data offer
-
నయా ఆఫర్: నెలకు 1500 జీబీ డేటా
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది. తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు జియో గిగాఫైబర్‌ను గత కొన్ని రోజుల క్రితమే లాంచ్ చేసింది. ఇవి త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్లాన్లను పునఃసమీక్షించడం ప్రారంభించింది. చెన్నై సర్కిల్లో తన ప్రీమియం ఎఫ్టీటీహెచ్ ప్లాన్ల ఎఫ్‌యూపీ పరిమితిని పెంచుతున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ.4999 ప్లాన్‌పై బీఎస్ఎన్ఎల్ అంతకముందు 1 టీబీ డేటా ఆఫర్ చేయగా.. ప్రస్తుతం 1.5 టీబీ వరకు అంటే 1500 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఇతర ప్లాన్లపై కూడా ఎఫ్‌యూపీ ప్రయోజనాలను పెంచింది. చెన్నై సర్కిల్లో ఎవరైతే, ఫైబ్రో కోంబో యూఎల్డీ 4999 ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ఎఫ్టీటీహెచ్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తారో, వారికి 100 ఎంబీపీఎస్ స్పీడులో 1.5 టీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఎఫ్‌యూపీ అనంతరం స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు పడిపోనుంది. ఈ ప్లాన్‌పై డేటాతో పాటు బీఎస్ఎన్ఎల్ ఉచిత వాయిస్‌కాల్స్‌ను(బీఎన్ఎన్ఎల్ నెట్వర్క్ పరిధిలోనూ, బయట నెట్వర్క్) కూడా అందిస్తోంది. ఫైబ్రో కోంబో యూఎల్డీ 999 ప్లాన్‌పై 250 జీబీ డేటాను 60 ఎంబీపీస్ స్పీడులో అందిస్తుండగా.. రూ.1299 ప్లాన్‌పై 400 జీబీ డేటాను, 80 ఎంబీపీఎస్ స్పీడులో అందించనున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఫైబ్రో కోంబో యూఎల్డీ 1699 ప్లాన్‌పై 550 జీబీ డేటాను, 80 ఎంబీపీఎస్ స్పీడులో... ఫైబ్రో కోంబో యూఎల్డీ 1999 ప్లాన్‌పై 800 జీబీ డేటాను 80 ఎంబీపీఎస్ స్పీడులో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తుంది. అన్ని ఈ ప్రీమియం ఎఫ్టీటీహెచ్ ప్లాన్లపై ఉచిత వాయిస్ కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. అయితే ఈ టారిఫ్‌లన్నీ కేవలం చెన్నై సర్కిల్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ జియోకు పోటీగా రూ.1045, రూ.1395, రూ.1895 ప్లాన్లను సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో జియో లాంచ్ చేసిన జియో గిగాఫైబర్‌పై 1 బీబీపీఎస్ వరకు స్పీడును అందించనుంది. గిగాటీవీ సెటాప్-బాక్స్‌లు, స్మార్ట్ హోమ్ డివైజ్‌ల సాయంతో, టీవీలకు కూడా ఇది పనిచేయనుంది. జియో గిగాఫైబర్ నెట్‌వర్క్‌లపై గిగాటీవీ ఇతర టీవీలకు, ఫోన్లకు, టాబ్లెట్లకు ఫోన్ కాల్స్ చేసుకోవడానికి వీలవుతుంది. -
జియో మరో బంపర్ ఆఫర్ : వారికి పండగే
ఇతర టెలికాం దిగ్గజాలను సవాల్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను అలరిస్తూ ఉన్న రిలయన్స్ జియో.... ఈ ఐపీఎల్ సందర్భంగా అదిరిపోయే ప్లాన్లను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అత్యంత తక్కువ ధరతో ఎక్కువ డేటాను పొంది ఐపీఎల్ మ్యాచ్‌లను ఆస్వాదించమంటూ సమ్మర్లో యూజర్లను తన వైపుకు తిప్పుకుంది. అదే ఊపులో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూడాలనుకునే క్రికెట్ అభిమానుల కోసం తాజాగా రూ.101తో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త జియో క్రికెట్ ప్యాక్ కింద నాలుగు రోజలు పాటు(మే 29) వరకు రోజుకు 2జీబీ 4జీ డేటాను అంటే మొత్తంగా 8జీబీ యాడ్-ఆన్ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ కాంప్లిమెంటరీ ఆఫర్ ఎంపిక చేసిన జియో యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్యాక్‌లో ఎలాంటి కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలను జియో అందించడం లేదు. కేవలం డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. మై జియో యాప్‌ను ఓపెన్ చేసుకుని మై ప్లాన్స్ సెక్షన్లో మీకు ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటే, రూ.101తో ఈ ప్రయోజనాలను పొందవచ్చని జియో పేర్కొంది. రోజులో ఆఫర్ చేసే లిమిట్ అయిపోతే, 64కేబీపీఎస్ స్పీడులో ఈ అపరిమిత యాక్సస్‌ను పొందవచ్చు. ఈ డేటా ద్వారా యూజర్లు క్రికెట్ మ్యాచ్ లైవ్ వీడియోని ఆస్వాదించవచ్చు. క్రికెట్ ప్యాక్‌గా తీసుకొచ్చిన ఈ ఆఫర్, బ్రౌజింగ్, స్ట్రీమింగ్, డౌన్లోడింగ్ కోసం కూడా వాడుకోవచ్చు. -
జియో కొత్త ఎత్తుగడ: 112 జీబీ ఉచితం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన వినియోగదారులకు బంపర్ఆఫర్ ప్రకటించింది. వినూత్న పథకాలతో కస్టమర్లకు ఈసారి మరో ఆసక్తికర వలతో ఉచిత డేటా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలంటే జియో వినియోగదారులు మరో 10మంది చేత జియో ఫోన్లను కొనిపించాలి. ‘జియో ఫోన్ మ్యాచ్ పాస్’ అని ప్రకటించిన ఈ ఆఫర్లో 112 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ వాలిడిటీ 56రోజులు. అంటే మే 27వ తేదీవరకు మాత్రమే చెల్లుతుంది. దీనితోపాటు 4డే జియో క్రికెట్ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లలో నాలుగు రోజులు పాటు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. అయితే ఇందుకోసం జియో వినియోగదారుడు ద్వారా 10మంది స్నేహితులు లేదా, బంధువులు జియో ఫోన్ కొనుగోలు చేయించాల్సి ఉంటుంది. జియో ఫోన్ మ్యాచ్ పాస్ ఆఫర్ 1800-890-8900 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి జియో ఫోన్‌పై ఆసక్తి ఉన్న స్నేహితుల గురించి సమాచారం ఇవ్వాలి. తరువాత సదరు స్నేహితులు టోల్ ఫ్రీకి కాల్ చేసి, వారి మొబైల్ ఫోన్ నెంబరు, తాముండే ఏరియా పిన్‌కోడ్ ఎంటర్ చేయాలి. అనంతరం జియో రీటైలర్ వద్దగానీ, జియో వెబ్సైట్లో ఆన్లైన్ ఆర్డర్ ద్వారా గానీ జియో ఫోన్‌ను పొందాల్సి ఉంటుంది. సంబంధిత స్నేహితుని జియో నంబర్ యాడ్ అయిన తరువాత మాత్రమే ఆయా ఖాతాల్లో ఈ ఉచిత డేటా ఆఫర్ క్రెడిట్ అవుతుంది. పాస్ ఆఫర్ ప్రక్రియ ముగిసిన అనంతరం దశలవారీగా డేటా ఆఫర్‌ను అందివ్వనుంది. 112 జీబీ ఆఫర్ పొందడం ఎలా? 112 జీబీ డేటా అందుకోవాలంటే మొత్తం 10మంది స్నేహితులు, లేదా బంధువులు జియో ఫోన్ కొనుగోలు చేయాలి. మొదటి నాలుగు సబ్స్క్రైబర్ల తరువాత రోజుకు 2 జీబీ చొప్పున నాలుగురోజుల పాటు 8 జీబీడేటా ఉచితం. 5గురు స్నేహితులు కొనుగోలు తరువాత 12రోజులుపాటు 24జీబీ వాడుకోవచ్చు. 6-9 మధ్య స్నేహితులను పరిచయం చేస్తే 8జీబీ (నాలుగురోజులు) డేటా. ఇక చివరగా 10వ ఫ్రెండ్‌కి గాను 24జీబీ డేటా 12 రోజుల (2జీబీ రోజుకు) పాటు అందిస్తుంది. -
రెడ్మి ఫోన్లపై క్యాష్‌బ్యాక్, 4.5టీబీ డేటా
షావోమి రెండు రోజుల క్రితమే రెడ్మి నోట్5, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.9999తో ఈ స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. షావోమి కొత్తగా తీసుకొచ్చిన ఈ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.2,200 వరకు ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ అందించనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. జియో, షావోమి భాగస్వామ్యంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు పేర్కొంది. అంతేకాక 4.5టీబీ వరకు 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. జియో అందించే క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు ఓచర్ల రూపంలో పొందనున్నారు. ఈ ఓచర్లను రీఛార్జ్‌ల కొనుగోళ్లపై వినియోగించుకోవచ్చని పేర్కొంది. మొత్తం 44 క్యాష్‌బ్యాక్ ఓచర్లను జియో యూజర్లు పొందనున్నారు. రూ.198, రూ.299 ప్లాన్లపై వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. మైజియో యాప్ ద్వారా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రూ.198 లేదా ఆపై రీఛార్జ్‌లపై డబుల్ డేటా అందుబాటులో ఉంటుంది. కేవలం తొలి మూడు రీఛార్జ్‌లకే ఈ డబుల్ డేటా ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. అంటే గరిష్టంగా 4.5టీబీ వరకు 4జీ డేటాను యూజర్లు పొందవచ్చు. కాగ, రెడ్మి నోట్ 5 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9999 కాగ, 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర 11,999 రూపాయలు. అదేవిధంగా రెడ్మి నోట్ 5 ప్రొ 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగ, 6జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర రూ.16,999గా కంపెనీ పేర్కొంది. -
ఎయిర్టెల్ మరో ఆఫర్ : రోజుకు 3.5జీబీ డేటా
భారతీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన రూ.799 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అప్డేట్ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్లాన్ కింద 28 రోజుల పాటు 98జీబీ 3జీ/4జీ డేటా ఆఫర్ చేయనున్నట్టు తెలిసింది. అంటే రోజుకు 3.5జీబీ డేటాను అందించనుంది. ఈ ఆఫర్లోనే లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్ వాయిస్ కాల్స్, 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది.అంతకముందు రూ.799 ప్యాక్ కింద ఎయిర్టెల్ 28 రోజులకు 84 జీబీ డేటానే ఆఫర్ చేసేది. ప్రస్తుతం 3జీబీ పరిమితిని 3.5జీబీకి పెంచేసింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఈ ప్యాక్‌ను రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు రూ.75 క్యాష్‌బ్యాక్ రానుంది. వాయిస్ కాలింగ్ పరిమితి రోజుకు 250 నిమిషాలు ఉంది. వారానికి 1000 నిమిషాలుగా ఉంది. ఎయిర్‌టెల్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన రిలయన్స్జియో కూడా రూ.799ప్యాక్‌ను అందిస్తోంది. జియో అందించే ప్యాక్ కింద రోజుకు 3జీబీ లభ్యమవుతోంది. అంటే ఎయిర్టెల్, జియో కంటే 14జీబీ డేటాను అత్యధికంగా ఆఫర్ చేస్తోంది. కంపెనీ ఇటీవలే ఎయిర్టెల్ టీవీ యాప్‌ను సమీక్షించింది. దీంతో 300 లైవ్ ఛానల్స్‌ను, 6000 కంటే అధికంగా సినిమాలను, అంతర్జాతీయ, జాతీయ షోలను అందిస్తోంది. అప్డేటెడ్ యాప్‌లో 29 హెచ్డీ ఛానల్స్ కూడా ఉన్నాయి. -
ఆ ఫోన్లకు అదనంగా జియో 100జీబీ డేటా
రిలయన్స్ జియో, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి ఒప్పోతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో తన జియో యూజర్లకు అదనపు డేటాను ఆఫర్ చేస్తున్నాయి. రూ.309, ఆపై మొత్తాల జియో రీఛార్జ్‌లకు 100జీబీ వరకు అదనపు డేటాను జియో 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు పొందనున్నారు. ఈ ఆఫర్ 2017 అక్టోబర్ 27 నుంచి 2018 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. అదనపు డేటా ఆఫర్ వివరాలు ఆఫర్ 1 : ఒప్పో ఎఫ్3, ఎఫ్3 ప్లస్, ఎఫ్1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు రూ.309, ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై అదనంగా 10జీబీ డేటాను ప్రతి నెలా అందించనుంది. ఇలా గరిష్టంగా 10 రీఛార్జ్‌లపై ఆఫర్ చేయనుంది. ఆఫర్ 2 : ఒప్పో ఎఫ్1ఎస్, ఏ33ఎఫ్, ఏ37ఎఫ్, ఏ37ఎఫ్డబ్ల్యూ, ఏ57, ఏ71 స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు కస్టమర్లకు రూ.309, ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై అదనంగా 10జీబీ డేటాను ప్రతి నెలా అందించనుంది. అయితే గరిష్టంగా ఆరు రీఛార్జ్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ రిడీమ్ చేసుకునే విధానం... ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో మైజియో యాప్ ఓపెన్ చేయడం మై వోచర్స్ సెక్షన్లో రిడీమ్ ఐకాన్‌పై క్లిక్ చేయడం కిందవైపున్న రీఛార్జ్ బటన్ క్లిక్ చేయడం ఒక్కసారి రీఛార్జ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత, వోచర్ రిడెంప్షన్ విజయవంతమైనట్టు ధృవీకరణ అవుతుంది. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్: రోజుకు 4జీబీ డేటా
న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో ఆఫర్ల యుద్ధం వెల్లువెత్తుతోంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు అదనపు డేటా ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్లతో హోరెత్తికిస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ రూ.999ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రీ పెయిడ్ రీఛార్జ్ ఆఫర్ 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉంటుందని, దీని కింద ఉచిత వాయిస్ కాల్స్‌ను కూడా అందించనున్నట్టు పేర్కొంది. అంటే 28 రోజుల్లో 122జీబీని ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు పొందుతారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి టెలికాం సెక్టార్లో ఈ డేటా యుద్ధం నెలకొంది. రిలయన్స్ జియో రూ.999 ప్లాన్‌కు పోటీగా ఎయిర్టెల్ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. జియో రూ.999 రీఛార్జ్ కింద 90జీబీ 4జీ డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. అయితే 90 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. ఒకవేళ 90జీబీ డేటా వాడకం అయినపోయిన తర్వాత స్పీడు 128 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఆ ప్లాన్ జియో ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. తాజాగా జియో తన రూ.149 ప్లాన్‌ను అప్డేట్ చేసింది. -
బీఎస్ఎన్ఎల్ డేటా ఆఫర్
అనంతపురం రూరల్ : బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఆ సంస్థ డేటా ఆఫర్‌ను ప్రకటించినట్లు సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ వేంకటనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.498 రీచార్జ్‌తో 14రోజుల పాటు డేటాను అన్‌లిమిటెడ్‌గా వాడుకోవచ్చన్నారు. ఈ అవకాశం జనవరి 7వ తేదీ వరకు ఉంటుందన్నారు. ప్రీపెయిడ్ వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
4జీకి అప్‌గ్రేడ్ అవ్వండి.. 2 జీబీ డేటా పొందండి
కస్టమర్లకు వొడాఫోన్ డేటా ఆఫర్ ముంబై: ప్రముఖ టెలికం కంపెనీ ‘వొడాఫోన్’ తాజాగా తన కస్టమర్లకు వినూత్న డేటా ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా యూజర్లు 2జీ/3జీ నుంచి 4జీకి అప్‌గ్రేడ్ అవుతే వారికి 2 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ముంబై ప్రాంతానికి పరిమితమని కంపెనీ పేర్కొంది. ప్రి-పెరుుడ్ కస్టమర్లు ఈ 2 జీబీ డేటాను పది రోజుల వరకు మాత్రమే ఉపయోగించుకునే వీలుంటుందని తెలిపింది. ఇక పోస్ట్-పెరుుడ్ యూజర్లు వారి బిల్లు తేదీ వరకు వాడుకోవచ్చని పేర్కొంది.