రిలయన్స్ జియో, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి ఒప్పోతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో తన జియో యూజర్లకు అదనపు డేటాను ఆఫర్ చేస్తున్నాయి. రూ.309, ఆపై మొత్తాల జియో రీఛార్జ్‌లకు 100జీబీ వరకు అదనపు డేటాను జియో 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు పొందనున్నారు. ఈ ఆఫర్ 2017 అక్టోబర్ 27 నుంచి 2018 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
అదనపు డేటా ఆఫర్ వివరాలు
ఆఫర్ 1 : ఒప్పో ఎఫ్3, ఎఫ్3 ప్లస్, ఎఫ్1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు రూ.309, ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై అదనంగా 10జీబీ డేటాను ప్రతి నెలా అందించనుంది. ఇలా గరిష్టంగా 10 రీఛార్జ్‌లపై ఆఫర్ చేయనుంది.
ఆఫర్ 2 : ఒప్పో ఎఫ్1ఎస్, ఏ33ఎఫ్, ఏ37ఎఫ్, ఏ37ఎఫ్‌డబ్ల్యూ, ఏ57, ఏ71 స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు కస్టమర్లకు రూ.309, ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌పై అదనంగా 10జీబీ డేటాను ప్రతి నెలా అందించనుంది. అయితే గరిష్టంగా ఆరు రీఛార్జ్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.
ఈ ఆఫర్ రిడీమ్ చేసుకునే విధానం...
ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో మైజియో యాప్ ఓపెన్ చేయడం
మై వోచర్స్ సెక్షన్‌లో రిడీమ్ ఐకాన్‌పై క్లిక్ చేయడం
కిందవైపున్న రీఛార్జ్ బటన్ క్లిక్ చేయడం
ఒక్కసారి రీఛార్జ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత, వోచర్ రిడెంప్షన్ విజయవంతమైనట్టు ధృవీకరణ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment