
ఇతర టెలికాం దిగ్గజాలను సవాల్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను అలరిస్తూ ఉన్న రిలయన్స్ జియో.... ఈ ఐపీఎల్ సందర్భంగా అదిరిపోయే ప్లాన్లను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అత్యంత తక్కువ ధరతో ఎక్కువ డేటాను పొంది ఐపీఎల్ మ్యాచ్‌లను ఆస్వాదించమంటూ సమ్మర్‌లో యూజర్లను తన వైపుకు తిప్పుకుంది. అదే ఊపులో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూడాలనుకునే క్రికెట్ అభిమానుల కోసం తాజాగా రూ.101తో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త జియో క్రికెట్ ప్యాక్ కింద నాలుగు రోజలు పాటు(మే 29) వరకు రోజుకు 2జీబీ 4జీ డేటాను అంటే మొత్తంగా 8జీబీ యాడ్-ఆన్ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ కాంప్లిమెంటరీ ఆఫర్ ఎంపిక చేసిన జియో యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే ఈ ప్యాక్‌లో ఎలాంటి కాలింగ్ లేదా ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలను జియో అందించడం లేదు. కేవలం డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. మై జియో యాప్‌ను ఓపెన్ చేసుకుని మై ప్లాన్స్ సెక్షన్‌లో మీకు ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటే, రూ.101తో ఈ ప్రయోజనాలను పొందవచ్చని జియో పేర్కొంది. రోజులో ఆఫర్ చేసే లిమిట్ అయిపోతే, 64కేబీపీఎస్ స్పీడులో ఈ అపరిమిత యాక్సస్‌ను పొందవచ్చు. ఈ డేటా ద్వారా యూజర్లు క్రికెట్ మ్యాచ్ లైవ్ వీడియోని ఆస్వాదించవచ్చు. క్రికెట్ ప్యాక్‌గా తీసుకొచ్చిన ఈ ఆఫర్, బ్రౌజింగ్, స్ట్రీమింగ్, డౌన్‌లోడింగ్ కోసం కూడా వాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment