రెడ్‌మి ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌, 4.5టీబీ డేటా | Redmi Note 5 Redmi Note 5 Pro Jio Rs 2200 Cashback Double Data Offer | Sakshi
Sakshi News home page

రెడ్‌మి ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌, 4.5టీబీ డేటా

Published Fri, Feb 16 2018 12:41 PM | Last Updated on Fri, Feb 16 2018 12:41 PM

Redmi Note 5 Redmi Note 5 Pro Jio Rs 2200 Cashback Double Data Offer - Sakshi

షావోమి రెండు రోజుల క్రితమే రెడ్‌మి నోట్‌5, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.9999తో ఈ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. షావోమి కొత్తగా తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.2,200 వరకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ అందించనున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. జియో, షావోమి భాగస్వామ్యంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు పేర్కొంది. అంతేకాక 4.5టీబీ వరకు 4జీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. 

జియో అందించే క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు ఓచర్ల రూపంలో పొందనున్నారు. ఈ ఓచర్లను రీఛార్జ్‌ల కొనుగోళ్లపై వినియోగించుకోవచ్చని పేర్కొంది. మొత్తం 44 క్యాష్‌బ్యాక్‌ ఓచర్లను జియో యూజర్లు పొందనున్నారు. రూ.198, రూ.299 ప్లాన్లపై వీటిని రిడీమ్‌ చేసుకోవచ్చు. మైజియో యాప్‌ ద్వారా ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. రూ.198 లేదా ఆపై రీఛార్జ్‌లపై డబుల్‌ డేటా అందుబాటులో ఉంటుంది. కేవలం తొలి మూడు రీఛార్జ్‌లకే  ఈ డబుల్‌ డేటా ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. అంటే గరిష్టంగా 4.5టీబీ వరకు 4జీ డేటాను యూజర్లు పొందవచ్చు. 

కాగ, రెడ్‌మి నోట్‌ 5 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.9999 కాగ, 4జీబీ ర్యామ్‌, 64జీబీ వేరియంట్‌ ధర 11,999 రూపాయలు. అదేవిధంగా రెడ్‌మి నోట్‌ 5 ప్రొ 4జీబీ ర్యామ్‌, 64జీబీ వేరియంట్‌ ధర రూ.13,999 కాగ, 6జీబీ ర్యామ్‌, 64జీబీ వేరియంట్‌ ధర రూ.16,999గా కంపెనీ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement