ఎయిర్‌టెల్‌ మరో ఆఫర్‌ : రోజుకు 3.5జీబీ డేటా | Airtel to offer 3.5 GB of 3G/4G data per day for 28 days | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ మరో ఆఫర్‌ : రోజుకు 3.5జీబీ డేటా

Published Tue, Jan 2 2018 9:07 AM | Last Updated on Tue, Jan 2 2018 2:03 PM

Airtel to offer 3.5 GB of 3G/4G data per day for 28 days - Sakshi

భారతీ ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తన రూ.799 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అప్‌డేట్‌ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్లాన్‌ కింద 28 రోజుల పాటు 98జీబీ 3జీ/4జీ డేటా ఆఫర్ చేయనున్నట్టు తెలిసింది. అంటే రోజుకు 3.5జీబీ డేటాను అందించనుంది. ఈ ఆఫర్‌లోనే  లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌, 100 లోకల్‌, నేషనల్‌ ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది.అంతకముందు రూ.799 ప్యాక్‌ కింద ఎయిర్‌టెల్‌ 28 రోజులకు 84 జీబీ డేటానే ఆఫర్‌ చేసేది. ప్రస్తుతం 3జీబీ పరిమితిని 3.5జీబీకి పెంచేసింది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ద్వారా ఈ ప్యాక్‌ను రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు రూ.75 క్యాష్‌బ్యాక్‌ రానుంది. వాయిస్‌ కాలింగ్‌ పరిమితి రోజుకు 250 నిమిషాలు ఉంది. వారానికి 1000 నిమిషాలుగా ఉంది. 

ఎయిర్‌టెల్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన రిలయన్స్‌జియో కూడా రూ.799ప్యాక్‌ను అందిస్తోంది. జియో అందించే ప్యాక్‌ కింద రోజుకు 3జీబీ లభ్యమవుతోంది. అంటే ఎయిర్‌టెల్‌, జియో కంటే 14జీబీ డేటాను అత్యధికంగా ఆఫర్‌ చేస్తోంది. కంపెనీ ఇటీవలే ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ను సమీక్షించింది. దీంతో 300 లైవ్‌ ఛానల్స్‌ను, 6000 కంటే అధికంగా సినిమాలను, అంతర్జాతీయ, జాతీయ షోలను అందిస్తోంది. అప్‌డేటెడ్‌ యాప్‌లో 29 హెచ్‌డీ ఛానల్స్‌ కూడా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement