న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్‌ను ప్రారంభించింది. పర్యావరణ హితంగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ పొదుపు బ్యాంకు ఖాతాలను కలిగి తన కస్టమర్‌లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డులు ఆవిష్కరించింది. అంతేకాకుండా, మార్కెట్‌లోని సాంప్రదాయ PVC కార్డులతో పోలిస్తే, తమ 50,000 కార్డుల ప్రతి బ్యాచ్ 350 కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్డ్‌లను తీసుకురానున్నామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది.
పర్యావరణ అనుకూలమైన ఆర్-పీవీసీ మెటీరియల్‌తో దీన్ని తయారు చేసినట్లు సంస్థ సీవోవో గణేష్ అనంతనారాయణన్ తెలిపారు. సాంప్రదాయ పీవీసీ కార్డులతో పోలిస్తే వీటి ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు తగ్గగలవని, హైడ్రోకార్బన్ల వినియోగం గణనీయంగా తక్కువ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. తొలుత క్లాసిక్ వేరియంట్‌లో పర్సనలైజ్డ్, ఇన్‌స్టా కార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. వీటితో రూ. 10,000 వరకు విలువ చేసే ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment