internet connections
-
కర్నాల్‌లో నిషేధాజ్ఞలు మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత
కర్నాల్(హరియాణా): హరియాణాలోని కర్నాల్‌లో మినీ సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామన్న రైతు సంఘాల పిలుపు నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం నిర్వహిం చతలపెట్టిన రైతు ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో 144వ సెక్షన్ అమల్లోకి తెచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం సోమవారం ప్రకటించింది. మొబైల్ ఇంటర్నెట్‌నూ నిలిపేశారు. కర్నాల్‌లో నలుగురుకి మించి వ్యక్తులు గుమిగూడటం కుదరదంటూ నిషేధాజ్ఞలు జారీచేసింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ముందస్తు చర్యగా ఆంక్షలు అమల్లోకి తెచ్చామని అదనపు డీజీపీ(లా అండ్ ఆర్డర్) నవ్‌దీప్ సింగ్ చెప్పారు. రైతు ఆందోళన సందర్భంగా తప్పుడు వార్తలు, పుకార్లను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయకుండా ఆపేందుకు కర్నాల్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎంఎస్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సేవలను స్తంభింపజేస్తారు. పొరుగున ఉన్న కురుక్షేత్ర, కైథాల్, జింద్, పానిపట్ జిల్లాల్లోనూ ఈ సేవలనుæ నిలిపేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలనూ రప్పించారు. గత నెల 28న కర్నాల్‌లో బీజేపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బయల్దేరిన రైతులు.. జాతీయరహదారి వెంట ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తున్నారంటూ వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. ఈ ఘటనలో 10 మందికిపైగా రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రైతు మరణించారు. లాఠీచార్జి కారణంగా ఆయన మరణించారని రైతు సంఘాలు చెబుతుండగా, గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. లాఠీ చార్జిని నిరసిస్తూ మినీ–సెక్రటేరియట్‌ను ముట్టడి స్తామని సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటించడం తెల్సిందే. ముందుగా కర్నాల్‌లో భారీస్థాయిలో పంచాయత్‌ను నిర్వహిస్తామని, తర్వాత మినీ– సెక్రటేరియట్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని హరియాణా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ చెప్పారు. -
తక్కువ కాస్ట్ లో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ఇవే..
సాక్షి వెబ్ డెస్క్ : మీరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? అదనంగా మొబైల్ డేటా కొనుగోలు చేయడంలో విసిగిపోయారా? అయితే ఇప్పుడు మీరు అపరిమితంగా ఇంటర్నెట్ వినియోగించే సౌకర్యాన్ని కల్పిస్తూ కొన్ని బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల పనికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే 100Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తక్కువ కాస్ట్ లో 100Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే బ్రాండ్ బ్యాండ్ ల గురించి తెలుసుకుందాం. చదవండి : జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త! తక్కువ ధరలో 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ రిలయన్స్ జియోలో రూ .699 జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉంది. ఇది నెలవారీ ప్యాక్. 100Mbps ఇంటర్నెట్ వేగం, అపరిమిత డేటా మరియు వాయిస్ కాల్ చేసుకోవచ్చు. కానీ జియో అధికారిక సైట్‌లోని వివరాల ప్రకారం.. ఈ ప్లాన్‌పై అదనపు జీఎస్టీ ఛార్జీ ఉంటుందని తెలుస్తోంది. ఈ JioFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలవారీ ప్రాతిపదికన 3,300GB డేటాను అందిస్తుంది. ఆ తరువాత బ్రౌజింగ్ వేగం తగ్గిపోతుంది. ఎయిర్ టెల్ ఎయిర్ టెల్ అపరిమిత డేటా, కాల్ మరియు 100Mbps స్పీడ్ తో రూ .799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ను వినియోగించడం ద్వారా టీవీ షోస్ తో పాటు ఓటీటీ కంటెంట్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో 10,000 సినిమాల్ని వీక్షించవచ్చు. ఎక్సైటెల్ ఎక్సైటెల్ 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కూడా కలిగి ఉంది. ఇది నెలకు రూ. 699 రూపాయలకు అపరిమిత డేటాను ఇస్తుంది. అదనంగా, మీరు వార్షిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే, మీకు ఈ 100Mbps ప్లాన్ నెలకు రూ.399 రూపాయలకు లభిస్తుంది. 12 నెలల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ .4,799. టాటా స్కై చివరగా, టాటా స్కై అనేక నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని అందిస్తుంది. టాటా స్కై నుండి నెలకు 100Mbps స్పీడ్ తో 6 నెలల ప్లాన్ కొనుగోలు చేస్తే రూ.4,500 చెల్లించాల్సి ఉండగా నెలకు రూ.750 రూపాయలు. ఇక నెలకు 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కావాలంటే రూ. 850 రూపాయలు చెల్లించాలి. సంస్థ అపరిమిత డేటాను ఇస్తోంది మరియు అధికారిక వెబ్సైట్ ప్రకారం వై-ఫై రౌటర్ మరియు ఇన్‌స్టాలేషన్‌లో అదనపు ఛార్జీలు లేవు. 3,300GB డేటా పరిమితి ఉంది. ఆపై వినియోగిస్తే ఇంటర్నెట్ వేగం తగ్గి పోతుంది. -
పల్లెలకు అపరిమిత ఇంటర్నెట్
సాక్షి, అమరావతి: ఎలాంటి అంతరాయాలు లేని నెట్వర్క్ లక్ష్యంగా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ స్పీడ్ కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని, అన్ని గ్రామాల్లో సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కలుగుతుందన్నారు. నిర్ణీత వ్యవధిలోగా ఈ పనులన్నీ పూర్తి కావాలన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామాలకు ఇంటర్నెట్, కనెక్టివిటీ పురోగతి, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, నిర్వహణ, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లు అందచేయడంపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బాలినేని తదితరులు పీవోపీ కోసం రూ.5,800 కోట్లు ప్రతి ఊరికి ఇంటర్నెట్ సౌలభ్యం కోసం గ్రామ స్థాయిల వరకు పీవోపీ (పాయింట్ ఆఫ్ ప్రజెన్స్) కోసం రూ.5,800 కోట్లు వ్యయం కానుంది. అదనంగా మరో రూ.2 వేల కోట్లు వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీల కోసం ఖర్చు అవుతుంది. 12,890 గ్రామాలకు కేబుళ్ల సదుపాయం కల్పించాలి. 3 వేల హామ్లెట్లకు సైతం ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. తద్వారా దాదాపు 16 వేల గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. 2022 డిసెంబర్ నాటికి విలేజ్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో... అన్ లిమిటెడ్ కెపాసిటీతో గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం ఉండాలి. అందుకోసం అవసరమైతే కెపాసిటీని 20 జీబీ వరకు పెంచండి. అప్పుడే వర్క్ ఫ్రమ్ హోం సులభంగా ఉంటుంది. కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీలలో కూడా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలి. అంటే మరో 31 లక్షల ఇళ్లు పెరుగుతాయి. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయండి. రాష్ట్రవ్యాప్తంగా 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తి కావాలి. తుపాను ప్రభావిత 108 గ్రామాల్లో భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయాలి. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు... రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, గ్రామ సచివాలయం ఉన్న ప్రతిచోటా వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు ఉండాలి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గ్రామీణ లైబ్రరీల నిర్మాణం జరగాలి. అవి పూర్తయ్యే సమయానికి అవసరమైనన్ని కంప్యూటర్లు కూడా సిద్ధం చేయాలి. వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలో న్యూస్ పేపర్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయాలి. ఒక్కో లైబ్రరీలో 6 సిస్టమ్స్ కోసం సదుపాయం ఉండాలి. అవసరం మేరకు 4 లేదా 6 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామస్ధాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవసరమైన ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి. అమ్మ ఒడి ల్యాప్‌టాప్‌లు అమ్మ ఒడి పథకంలో ఆప్షన్ కింద ల్యాప్‌టాప్‌లు కోరుకున్న వారికి వచ్చే ఏడాది జనవరి 9న అందజేయాలి. 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ల్యాప్‌టాప్‌తో పాటు గ్యారెంటీ, వారంటీ కార్డు, అన్ని స్పెసిఫికేషన్స్‌తో అందచేయాలి. ల్యాప్‌టాప్‌ల సర్వీసు కూడా పక్కాగా ఉండాలి. ఎక్కడైనా ల్యాప్‌టాప్ పాడైతే గ్రామ సచివాలయం ద్వారా సర్వీస్ సెంటర్‌కు పంపి వారం రోజుల్లోగా తిరిగి తెప్పించాలి. కాబట్టి బిడ్ ఖరారు చేసేటప్పుడు గ్యారెంటీ, వారంటీ, సర్వీస్.. వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి రెవెన్యూ డివిజన్లో తప్పనిసరిగా ల్యాప్‌టాప్‌ల సర్వీస్ సెంటర్లు ఉండాలి. కొనసాగుతున్న కేబుల్ పనులు.. ► గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లకు సంబంధించి ఇప్పటికే కేబుల్ పనులు కొనసాగుతున్నాయని, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా 2023 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ వెల్లడించారు. ఇప్పటివరకు 307 మండలాల్లోని 3,642 గ్రామాల్లో 14,671 కి.మీ. మేర ఏరియల్ కేబుల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ► వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలను 690 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని, ఒక్కో లైబ్రరీ అంచనా వ్యయం రూ.16 లక్షలు కాగా ప్రతి లైబ్రరీలో 20 సీట్లు ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామిణాభివృద్ధి కమిషనర్ ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. ► అమ్మ ఒడిలో ఆప్షన్ ప్రకారం ల్యాప్‌టాప్‌లు ఇవ్వడానికి విద్యార్థుల నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. రెండు మోడళ్లలో ల్యాప్‌టాప్‌లు సేకరిస్తున్నామని, ఇంజనీరింగ్ విద్యార్థులకు హైఎండ్ వర్షన్ ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని చెప్పారు. సమీక్షలో అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ఎం.మధుసూదన్‌రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ ఎం.నందకిషోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు, అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అందించాలని, అంతరాయాలు లేకుండా నెట్వర్క్ అందించాలని అధికారులకు సూచించారు. ఏ స్థాయి కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. చదవండి: బాబు అపహాస్యం.. జగనన్న ఆపన్న హస్తం గ్రామాల్లో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ.. తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయాలు ఏర్పాటు చేయాలని.. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. విద్యార్థులకిచ్చే ల్యాప్‌టాప్‌లపైనా ఆలోచన చేయాలని సీఎం సూచించారు. వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. ల్యాప్‌టాప్ చెడిపోయిందని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇస్తే వారం రోజుల్లో మరమ్మతులు చేసి ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష -
పని చేయని ఈ-పంచాయతీలు..
గద్వాల రూరల్: ఈ–పంచాయతీలంటూ ఎంతో గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినా ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు. రెండేళ్ల క్రితం పంచాయతీ కార్యాలయాలకు కంప్యూటర్లు పంపిణీ చేసినా ఇంటర్నెట్ సౌకర్యం, ఆపరేటర్ల కొరత కారణంగా అవి మూలన పడ్డాయి. కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన సామగ్రి లేకపోవడం గమనార్హం. దీంతో గ్రామపంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు అన్ని సేవలు ప్రజల ముంగిట నిలపాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. జిల్లాలోని 195 గ్రామ పంచాయతీలకుగాను 118చోట్ల మూడేళ్ల క్రితం ఈ–పంచాయతీ సేవలు ప్రారంభించారు. ఒక్కో గ్రామపంచాయతీకి అప్పట్లో రూ.40వేలు విలువజేసే కంప్యూటర్ మానిటర్, యూపీఎస్, టేబుల్ తదితర పరికాలను అందించారు. ఆయా గ్రామాల్లో ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం కేవలం మండల స్థాయిలోనే 12చోట్ల కొనసాగుతోంది. రెండేళ్లపాటు కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించగా కాంట్రాక్టు పూర్తి కావడంతో సంబంధిత కంపెనీ ఈ–సేవల నుంచి తప్పుకొంది. అనంతరం ప్రభుత్వం గ్రామపంచాయతీల నిధుల నుంచి మండలస్థాయిలో ఆపరేటర్లకు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 10శాతం వేతనం రూపంలో వివిధ దశల్లో గ్రామపంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. మరోవైపు పంచాయతీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా ఈ–సేవలపై మాత్రం దృష్టి సారించడం లేదు. రెండు గ్రామ పంచాయతీలను క్లస్టర్‌గా ఏర్పరచి మండలానికి ముగ్గురు చొప్పున ఆపరేటర్లు ఉండాలని సూచించింది. 12రకాల సేవలు అందించాలి ఈ–పంచాయతీల్లో భాగంగా ఇంటిపన్ను, ఆస్తి వివరాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ వ్యయాలు, నీటి పథకాలు, కొళాయి కనెక్షన్లు, వీధిదీపాలు, వనరులు, అక్షరాస్యత శాతం, ఇంటి పన్నుల వసూళ్లు, బకాయిల వివరాలు అన్నీ కంప్యూటర్లోనే నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. అంతేకాక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడంతోపాటు 12రకాల సేవలను అందించాలి. అయితే కేవలం మండల పరిషత్ కార్యాలయాల్లోనే కంప్యూటర్లు వినియోగంలో ఉండగా గ్రామాల్లో మూలకు చేరాయి. చాలా గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో పంపిణీ చేసిన కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయి. మండలం కేంద్రాల్లో కొనసాగుతున్న ఈ–పంచాయతీల సేవలతోపాటు స్వచ్ఛభారత్, ఆసరా పింఛన్లు, హరితహారం, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన జాబితాల తయారీలో ఆపరేటర్లు బిజీగా ఉన్నారు. దీంతో తమకు పని తలకు మించిన భారమవుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. చాలా ఇబ్బందిగా మారింది నాకు మూడు గ్రామ పంచాయతీలు అప్పగించారు. ఎందులోనూ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో నిధులు, లావాదేవీలు, పింఛన్లు, నీటి, ఇంటి పన్ను బకాయిలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. – సురేష్, పంచాయతీ కార్యదర్శి, గోనుపాడు, గద్వాల మండలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతోపాటు ఆపరేటర్ల సమస్య కారణంగా కంప్యూటర్లు వృథాగా ఉన్నది వాస్తవమే. చాలా గ్రామాల్లో బీఎస్ఎన్ఎస్ బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – కృష్ణ, డీపీఓ, గద్వాల -
మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్లు కట్
శ్రీనగర్: గణతంత్ర వేడుకల సందర్భంగా కాశ్మీర్ లోయలో అన్ని మొబైల్ ఫోన్స్, వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్లను ఆపివేశారు. భద్రత చర్యల్లో భాగంగా ముందు జాగ్రత్తగా ఈ సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచే మొబైల్, వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం రోజుల్లో అధికారులు ఇలాంటి నిషేధాజ్ఞలు జారీ చేస్తారు. ఉగ్రవాదులు గతంలో మొబైల్ ఫోన్ల ద్వారా బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. కాగా లాండ్ లైన్ టెలిఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సర్వీసులు పనిచేస్తున్నాయి. గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తారు.