న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)ను శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో బ్యాంక్ ప్రారంభోత్సవం జరగనుండగా.. ఏకకాలంలో 650 శాఖలు, 3250 కేంద్రాల వద్ద పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ లక్ష్యమైన సమ్మిళిత వృద్ధిలో ఈ బ్యాంక్ పాత్ర కీలకం కానుందని పేర్కొంది. వంద శాతం ప్రభుత్వ వాటాను కలిగిన తపాలా శాఖలో 3 లక్షలకు మించి గ్రామీణ్ డాక్ సేవక్‌లు, పోస్ట్‌మ్యాన్‌లు ఉండగా.. వీరందరి ద్వారా విస్తృత స్థాయిలో సేవలను అందించనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1.55 లక్షల పోస్ట్ ఆఫీసులకు ఐపీపీబీ నెట్‌వర్క్ అనుసంధానం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment