బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సమీక్షించిన బీఎస్‌ఎన్‌ఎల్
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతుంది. తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు జియో గిగాఫైబర్‌ను గత కొన్ని రోజుల క్రితమే లాంచ్ చేసింది. ఇవి త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన ప్లాన్లను పునఃసమీక్షించడం ప్రారంభించింది. చెన్నై సర్కిల్‌లో తన ప్రీమియం ఎఫ్‌టీటీహెచ్ ప్లాన్ల ఎఫ్‌యూపీ పరిమితిని పెంచుతున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. రూ.4999 ప్లాన్‌పై బీఎస్‌ఎన్‌ఎల్ అంతకముందు 1 టీబీ డేటా ఆఫర్ చేయగా.. ప్రస్తుతం 1.5 టీబీ వరకు అంటే 1500 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది.
అదేవిధంగా ఇతర ప్లాన్లపై కూడా ఎఫ్‌యూపీ ప్రయోజనాలను పెంచింది. చెన్నై సర్కిల్‌లో ఎవరైతే, ఫైబ్రో కోంబో యూఎల్‌డీ 4999 ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ఎఫ్‌టీటీహెచ్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తారో, వారికి 100 ఎంబీపీఎస్ స్పీడులో 1.5 టీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఎఫ్‌యూపీ అనంతరం స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు పడిపోనుంది. ఈ ప్లాన్‌పై డేటాతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత వాయిస్‌కాల్స్‌ను(బీఎన్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ పరిధిలోనూ, బయట నెట్‌వర్క్) కూడా అందిస్తోంది.
ఫైబ్రో కోంబో యూఎల్‌డీ 999 ప్లాన్‌పై 250 జీబీ డేటాను 60 ఎంబీపీస్ స్పీడులో అందిస్తుండగా.. రూ.1299 ప్లాన్‌పై 400 జీబీ డేటాను, 80 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. ఫైబ్రో కోంబో యూఎల్‌డీ 1699 ప్లాన్‌పై 550 జీబీ డేటాను, 80 ఎంబీపీఎస్ స్పీడులో... ఫైబ్రో కోంబో యూఎల్‌డీ 1999 ప్లాన్‌పై 800 జీబీ డేటాను 80 ఎంబీపీఎస్ స్పీడులో బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్ చేస్తుంది. అన్ని ఈ ప్రీమియం ఎఫ్‌టీటీహెచ్ ప్లాన్లపై ఉచిత వాయిస్ కాల్స్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. అయితే ఈ టారిఫ్‌లన్నీ కేవలం చెన్నై సర్కిల్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్ జియోకు పోటీగా రూ.1045, రూ.1395, రూ.1895 ప్లాన్లను సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో జియో లాంచ్ చేసిన జియో గిగాఫైబర్‌పై 1 బీబీపీఎస్ వరకు స్పీడును అందించనుంది. గిగాటీవీ సెటాప్-బాక్స్‌లు, స్మార్ట్ హోమ్ డివైజ్‌ల సాయంతో, టీవీలకు కూడా ఇది పనిచేయనుంది. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌లపై గిగాటీవీ ఇతర టీవీలకు, ఫోన్లకు, టాబ్లెట్లకు ఫోన్ కాల్స్ చేసుకోవడానికి వీలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment