ఎయిర్‌ టెల్‌ బంపర్‌ ఆఫర్‌: 1000జీబీ డేటా ఫ్రీ | Bharti Airtel offers 1,000 GB of extra data on selected broadband plans | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ టెల్‌ బంపర్‌ ఆఫర్‌: 1000జీబీ డేటా ఫ్రీ

Published Fri, May 26 2017 1:13 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

ఎయిర్‌ టెల్‌ బంపర్‌ ఆఫర్‌: 1000జీబీ డేటా ఫ్రీ

ఎయిర్‌ టెల్‌ బంపర్‌ ఆఫర్‌: 1000జీబీ డేటా ఫ్రీ

ముంబై: దేశీయ టెలికాం మేజర్‌ భారతి ఎయిర్‌ టెల్ మరో బంపర్‌ ఆఫర్‌ను అందిస్తోంది.  ఎయిర్‌ టెల్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ కస్టమర్లకు అదనపు  డేటా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.    ఎంపిక  చేసిన బ్రాడ్‌బ్యాండ్‌  ప్లాన్స్‌లో అదనపు  డేటా ప్రయోజనాలను అందిస్తోంది.  1000 జీబీ ని ఉచితంగా అందిస్తోంది.   ఏప్రిల్‌ 16 తరువాతి ఖాతాదారులకు, ఇప్పటికే   బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అనుభవిస్తున్న కస్టమర్లు బోనస్‌ డేటాను పొందవచ్చు.  ఈ 'బోనస్' ఆఫర్ ఎయిర్టెల్ వెబ్ పోర్టల్‌లో యాక్టివ్‌ గా ఉంది

ఉదాహరణకు, ఢిల్లీలో రూ .899 ప్లాన్ 30 జీబీకి  బదులుగా ప్రస్తుతం  60 వేగవంతమైన డేటాను అందిస్తోంది. రూ 1099 ప్లాన్‌లో  ఇపుడు 90 జీబీ (గతంలో 50 జీబీ) ఆఫర్‌ చేస్తోంది.  రూ .1299 ప్లాన్ లో 125 జీబీ (గతంలో 75 జీబీ) ఆఫర్‌ చేస్తోంది. రూ .1499 ప్లాన్ గతంలో 100 జీబీ డేటాతో పోలిస్తే 160 జీబీ అందిస్తోందిఈ భారీ ప్రయోజనాలను దాదాపు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంచింది.  వెబ్‌సైట్‌  ప్రకారం రూ.899 ప్లాన్‌ తరవాతిప్లాన్‌లలో 1000 జీబీ ఉచితం.అలాగే ఈ ప్లాన్స్‌ అన్నింటిలోనే అన్‌లిమిటెడ్‌  లోకల్‌ అండ్‌ ఎస్టీడీ  కాల్స్ ఉచితం.

 కాగా గత వారం, కంపెనీ తన బ్రాడ్‌ బ్యాండ్‌ ప్రణాళికలను రిఫ్రెష్ చేసింది.  కొత్త ప్రణాళికల్లో ఎయిర్టెల్ హోమ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు 100 శాతం అదనపు డేటాను అందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement