జియో ఫైబర్ తమ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రాథమిక సబ్‌స్క్రిప్షన్‌తో సహా 15 యాప్‌ల ప్రీమియం సేవలను రూ. 888 మంత్లీ ప్లాన్‌కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 30 ఎంబీపీఎస్ ఎంట్రీ లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్.
నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ గతంలో రూ. 1,499 ప్లాన్‌ని కలిగి ఉన్న జియోఫైబర్ (JioFiber) కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఎంట్రీ లెవల్ 30 ఎంబీపీఎస్ ప్లాన్‌తో కస్టమర్‌లకు ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల యాక్సెస్ ఉండేది కాదు. అదేవిధంగా, ఎయిర్ ఫైబర్ (AirFiber) కస్టమర్‌ల కోసం రూ. 1499 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్‌లలో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ అందుబాటులో ఉంది.
కంపెనీ సమాచారం ప్రకారం.. జియో రూ.888 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అందిస్తున్న 15 ఓటీటీ యాప్‌ల సేవల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్‌బాలాజీ వంటివి ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో పోటీ నెలకొన్న నేపథ్యంలో తమ కొత్త ప్లాన్‌లు వినియోగదారులను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో జియో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment