనీ తన వార్షిక అన్‌లిమిటెడ్ ప్లాన్ ధరను 21 శాతం పెంచి ప్రస్తుతం రూ.2,899 నుంచి రూ.3,499 చేసింది. 24 జీబీ డేటాతో 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ .1,799 ప్లాన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment