గ్రామాల్లో అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌: సీఎం జగన్‌ | YS Jagan Review On Internet Connections And Laptops Distribution | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ సదుపాయాలపై ప్రణాళిక సిద్ధం చేయాలి..

Published Fri, Jan 22 2021 4:04 PM | Last Updated on Fri, Jan 22 2021 6:54 PM

YS Jagan Review On Internet Connections And Laptops Distribution - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు, అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామాలకు అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ అందించాలని, అంతరాయాలు లేకుండా నెట్‌వర్క్‌ అందించాలని అధికారులకు సూచించారు. ఏ స్థాయి కనెక్షన్‌ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. చదవండి: బాబు అపహాస్యం.. జగనన్న‌ ఆపన్న హస్తం

గ్రామాల్లో నెట్‌వర్క్‌ పాయింట్‌ వద్ద ఇంటర్నెట్‌ లైబ్రరీ.. తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్‌ ఫ్రం హోం సదుపాయాలు ఏర్పాటు చేయాలని.. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. విద్యార్థులకిచ్చే ల్యాప్‌టాప్‌లపైనా ఆలోచన చేయాలని సీఎం సూచించారు. వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. ల్యాప్‌టాప్‌ చెడిపోయిందని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇస్తే వారం రోజుల్లో మరమ్మతులు చేసి ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్‌ సమీక్ష

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement