సాక్షి వెబ్ డెస్క్ : మీరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? అదనంగా మొబైల్ డేటా కొనుగోలు చేయడంలో విసిగిపోయారా? అయితే ఇప్పుడు మీరు అపరిమితంగా ఇంటర్నెట్ వినియోగించే సౌకర్యాన్ని కల్పిస్తూ కొన్ని బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల పనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే 100Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తక్కువ కాస్ట్ లో 100Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే బ్రాండ్ బ్యాండ్ ల గురించి తెలుసుకుందాం. చదవండి : జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త!
తక్కువ ధరలో 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్
రిలయన్స్ జియోలో రూ .699 జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉంది. ఇది నెలవారీ ప్యాక్. 100Mbps ఇంటర్నెట్ వేగం, అపరిమిత డేటా మరియు వాయిస్ కాల్ చేసుకోవచ్చు. కానీ జియో అధికారిక సైట్‌లోని వివరాల ప్రకారం.. ఈ ప్లాన్‌పై అదనపు జీఎస్టీ ఛార్జీ ఉంటుందని తెలుస్తోంది. ఈ JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలవారీ ప్రాతిపదికన 3,300GB డేటాను అందిస్తుంది. ఆ తరువాత బ్రౌజింగ్ వేగం తగ్గిపోతుంది.
ఎయిర్ టెల్
ఎయిర్ టెల్ అపరిమిత డేటా, కాల్ మరియు 100Mbps స్పీడ్ తో రూ .799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ను వినియోగించడం ద్వారా టీవీ షోస్ తో పాటు ఓటీటీ కంటెంట్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో 10,000 సినిమాల్ని వీక్షించవచ్చు.
ఎక్సైటెల్
ఎక్సైటెల్ 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కూడా కలిగి ఉంది. ఇది నెలకు రూ. 699 రూపాయలకు అపరిమిత డేటాను ఇస్తుంది. అదనంగా, మీరు వార్షిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, మీకు ఈ 100Mbps ప్లాన్ నెలకు రూ.399 రూపాయలకు లభిస్తుంది. 12 నెలల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ .4,799.
టాటా స్కై
చివరగా, టాటా స్కై అనేక నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందిస్తుంది. టాటా స్కై నుండి నెలకు 100Mbps స్పీడ్ తో 6 నెలల ప్లాన్ కొనుగోలు చేస్తే రూ.4,500 చెల్లించాల్సి ఉండగా నెలకు రూ.750 రూపాయలు. ఇక నెలకు 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కావాలంటే రూ. 850 రూపాయలు చెల్లించాలి. సంస్థ అపరిమిత డేటాను ఇస్తోంది మరియు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం వై-ఫై రౌటర్ మరియు ఇన్‌స్టాలేషన్‌లో అదనపు ఛార్జీలు లేవు. 3,300GB డేటా పరిమితి ఉంది. ఆపై వినియోగిస్తే ఇంటర్నెట్ వేగం తగ్గి పోతుంది.
Comments
Please login to add a commentAdd a comment