ప్రతివారం బక్సాఫీసు వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలా ఈ వారం పాన్ ఇండియా సినిమాతో పాటు మరిన్ని కొత్త చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. అలాగే ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులకు వినోదం మరింత రెట్టింపు అయ్యింది. పెద్ద సినిమాలన్ని తమకు నచ్చినప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది. ప్రతివారం ప్రేక్షకులను అలరించేందుకు ఇటూ థియేటర్లు, అటూ ఓటీటీలు కొత్త సినిమాలతో సిద్ధమవుతాయి. గతవారం థియేటర్లో రావణాసుర, మీటర్ వంటి సినిమాల అలరించగా ఈ వారం శాకుంతలం వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు పెద్ద హీరోలు చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే.
శాకుంతలం
సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిర్మాణాంతర పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 14న థియేటర్లో విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాతో అర్హ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటం విశేషం.
‘రుద్రుడు’గా మారిన లారెన్స్
రాఘవ లారెన్స్ హీరోగా కతిరేశన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజయ్ సేతుపతి ‘విడుదల’
తమిళంలో మంచి విజయం సాధించిన ‘విడుదలై’ చిత్రం ఇప్పుడు తెలుగులో అలరించేందుకు రెడీ అయ్యింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నటుడు సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రీబ్యూషన్ విడుదల పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 15న తెలుగులో విడుదల కాబోతోంది.
ఓటీటీలో అలరించే చిత్రాలు
విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్, రావు రమేష్, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న థియేటర్లో విడుదలైంది. విశ్వక్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ (తొలిరోజు రూ.8 కోట్లు) రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. విడుదలైన నెల రోజులకు ముందే దాస్ కా ధమ్కీ ఓటీటీకి రావడం గమనార్హం. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఏప్రిల్ 14 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+హాట్‌స్టార్
- ఓ కల (తెలుగు) ఏప్రిల్ 13
- టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 9
నెట్‌ఫ్లిక్స్
- ఫ్లోరియా మాన్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 13
- అబ్సెషన్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 13
- క్వీన్ మేకర్ (కొరియన్ సిరీస్) ఏప్రిల్ 14
- ది లాస్ట్ కింగ్‌డమ్ (హాలీవుడ్) ఏప్రిల్ 14
అమెజాన్
- ది మార్వెలస్ మిస్సెస్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 14
జీ5
- మిస్సెస్ అండర్‌కవర్ (హిందీ) ఏప్రిల్ 14
Comments
Please login to add a commentAdd a comment