broadband plans
-
బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ మొబైల్ టారిఫ్‌లను 15 శాతం వరకు పెంచాయి. ఈ ధరల పెంపు చాలా మంది వినియోగదారులను బీఎస్ఎన్ఎల్కి మారడానికి ప్రేరేపించింది. పెరుగుతున్న ఈ ఆసక్తికి అనుగుణంగా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించే ప్రైవేటు టెలికాం కంపెనీలకు పోటీగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను కూడా మెరుగుపరుస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల తన చవకైన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై స్పీడ్ లిమిట్స్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కంపెనీ తన రూ.249, రూ.299, రూ.329 ప్లాన్లలో వేగాన్ని పెంచింది.రూ. 249 ప్లాన్ఈ ప్లాన్‌లో గతంలో 10 Mbps వేగంతో నెట్ వచ్చేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద 10 GB నెట్‌ను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. దీని తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కొత్త సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్.. 105 రోజులు అన్లిమిటెడ్రూ. 299 ప్లాన్ఇందులోనూ నెట్ స్పీడ్ 10 Mbps నుండి 25 Mbpsకి పెరిగింది. పరిమితిని చేరుకున్న తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీ 20జీబీ నెట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కొత్త వినియోగదారులకు మాత్రమే.రూ. 329 ప్లాన్ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో మామూలుగా 20 Mbps నెట్ స్పీడ్ ఉండేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఇక 1000 జీబీ గణనీయమైన ఎఫ్‌యూపీని అందిస్తుంది. ఆ తర్వాత వేగం 4 Mbpsకి తగ్గుతుంది. ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. -
జియో గుడ్‌న్యూస్.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా 15 ఓటీటీ యాప్స్
జియో ఫైబర్ తమ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రాథమిక సబ్‌స్క్రిప్షన్‌తో సహా 15 యాప్‌ల ప్రీమియం సేవలను రూ. 888 మంత్లీ ప్లాన్‌కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 30 ఎంబీపీఎస్ ఎంట్రీ లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్.నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ గతంలో రూ. 1,499 ప్లాన్‌ని కలిగి ఉన్న జియోఫైబర్ (JioFiber) కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఎంట్రీ లెవల్ 30 ఎంబీపీఎస్ ప్లాన్‌తో కస్టమర్లకు ఎంటర్టైన్మెంట్ యాప్‌ల యాక్సెస్ ఉండేది కాదు. అదేవిధంగా, ఎయిర్ ఫైబర్ (AirFiber) కస్టమర్ల కోసం రూ. 1499 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్లలో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ అందుబాటులో ఉంది.కంపెనీ సమాచారం ప్రకారం.. జియో రూ.888 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అందిస్తున్న 15 ఓటీటీ యాప్‌ల సేవల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్‌బాలాజీ వంటివి ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో పోటీ నెలకొన్న నేపథ్యంలో తమ కొత్త ప్లాన్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో జియో ఉంది. -
అత్యంత చవకైన ఇంటర్నెట్ ప్లాన్..! కేవలం రూ.329తో 1000జీబీ డేటా..!
BSNL: గత ఏడాది దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలు పోటీ పడుతూ మొబైల్ ఇంటర్నెట్ ప్లాన్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూ కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటుంది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు యూజర్లకు కలిగే విధంగా బీఎస్ఎన్ఎల్ పలు ప్లాన్స్‌ను ప్రకటించింది. తాజాగా బ్రాడ్ బ్యాండ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ అత్యంత చవకైన ఇంటర్నెట్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ. 329తో 1 టీబీ డేటా..! బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ఫైబర్ ఎంట్రీ ప్లాన్ రూ. 329ను ప్రకటించింది.ఈ ప్లాన్ కాల పరిమితి నెలరోజులు. ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్‌లో అత్యంత చౌకైన ప్లాన్‌గా నిలుస్తోంది. ఈ ప్లాన్‌తో 1000జీబీ(1టీబీ) డేటా వరకు యూజర్లు గరిష్టంగా 20Mbps వేగాన్ని పొందవచ్చును. తరువాత నామమాత్రం స్పీడ్‌తో బ్రాడ్ బ్యాండ్ సేవలను యూజర్లకు కల్పిస్తోంది బీఎస్ఎన్ఎల్. కాగా ఇది ప్రస్తుతం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. దీంతో పాటుగా ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అదనంగా ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్, STD కాలింగ్‌ను కూడా యాక్సెస్‌ను చేయవచ్చును. ఫైబర్ ఎంట్రీ ప్లాన్‌తో పాటుగా పైబర్ ఎక్స్పీరియన్స్, ఫైబర్ బేసిక్, ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్స్ నెలకు రూ. 399 నుంచి రూ. 599 అందుబాటులో ఉన్నాయి. సదరు ప్లాన్స్‌పై అదనపు డేటాతో పాటుగా, పలు ఓటీటీ సర్వీసులను కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ యూజర్లే లక్ష్యంగా..! బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల పెంపును లక్ష్యంగా చేసుకొని బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త భారత్ ఫైబర్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దిగ్గజ ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్లను ప్రకటించింది. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ విషయంలో ప్రైవేట్ టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్ నుంచి బీఎస్ఎన్ఎల్ గట్టిపోటీను ఎదుర్కొంటుంది. చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
ఆగస్ట్ 15న విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ గురించి ఆసక్తికర విషయాలు?!
ఆగస్ట్ 15 సందర్భంగా ప్రధాని మోదీ 5జీ నెట్ వర్క్‌ను అధికారికంగా ప్రారంభిస్తారంటూ టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 5జీ నెట్ వర్క్ వినియోగంతో భారత్ లో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాలకు తిరుగుండదనే కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ టెస్టింగ్‌లో గ్లోబల్ లీడర్ 'ఊక్లా' మనదేశంలో ఇంటర్నెట్ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 5జీ వినియోగంతో మనదేశంలో ఇంటర్నెట్ వేగం 10టైమ్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇండియన్ టెక్నాలజీపై చైనా యాప్స్ ప్రభావం ఇండియా - చైనా సరిహద్దు వివాదం కారణంగా కేంద్రం డ్రాగన్ కంట్రీకి చెందిన సుమారు 200యాప్స్ పై బ్యాన్ విధించింది. దీంతో ఇండియన్ టెలికాం కంపెనీలు 5జీ నెట్ వర్క్ స్థాపించేందుకు సొంతంగా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను తయారు చేసే పనిలో పడ్డాయి. అందుకోసం ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, క్వాల్ కమ్ వంటి టెక్ కంపెనీలతో హార్డ్ వేర్ లను తయారు చేసుందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే చైనాకు చెందిన హువావే, జెడ్‌టీఈ సంస్థలు భారత్‌లో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు కోసం కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పోటీ పడ్డాయి. కానీ కేంద్రం సున్నితంగా తిరస్కరించి దేశీ పరిజ్ఞానంతో 5జీ నెట్ వర్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం సమాచార నిపుణుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో 5జీ నెట్ వర్క్ వినియోగం ►2020 థాయిలాండ్, ఫిలిప్పిన్స్‌లో 5జీ నెట్ వర్క్ ప్రారంభమైంది. ఊక్లా అంచనా ప్రకారం..ప్రస్తుతం ఉన్న 4జీ ఎల్ టీఈ(Long-Term Evolution) నెట్ వర్క్ కంటే 5జీ స్పీడుగా ఉంటుందని, దాన్ని బేస్ చేసుకొని 2021 ఏప్రిల్ నాటికి దాని వేగం 9రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఇదే సమయంలో భారత్ లో విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ వేగం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ►2021 మార్చిలో 52.9 శాతం నుండి జూన్ నాటికి 64.5 శాతం మంది 4G వినియోగదారులు 5ఎంబీపీఎస్ కంటే ఎక్కువగా వీడియోల్ని డౌన్లోడ్ చేస్తున్నారని, దీన్ని బట్టి ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు 5G నెట్ వర్క్‌ను ఎలా వినియోగిస్తారో చెప్పడం అసాధ్యం. అయితే దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ వినియోగం పెరిగిపోతుందని ఊక్లా ప్రతినిధులు వెల్లడించారు. ►మనదేశంలో జియో నెట్ వర్క్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతుంది. ఆ జియో నెట్ వర్క్ డౌన్లోడ్ వేగం మార్చి 2021లో 5.96 Mbps నుండి జూన్‌లో 13.08 Mbps కి పెరిగింది. ►ప్రస్తుతం, యూకే,యూఎస్ వంటి దేశాల్లో 5 నెట్ వర్క్‌ను విస్తరించే పనిలోపడ్డారు. ఆ విషయంలో భారత్ వెనకబడినా.. ఇటీవల కాలంలో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ఊక్లా గుర్తించింది. ►5జీ నెట్ వర్క్ ఆలస్యం వల్ల ఆపరేటర్లకు లబ్ధి చేకూరుతుందని, తక్కువ ఖర్చుతో నెట్వర్క్ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేయవచ్చు. ఇండియన్ ఆపరేట్లు ఓపెన్ ర్యాన్ నెట్ వర్క్ (open radio access network architecture) వల్ల 5జీ నెట్ వర్క్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు తగ్గిపోతుందని ఓ ఇంటర్నెట్ టెస్టింగ్ గ్లోబల్ లీడర్ ఊక్లా అంచనా వేసింది. -
తక్కువ కాస్ట్ లో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ఇవే..
సాక్షి వెబ్ డెస్క్ : మీరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? అదనంగా మొబైల్ డేటా కొనుగోలు చేయడంలో విసిగిపోయారా? అయితే ఇప్పుడు మీరు అపరిమితంగా ఇంటర్నెట్ వినియోగించే సౌకర్యాన్ని కల్పిస్తూ కొన్ని బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల పనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే 100Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తక్కువ కాస్ట్ లో 100Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే బ్రాండ్ బ్యాండ్ ల గురించి తెలుసుకుందాం. చదవండి : జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త! తక్కువ ధరలో 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ రిలయన్స్ జియోలో రూ .699 జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉంది. ఇది నెలవారీ ప్యాక్. 100Mbps ఇంటర్నెట్ వేగం, అపరిమిత డేటా మరియు వాయిస్ కాల్ చేసుకోవచ్చు. కానీ జియో అధికారిక సైట్‌లోని వివరాల ప్రకారం.. ఈ ప్లాన్‌పై అదనపు జీఎస్టీ ఛార్జీ ఉంటుందని తెలుస్తోంది. ఈ JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలవారీ ప్రాతిపదికన 3,300GB డేటాను అందిస్తుంది. ఆ తరువాత బ్రౌజింగ్ వేగం తగ్గిపోతుంది. ఎయిర్ టెల్ ఎయిర్ టెల్ అపరిమిత డేటా, కాల్ మరియు 100Mbps స్పీడ్ తో రూ .799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ను వినియోగించడం ద్వారా టీవీ షోస్ తో పాటు ఓటీటీ కంటెంట్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో 10,000 సినిమాల్ని వీక్షించవచ్చు. ఎక్సైటెల్ ఎక్సైటెల్ 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కూడా కలిగి ఉంది. ఇది నెలకు రూ. 699 రూపాయలకు అపరిమిత డేటాను ఇస్తుంది. అదనంగా, మీరు వార్షిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, మీకు ఈ 100Mbps ప్లాన్ నెలకు రూ.399 రూపాయలకు లభిస్తుంది. 12 నెలల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ .4,799. టాటా స్కై చివరగా, టాటా స్కై అనేక నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందిస్తుంది. టాటా స్కై నుండి నెలకు 100Mbps స్పీడ్ తో 6 నెలల ప్లాన్ కొనుగోలు చేస్తే రూ.4,500 చెల్లించాల్సి ఉండగా నెలకు రూ.750 రూపాయలు. ఇక నెలకు 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కావాలంటే రూ. 850 రూపాయలు చెల్లించాలి. సంస్థ అపరిమిత డేటాను ఇస్తోంది మరియు అధికారిక వెబ్సైట్ ప్రకారం వై-ఫై రౌటర్ మరియు ఇన్‌స్టాలేషన్‌లో అదనపు ఛార్జీలు లేవు. 3,300GB డేటా పరిమితి ఉంది. ఆపై వినియోగిస్తే ఇంటర్నెట్ వేగం తగ్గి పోతుంది. -
బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ : 2000 జీబీ డేటా
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. అధిక వేగం, భారీ డేటాను అందించే ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది. సూపర్ స్టార్ 2 ప్లాన్‌గా పిలిచే బ్రాడ్ బ్యాండ్ రూ . 949 ప్లాన్‌లో తాజాగా 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2000 జీబీ వరకు డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ లిమిట్ దాటిన తరువాత డేటా స్పీడ్ 10 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల ధర రూ .777 నుండి రూ .16999 వరకు ఉండగా ఎఫ్టిటిహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను మార్చి 31, 2021 వరకు ఉచితంగా ఇన్స్టాల్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ ప్లాన్లను మార్చి 1 న సవరించింది. ఇందులో హై స్పీడ్,అధిక డేటా అందిస్తోంది. ఈ కొన్నిప్లాన్ల రేటు మార్చలేదు కానీ పేర్లను మార్చింది. సూపర్ స్టార్ 2 ప్లాన్ అని కూడా పిలిచే ఈ ప్లాన్లు ఇలా ఉంటాయి. రూ .1000 లోపు ప్లాన్స్ రూ. 777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: దీన్ని ఇపుడు ‘ఫైబర్ టీబీ ప్లాన్‌గా మార్చింది. ఇందులో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1000 జీబీ డేటా లభ్యం. రూ 779 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్‌ను ఎందుకు మార్చలేదో స్పష్టంగా తెలియదు. ఇది యథాతథంగా ఉంది. రూ 849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 1500 జీబీ డేటా రూ .949 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 2000 జీబీ డేటా రూ .2500 లోపు ప్లాన్స్ రూ .1277 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3300 జీబీ వరకు డేటా రూ. 1999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 4500జీబీ వరకు డేటా రూ .2499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: 300ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5500 జీబీ వరకు డేటా టాప్-టైర్ ప్లాన్ల ధరలు రూ. 4499, రూ .5999, రూ .999, రూ .16,999గా ఉంటాయి. ఇందులో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 6500, 8000, 12000, 21000 జీబీ వరకు డేటా అందిస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. బిఎస్ఎన్ఎల్ తన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది. ఈ కొత్త ప్లాన్ల ద్వారా రెట్టింపు వేగంతో అధిక డేటాను అందించడమే కాకుండా అదనపు ఆఫర్లు కూడా ప్రకటించింది. పాన్-ఇండియా ప్రాతిపదికన బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్లకు 4టీబీ డేటాను 200 ఎమ్‌బిపిఎస్ వేగంతో అందించనుంది. దీంతో పాటు చెన్నై సర్కిల్లలోని ఫైబర్-టు-హోమ్(ఎఫ్టిటిహెచ్) కస్టమర్ల కోసం ప్రత్యేకంగా అదనపు ఆఫర్లను కూడా ప్రకటించింది.(చదవండి: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక చుక్కలే!) సవరించిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్: బిఎస్ఎన్ఎల్ కొత్త భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కింద ఇతర ప్రయోజనలతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం మెంబర్ షిప్‌ను కూడా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. దాని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో పోటీ పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది.డేటా ప్లాన్లలో చేసిన నూతన సవరణలను బిఎస్ఎన్ఎల్ తన వెబ్సైట్లో ఉంచింది. భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ రూ.499 ప్లాన్ కింద గతంలో 100జీబీ డేటాను 20ఎమ్‌బిపిఎస్ వేగంతో అందించేది. ప్రస్తుతం 50ఎమ్‌బిపిఎస్ వేగంతో అందించనుంది. అదేవిదంగా భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ రూ.779 ప్లాన్ 100ఎమ్‌బిపిఎస్ వేగంతో(గతంలో 50ఎమ్‌బిపిఎస్) 300జీబీకి అప్‌గ్రేడ్ చేయబడింది. అలాగే 300జీబీ హై-స్పీడ్ డేటా లిమిట్ పూర్తయితే, ఇంటర్ నెట్ స్పీడ్ 5ఎమ్‌బిపిఎస్(గతంలో 2ఎంబీపీఎస్)కి తగ్గిపోనుంది. ఈ ప్లాన్ కింద డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సభ్యత్వం కూడా లభించనుంది. ప్రస్తుతం రూ.849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇకపై 100ఎంబీపీఎస్(గతంలో 50ఎంబీపీఎస్) వేగంతో లభించనుంది. ఈ ప్లాన్ కింద లభించే 600జీబీ హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులు 10ఎంబీపీఎస్(గతంలో 2 ఎంబీపీఎస్) వేగాన్ని పొందేవారు. ఇలా బిఎస్ఎన్ఎల్ రూ.949, రూ.1,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను కూడా సవరించింది. -
నట్టింట్లో ట్రింగ్..ట్రింగ్!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు నట్టింట్లో ట్రింగ్.. ట్రింగ్.. అంటూ మోగిన ల్యాండ్‌లైన్ పోన్లు మళ్లీ మోత మోగించనున్నాయి. బీఎస్ఎన్ఎల్తో పాటు జియో కూడా వీటికి మళ్లీ జీవం పోస్తోంది. బీఎస్ఎన్ఎల్ దీని కోసం తన నెట్‌వర్క్‌ను నెక్ట్స్ జనరేషన్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఎలాంటి అంతరాయం లేకుండా క్లియర్ వాయిస్, డౌన్లోడ్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్లో ఇలా...: ల్యాండ్‌లైన్ విని యోగదారులకు రోజూ రాత్రి 10.30 నుంచి ఉదయం 6 గంటల వరకు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం. ఆదివారం ఉచితంగా మాట్లాడుకునే సౌకర్యం. నెల రోజులపాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడంతోపాటు వినియోగదారులకు రోజుకు 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5 జీబీ ఉచిత డేటాను అందిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం వినియోగదారులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే సేవల కోసం మోడమ్‌ను మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ ప్రతి నెలా 5 రోజులపాటు నగరంలోని ముఖ్యకూడళ్లలో మెగా మేళాలను నిర్వహిస్తోంది. నగరంలో 2.60 లక్షల కనెక్షన్లు..: హైదరాబాద్‌లో బీఎస్ఎన్ఎల్కు 2.60 లక్షల ల్యాండ్‌లైన్, 60 వేల బ్రాడ్‌బ్యాండ్, 25 వేలకు పైగా ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొబైల్ విప్లవం కంటే ముందు సుమారు 7.50 లక్షలు ఉన్న ల్యాండ్‌లైన్ కనెక్షన్లు లక్ష వరకు పడిపోయాయి. తిరిగి బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానంతో ల్యాండ్‌లైన్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. టారిఫ్‌లు ఇలా..: ల్యాండ్‌లైన్ ఫోన్ నెల అర్బన్ ప్యాకేజీ రూ.299 కింద ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం. ప్యాకేజీ రూ.129 కింద మాత్రం బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు అపరిమిత కాలింగ్ సౌకర్యం. మిగతా నెట్‌వర్క్‌లకు రూ.100 విలువైన కాల్స్ చేసుకోవచ్చు. బ్రాడ్‌బ్యాండ్ విషయానికొస్తే.. ఒక నెల 349 ప్యాకేజీ కింద 8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజుకు 2 జీబీ డేటా డౌన్లోడ్ చాన్స్. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లకు రూ.645 ప్యాకేజీ కింద రోజుకు 40 ఎంబీపీఎస్ స్పీడ్, 200 జీబీ డేటాను డౌన్లోడ్ అవకాశం. అన్‌లిమిటెడ్‌గా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ‘ఎక్స్ట్రీమ్’ ఇప్పటికే నగరంలో ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్న ఎయిర్టెల్ హైస్పీడ్ సేవలతో ప్లాన్ ఎక్స్ర్టీమ్ ఫైబర్ పేరుతో ముందుకొచ్చింది. వన్ జీబీపీఎస్ నెట్వర్క్ వేగంతో ఎయిర్టెల్ హోం బ్రాడ్‌బ్యాండ్‌ను ఆఫర్ చేస్తోంది. జియో ఫైబర్ తరహాలోనే ప్లాన్ ధరను, బెనిఫిట్స్‌ను ఎయిర్టెల్ నిర్ధారించింది. ఎక్స్ట్రీమ్ మల్టీమీడియా స్మార్ట్ ఎకోసిస్టమ్‌లో భాగంగా ఫైబర్ సర్వీస్‌ను లాంఛ్ చేసింది. వినియోగదారులకు వన్‌జీబీపీఎస్ నెట్వర్క్ స్పీడ్‌తో సేవ లు లభిస్తాయి. ఫైబర్ ల్యాండ్ లైన్ కనెక్షన్‌తో అపరిమితకాల్స్ను వర్తింపజేస్తోంది. జియో దూకుడు... రిలయన్స్ జియో ఆప్టికల్ ఫైబర్ ఆధారిత సేవలు కూడా నగరంలో అందుబాటులోకొచ్చాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 2 లక్షల గృహాలకు ఫైబర్ టు ది హోమ్ సేవలను ప్రారంభించింది. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, జీయో టీవీ ప్లస్ సేవలు అందిస్తోంది. జియో ఫైబ ర్ కస్టమర్లకు ల్యాండ్‌లైన్ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమం డ్, ప్లాటినం, టైటానియం పేరుతో 6 ప్లాన్లను పరిచయం చేసింది. -
భారీగా తగ్గనున్న జియో గిగా ఫైబర్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : టెలికం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో త్వరలోనే బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పూర్తిగా మార్కెట్లో ఎంట్రీ ఇవ్వకుండానే అందుబాటు ధరలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. అటు జియో గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై యూజర్లలో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా మరింత చౌక ధరలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకు రానుంది. తద్వారా మరింత మంది యూజర్లను ఆకర్షించేందుకు ప్రణాళిలు సిద్ధం చేసింది. ప్రస్తుతం బీటా దశలోఉన్న ఈ సేవలు అతి త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. అయితే గిగా ఫైబర్ ధర భారీగా తగ్గినట్టు మీడియాలో పలు అంచనాలు వెలువడుతున్నాయి. గతానికంటే రూ.2వేలు తక్కువగా అంటే రూ.2,500కే కనెక్షన్ అందిస్తున్నట్లు కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు తాజాగా అందిస్తున్న గిగా ఫైబర్‌లో కనెక్షన్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఇంకా వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించనప్పటికీ గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఈ సేవల్ని పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించే మొత్తాన్ని కూడా జియో తగ్గించినట్లుగా తెలుస్తోంది. జియో గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలకుగాను సెక్యూరిటీ డిపాజిట్ రూ.4,500గా ఉంది. ప్రస్తుతం దీన్ని రూ.2 వేలు తగ్గింపుతో రూ.2,500కే గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తేనుంది. అయితే వేగాన్ని 50ఎంబీపీఎస్ తగ్గించినట్టు సమాచారం. పాత ప్లాన్ప్రకారం రూ.4,500 కనెక్షన్‌తో డ్యుయల్ బ్యాండ్ రోటర్ అందిస్తుండగా , తాజా ప్లాన్‌లో రూ.2,500 కనెక్షన్ ప్లాన్‌తో సింగిల్ బ్యాండ్ వైఫై రోటర్‌ను అందివ్వనుంది. అలాగే మొదటి ప్లాన్‌తో పోలిస్తే రెండో ప్లాన్‌లో వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి ప్లాన్ వేగం 50ఎంబీపీఎస్ ఉంటే, రెండో ప్లాన్ వేగం 100 ఎంబీపీఎస్ ఉండనుంది. అంటే సగం తగ్గనుందన్నమాట. దీంతోపాటు యూజర్లకు నెలకు 100 జీడీ డేటా, వాయిస్ కాల్స్ ఉచితం. అంతేకాదు జియో టీవీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ప్లాన్ యూజర్లకు మాత్రం వాయిస్ కాల్ సర్వీసు అందుబాటులో లేవు. అయితే తాజా ప్లాన్‌పై జియో సంస్థ ఎలాంటి అధికారిక ధృవీకరణ చేయలేదు. -
నయా ఆఫర్: నెలకు 1500 జీబీ డేటా
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది. తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు జియో గిగాఫైబర్‌ను గత కొన్ని రోజుల క్రితమే లాంచ్ చేసింది. ఇవి త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్లాన్లను పునఃసమీక్షించడం ప్రారంభించింది. చెన్నై సర్కిల్లో తన ప్రీమియం ఎఫ్టీటీహెచ్ ప్లాన్ల ఎఫ్‌యూపీ పరిమితిని పెంచుతున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ.4999 ప్లాన్‌పై బీఎస్ఎన్ఎల్ అంతకముందు 1 టీబీ డేటా ఆఫర్ చేయగా.. ప్రస్తుతం 1.5 టీబీ వరకు అంటే 1500 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఇతర ప్లాన్లపై కూడా ఎఫ్‌యూపీ ప్రయోజనాలను పెంచింది. చెన్నై సర్కిల్లో ఎవరైతే, ఫైబ్రో కోంబో యూఎల్డీ 4999 ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ఎఫ్టీటీహెచ్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తారో, వారికి 100 ఎంబీపీఎస్ స్పీడులో 1.5 టీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఎఫ్‌యూపీ అనంతరం స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు పడిపోనుంది. ఈ ప్లాన్‌పై డేటాతో పాటు బీఎస్ఎన్ఎల్ ఉచిత వాయిస్‌కాల్స్‌ను(బీఎన్ఎన్ఎల్ నెట్వర్క్ పరిధిలోనూ, బయట నెట్వర్క్) కూడా అందిస్తోంది. ఫైబ్రో కోంబో యూఎల్డీ 999 ప్లాన్‌పై 250 జీబీ డేటాను 60 ఎంబీపీస్ స్పీడులో అందిస్తుండగా.. రూ.1299 ప్లాన్‌పై 400 జీబీ డేటాను, 80 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఫైబ్రో కోంబో యూఎల్డీ 1699 ప్లాన్‌పై 550 జీబీ డేటాను, 80 ఎంబీపీఎస్ స్పీడులో... ఫైబ్రో కోంబో యూఎల్డీ 1999 ప్లాన్‌పై 800 జీబీ డేటాను 80 ఎంబీపీఎస్ స్పీడులో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తుంది. అన్ని ఈ ప్రీమియం ఎఫ్టీటీహెచ్ ప్లాన్లపై ఉచిత వాయిస్ కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. అయితే ఈ టారిఫ్‌లన్నీ కేవలం చెన్నై సర్కిల్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ జియోకు పోటీగా రూ.1045, రూ.1395, రూ.1895 ప్లాన్లను సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో జియో లాంచ్ చేసిన జియో గిగాఫైబర్‌పై 1 బీబీపీఎస్ వరకు స్పీడును అందించనుంది. గిగాటీవీ సెటాప్-బాక్స్‌లు, స్మార్ట్ హోమ్ డివైజ్‌ల సాయంతో, టీవీలకు కూడా ఇది పనిచేయనుంది. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌లపై గిగాటీవీ ఇతర టీవీలకు, ఫోన్లకు, టాబ్లెట్లకు ఫోన్ కాల్స్ చేసుకోవడానికి వీలవుతుంది. -
హైదరాబాద్‌లో ఎయిర్టెల్ ‘అపరిమిత’ డేటా
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో మరో బిగ్గెస్ట్ గేమ్ ఛేంజర్‌గా రిలయన్స్ జియో తన ఫైబర్ ఆప్టికల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ‘జియోగిగాఫైబర్’ ను గత రెండు రోజుల క్రితమే లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. జియో ప్రకటించిన ఈ సేవలకు, గట్టి పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రంగంలోకి దిగింది. తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై ఎఫ్‌యూపీ(ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితిని ఎత్తివేసింది. తొలుత ఈ పరిమితిని హైదరాబాద్‌లో తొలగించినట్టు ఎయిర్టెల్ పేర్కొంది. దీంతో హైదరాబాద్ సర్కిల్లో ప్రతి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై కూడా అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ డేటాను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తుంది. అంటే మీ కనెక్షన్‌పై హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సస్‌ను ఎలాంటి డేటా పరిమితి లేకుండా పొందవచ్చు. హైదరాబాద్ సర్కిల్లో రూ.349 నుంచి రూ.1299 మధ్యలో నాలుగు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఆరు నెలలు, ఏడాది కాలానికి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎంపిక చేసుకునే వారికీ ఈ కంపెనీ 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు కూడా గత నెలలోనే ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు అన్ని సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ అపరిమిత డేటా ఆఫర్ హైదరాబాద్ సర్కిల్ మినహాయించి మరే ఇతర సర్కిల్లోనూ లేదు. ఢిల్లీలో రూ.799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై 100 జీబీ బ్రాడ్‌బ్యాండ్ డేటా పరిమితి ఉంది. హైదరాబాద్ సర్కిల్లో రూ.349 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకుంటే, 8 ఎంబీపీఎస్ వరకు స్పీడులో అపరిమిత డేటా లభ్యమవుతుంది. అదేవిధంగా రూ.1,299 ప్లాన్‌పై 100ఎంబీపీఎస్ స్పీడులో డేటా పొందవచ్చు. ఈ స్పీడులో ఈమెయిల్ నుంచి డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవడం, ఆడియో, వీడియో ఫైల్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, వెబ్‌ను సర్ఫ్ చేసుకోవడం చేయొచ్చు. జియోగిగాఫైబర్ ద్వారా 1జీబీపీఎస్ స్పీడులో డేటాను అందించనున్నట్టు రిలయన్స్ జియో రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్
టెలికాం మార్కెట్లో నెలకొన్న టారిఫ్ వార్, ఇక బ్రాడ్‌బ్యాండ్‌కు విస్తరించింది. రిలయన్స్ జియో తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ప్రకటించడానికి కాస్త ముందుగా.. ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రకటించింది. 491 రూపాయలతో తన సరికొత్త ల్యాండ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నట్టు పేర్కొంది. దీన్ని ‘మోస్ట్ ఎకనామిక్ బ్రాడ్‌బ్యాండ ఫ్లాన్’గా అభివర్ణించింది. నెల రోజుల వ్యాలిడిటీతో వుండే ఈ ప్లాన్ లో ప్రతి రోజూ 20 జీబీ డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. 20ఎంబీపీఎస్ స్పీడులో ఈ డేటా లభ్యమవుతుంది. అలాగే, ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్లాన్ గురించి బీఎస్ఎన్ఎల్ బోర్డు మెంబర్ ఎన్ కే మెహతా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇది వ్యక్తులకు, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అత్యధిక సామర్థ్యంతో, అత్యంత సరసమైన ధరలో, డేటా సర్వీసులను ఆఫర్ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ కట్టుబడి ఉందని మెహతా పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాలు, ఫ్రాంచైజీలు, రిటైలర్ల దగ్గర నుంచి ఈ ప్లాన్ ను రీచార్జ్ చేసుకోవచ్చు. మరోవైపు బ్రాడ్ బ్యాండ్ సేవలతో జియో తీవ్ర స్థాయిలో పోటీనిచ్చేందుకు వచ్చేసింది. జియో సేవల ప్రకటనకు కాస్త ముందుగా బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను తీసుకురావడం గమనార్హం. జియో ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ప్రకటించడంతో, దీని ధరలను మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో భారతీ ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి. టెలికాం రంగంలో మాదిరిగా, ఇక బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లోనూ తీవ్ర టారిఫ్ వార్ కనిపించబోతుంది. నాన్-ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను కంపెనీ 20ఎంబీపీఎస్ స్పీడులో 99 రూపాయలకే అందిస్తోంది. కొత్త ల్యాప్‌టాప్ లేదా కొత్త పీసీ కొనుగోలు చేసిన వారికి రెండు నెలల పాటు ఈ ప్లాన్లను ఉచితంగా ఆఫర్ చేస్తోంది కూడా. -
భలే ఆఫర్ : 99 రూపాయలకే 45జీబీ డేటా
ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్ఎన్ఎల్, భారత్‌లో అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌గా దూసుకుపోతుంది. మరే ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్ అందించని ప్లాన్లను ఆఫర్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ నాలుగా కొత్త నాన్-ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. అవి ఒకటి 99 రూపాయల ప్లాన్, రెండు 199 రూపాయల ప్లాన్, మూడు 299 రూపాయల ప్లాన్, నాలుగో 399 బీబీజీ యూఎల్డీ కోంబోలతో బీఎస్ఎన్ఎల్ వీటిని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లపై రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాలను యూజర్లు పొందవచ్చు. 45 జీబీ నుంచి 600 జీబీ వరకు డేటాను ఆఫర్ చేయనున్నామని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ల డౌన్లోడ్ స్పీడు 20 ఎంబీపీఎస్. ఒక్కసారి రోజువారీ పరిమితి అయిపోతే, ఈ స్పీడు 1ఎంబీపీఎస్‌కు దిగి వస్తుందని టెలికాంటాక్ రిపోర్టు చేసింది. 99 రూపాయల ప్లాన్‌పై బీఎస్ఎన్ఎల్ మొత్తంగా 45 జీబీ డేటాను అందిస్తోంది. దీని రోజువారీ పరిమితి 1.5జీబీ. అదేవిధంగా 199 రూపాయల 150 జీబీ ప్లాన్ రోజువారీ పరిమితి 5 జీబీ డేటా. 299 రూపాయల 300 జీబీ ప్లాన్ రోజువారీ పరిమితి 10 జీబీ డేటా. 399 రూపాయల 600 జీబీ ప్లాన్ రోజువారీ పరిమితి 20 జీబీ డేటా. ఈ ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ ఉచిత ఈ-మెయిల్ ఐడీతోపాటు 1జీబీ స్టోరేజ్‌ను అందిస్తోంది. తొలుత 90 రోజుల వాలిట్‌తో ప్రమోషనల్ బేసిస్‌లో వీటిని లాంచ్చేసింది. డిమాండ్ బట్టి ఒకవేళ ఈ ప్లాన్ల తుదిగడువును పెంచాల్సి వస్తే పెంచుతామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. పాత యూజర్లు ఈ ప్లాన్లలోకి తరలి రాలేరని, కేవలం కొత్త యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్లను లాంచ్ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ప్లాన్లను కొనుగోలు చేసేటప్పుడు 500 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్ చేయాలి. ఆరు నెలల అనంతరం ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలోకి యూజర్లు వెళ్లిపోవచ్చు. -
రూ.39కే అపరిమిత కాల్స్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.39కే అపరిమిత కాలింగ్ ఆఫర్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఆఫర్ కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు నేషనల్ రోమింగ్‌ను తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందించనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా రిలయన్స్ జియో తన జియోఫైబర్‌ను త్వరలోనే కమర్షియల్‌గా లాంచ్ చేయనున్న నేపథ్యంలో దాని కంటే ముందస్తుగా బీఎస్ఎన్ఎల్ తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్స్‌ను సమీక్షించింది. సమీక్షించిన కొత్త ఆఫర్స్ కింద తన మూడు ఎఫ్టీటీహెచ్ ప్లాన్లు రూ.1045, రూ.1395, రూ.1895పై ఎఫ్‌యూపీ డేటాను రెండింతలు పెంచనున్నట్టు ప్రకటించింది. రూ.1045 ప్లాన్‌పై ప్రస్తుతం 100జీబీ ఎఫ్‌యూపీ డేటాను, 30ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌లో అందించనుంది. అంతకముందు ఈ ప్లాన్‌పై 50జీబీ డేటానే ఆఫర్ చేసేది. అదేవిధంగా రూ.1395 ప్లాన్‌పై 150జీబీ డేటాను 40ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్ స్పీడులో ఆఫర్ చేయనుంది. రూ.1895 ప్లాన్‌పై 200జీబీ డేటాను, 50ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్ స్పీడులో అందించనుంది. అంతకముందు ఈ ప్లాన్‌పై 100జీబీ డేటానే ఆఫర్ చేసేది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలను కేవలం కేరళ సర్కిల్ వారికే ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ రూ.39 రీఛార్జ్ ప్లాన్ కూడా ఢిల్లీ, ముంబై మినహా మిగతా అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టూన్లను ఆఫర్ చేయనుంది. అయితే ఈ ప్లాన్ కింద డేటా అందించకపోవడం గమనార్హం. మరోవైపు ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 10 రోజులు మాత్రమే. -
జియోకి ఆ గేమ్నే మార్చేసే సత్తా..!
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో దూసుకుపోతోన్న బిలీనియర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను ఈ ఏడాదే లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులు ఈ సెగ్మెంట్లో ఉన్న పోటీ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని క్రెడిట్ రేటింగ్ కంపెనీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ చెప్పింది. ఈ కొత్త సర్వీసులతో పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అదనంగా 5 బిలియన్ డాలర్లను చేకూర్చనుందని సీఎల్ఎస్ఏ ఇండియా తెలిపింది. దీంతో రిలయన్స్ ఆదాయాలు ఈబీఐటీడీఏల తర్వాత రూ.40 బిలియన్లుగా ఉండనున్నాయని బ్రోకరేజ్ సంస్థ అంచనావేస్తుంది. గతంలో ఫైబర్-టూ-హోమ్‌లపై టెలికాం కంపెనీల ఎక్కువగా దృష్టిసారించేవి కావని, వైర్లెస్ బిజినెస్‌లపైనే ఎక్కువగా వృద్ధిని నమోదు చేయాలనుకునేవని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మెహుల్ సుఖ్‌వాలా చెప్పారు. కాగ, 2016లో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జియో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జియో ప్రభావంతో కొన్ని టెలికాం కంపెనీలు మూతపడగా.. మరికొన్ని కంపెనీలు విలీన బాట పట్టాయి. ఉచిత కాలింగ్, ఉచిత డేటా రూపంలో జియో ఈ ధరల యుద్ధానికి తెరతీసింది. 16 నెలల అనంతరం జియో తొలిసారి లాభాలను సైతం నమోదు చేసింది. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల రంగంలోనూ తనదైన సత్తా చాటాలని జియో ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన అర్బన్ ప్రాంతాల్లో ఉచితంగా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆఫర్ చేస్తోంది. 100ఎంబీపీఎస్ స్పీడు మొదలుకొని డేటా ప్లాన్లను అందించాలని జియో చూస్తోంది. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్న సంస్థల కన్నా తక్కువ ధరలతో ఎక్కువ స్పీడుతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు జియో చెప్పింది. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్ : 1200జీబీ డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన తొలి 300ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను సోమవారం ఆవిష్కరించింది. నెలవారీ రెంటల్ రూ.2199తో ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎయిర్టెల్ తీసుకొచ్చింది. ఫైబర్-టూ-ది-హోమ్(ఎఫ్టీటీహెచ్) సర్వీసు సబ్స్క్రైబర్లను టార్గెట్‌గా చేసుకుని ఈ ప్లాన్‌ను ఎయిర్టెల్ స్పెషల్‌గా రూపొందించింది. ఈ కొత్త ప్లాన్ కింద 1200జీబీ ఆల్ట్రా హై స్పీడు డేటాను అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాలింగ్ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. ఈ కొత్త 300ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఎంచుకునే ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లకు, ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ టీవీ వంటి ఓటీటీ యాప్స్‌కు ఉచిత సబ్స్క్రిప్షన్ లభించనుంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను యూజర్లు పొందనున్నారు. ఈ ప్లాన్ డేటా రోల్అవుట్ ప్రయోజనాలను, ఎయిర్టెల్ సర్ప్రైజ్, మైహోమ్ రివార్డులను అందించనుంది. అంతేకాకుండా 1టీబీ బోనస్ డేటా కూడా అక్టోబర్ 31 వరకు యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఇది కేవలం ఈ ప్లాన్‌ను ఆన్లైన్ కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే. ఎంపిక చేసిన సర్కిళ్లకు మాత్రమే ఈ ప్లాన్‌ను అందుబాటులో ఉంచుతున్నామని ఎయిర్టెల్ తెలిపింది. ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ సైట్‌ను విజిట్ చేసి, సబ్స్క్రైబర్లు తమ సర్కిళ్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది. హై స్పీడు డేటా ఆశించే వారికి ఈ కొత్త ఎఫ్టీటీహెచ్ ఆధారిత ప్లాన్లను ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకంగా ఉందని భారతీ ఎయిర్టెల్ సీఈవో జార్జ్ మతేన్ అన్నారు. వచ్చే రోజుల్లో ఎఫ్టీటీహెచ్ ఆఫర్స్‌ను మరింత పెంచుతామన్నారు. -
ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: 1000జీబీ డేటా ఫ్రీ
ముంబై: దేశీయ టెలికాం మేజర్ భారతి ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. ఎయిర్ టెల్ బ్రాండ్ బ్యాండ్ కస్టమర్లకు అదనపు డేటా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌లో అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. 1000 జీబీ ని ఉచితంగా అందిస్తోంది. ఏప్రిల్ 16 తరువాతి ఖాతాదారులకు, ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్ సేవలను అనుభవిస్తున్న కస్టమర్లు బోనస్ డేటాను పొందవచ్చు. ఈ 'బోనస్' ఆఫర్ ఎయిర్టెల్ వెబ్ పోర్టల్‌లో యాక్టివ్ గా ఉంది ఉదాహరణకు, ఢిల్లీలో రూ .899 ప్లాన్ 30 జీబీకి బదులుగా ప్రస్తుతం 60 వేగవంతమైన డేటాను అందిస్తోంది. రూ 1099 ప్లాన్‌లో ఇపుడు 90 జీబీ (గతంలో 50 జీబీ) ఆఫర్ చేస్తోంది. రూ .1299 ప్లాన్ లో 125 జీబీ (గతంలో 75 జీబీ) ఆఫర్ చేస్తోంది. రూ .1499 ప్లాన్ గతంలో 100 జీబీ డేటాతో పోలిస్తే 160 జీబీ అందిస్తోందిఈ భారీ ప్రయోజనాలను దాదాపు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంచింది. వెబ్సైట్ ప్రకారం రూ.899 ప్లాన్ తరవాతిప్లాన్‌లలో 1000 జీబీ ఉచితం.అలాగే ఈ ప్లాన్స్ అన్నింటిలోనే అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఉచితం. కాగా గత వారం, కంపెనీ తన బ్రాడ్ బ్యాండ్ ప్రణాళికలను రిఫ్రెష్ చేసింది. కొత్త ప్రణాళికల్లో ఎయిర్టెల్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు 100 శాతం అదనపు డేటాను అందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.