Redmi Note 5
-
రెడ్మి నోట్ 5 పోటీగా ఒప్పో స్మార్ట్‌ఫోన్..
షావోమి రెడ్మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ తెలిసే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అదిరిపోయే ఫీచర్లతో, బడ్జెట్ ధరలో షావోమి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి పోటీగా ఒప్పో రంగంలోకి దిగింది. ఎట్టకేలకు తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఏ3ఎస్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది. ఒకే ఒక్క స్టోరేజ్ ఆప్షన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అది 2 జీబీ ర్యామ్ , 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఫీచర్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ‘సూపర్ ఫుల్ స్క్రీన్’ డిస్ప్లే, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్ఓసీ, ఒప్పో ఏఐ బ్యూటీ టెక్నాలజీ 2.0తో సెల్ఫీ కెమెరా ఇవన్నీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లుగా ఉన్నాయి. దక్షిణ ఆసియా మార్కెట్లో 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చిన తొలి ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఏఐ ఆధారితంగా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇది కలిగి ఉంది. ‘ఏ3ఎస్తో మేము యువతను లక్ష్యంగా చేసుకున్నాం. ఎవరైతే అడ్వాన్స్ కెమెరా ఫోన్‌ను, బలమైన బ్యాటరీ లైఫ్‌ను కావాలనుకుంటారో వారికోసం దీన్ని తీసుకొచ్చాం’ అని ఒప్పో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ విల్ యాంగ్ చెప్పారు. ఒప్పో ఏ3ఎస్ ధర... ఈ స్మార్టఫోన్ ధర రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది. జూలై 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎంతో పాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇది విక్రయానికి వస్తుంది. డార్క్ పర్పుల్, రెడ్ కలర్స్‌లో ఇది లభ్యమవుతుంది. ఒప్పో ఏ3ఎస్ స్పెషిఫికేషన్లు.. ఆండ్రాయిడ్ 8.1 ఓరియా ఆధారిత కలర్ఓఎస్ 5.1 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ సూపర్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే 1.8గిగాహెడ్జ్తో ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్ఓసీ 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఏఐ బ్యూటీ టెక్నాలజీ 2.0 4230 ఎంఏహెచ్ బ్యాటరీ -
24 గంటల పాటు రెడ్మి నోట్ 5 సేల్
షావోమీ కంపెనీ రెడ్మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్‌ను రోజంతా నిర్వహించబోతోంది. నేటి అర్ధరాత్రి 11:59 నుంచి రెడ్ మి నోట్ 5 విక్రయాలను తన వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభించబోతున్నట్టు షావోమి ప్రకటించింది. సాధారణంగా ఈ ఫోన్‌ను షావోమి ప్రతి వారం ఫ్లాష్ సేల్ ద్వారా విక్రయిస్తోంది. అది కూడా మధ్యాహ్నం 12 గంటలకు మొదలై నిమిషాల్లోనే ముగిసిపోతోంది. దీంతో ఈ ఫోన్ కోరుకునే వారి కోసం షావోమి, ఎంఐ.కామ్ ద్వారా ఒక రోజు పాటు ఫ్లాష్ సేల్‌ను చేపట్టబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ మి నోట్ 5ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెడ్మి నోట్ 5కు సక్సెసర్‌గా దీన్ని తీసుకొచ్చింది. సెమీ-బడ్జెట్ ఫోన్ అయిన రెడ్మి నోట్ 5 రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ఒకటి 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.9,999. రెండోది 4జీబీ ర్యామ్, 64జీబీ ర్యామ్ ధర రూ.11,999. ఈ ఫోన్‌కు 5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లే డిస్ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని పెంచుకునే కెపాసిటీ, షావోమి ఎంఐయూఐ 9.5 ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ నోగట్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. -
రెడ్మి నోట్ 5 ఆఫ్‌లైన్‌గా...
ఫ్లాష్ సేల్కు వచ్చిన నిమిషాల్లో అవుటాఫ్ స్టాక్ అవుతున్న రెడ్మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఇక నుంచి ఆఫ్‌లైన్‌గా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు షావోమి ప్రకటించింది. గత నెలలోనే రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్లను షావోమి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచ్ చేసిన అనంతరం వీటిని ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో అందుబాటులో ఉంచింది. ఫ్లాష్ సేల్కు వచ్చిన ప్రతీసారి ఈ స్మార్ట్ఫోన్లు నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అవుతున్నాయి. త్వరలోనే ఆఫ్‌లైన్ రిటైల్ పార్టనర్ల వద్ద అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రెడ్మి నోట్ 5 ప్రీ-బుకింగ్స్‌ను ఆఫ్‌లైన్ స్టోర్ల వద్ద షావోమి ప్రారంభించింది. వీటి డెలివరీని మార్చి 8 నుంచి మొదలుపెడుతుంది. రెండు వేల రూపాయలు కట్టి ఈ ఫోన్‌ను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని రిటైల్ వర్గాలు తెలిపాయి. అంతేకాక త్వరలో ఆఫ్‌లైన్ రిటైల్ పార్టనర్ల వద్ద విక్రయానికి రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఆన్లైన్ కంటే రూ.500 ఎక్కువగా ఉండనుంది. థర్డ్ పార్టీ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా రెడ్మి నోట్ 5ను కొనుగోలు చేస్తే, 3జీబీ ర్యామ్, 32జీబీ మోడల్ ధర 10,499 రూపాయలు. అసలు ఆన్‌లైన్‌గా ఈ మోడల్ ధర 9,999 రూపాయలు. అదేవిధంగా 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఆఫ్‌లైన్‌గా 12,499 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఆన్‌లైన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.11,999గా ఉంది. అదేవిధంగా రెడ్మి నోట్ 5 ప్రొ ధర కూడా ఆన్‌లైన్‌గా కంటే ఆఫ్‌లైన్‌గా 500 రూపాయలు ఎక్కువగా ఉండనుంది. షావోమి రెడ్మి నోట్ 5 ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. షావోమి రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భలే గిరాకీ : నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ షావోమికి చెందిన కొత్త స్మార్ట్ఫోన్లు రెడ్మి నోట్5, రెడ్మి నోట్ 5 ప్రొలకు భలే గిరాకీ వచ్చింది. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో తొలి ఫ్లాష్ సేల్కు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఈ రెండు స్మార్ట్ఫోన్లు అవుటాఫ్ స్టాక్ అయ్యాయి. 3 నిమిషాల్లోనే 3 లక్షల యూనిట్ల స్మార్ట్ఫోన్లు, అంటే నిమిషానికి లక్ష ఫోన్లు అమ్ముడుపోయినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ తెలిపారు. ఇండియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సేల్‌గా అభివర్ణించారు. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అయిన రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ తర్వాతి సేల్ ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉండబోతున్నట్టు పేర్కొన్నారు. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అవడంపై, కస్టమర్లు తీవ్ర నిరాశ వ్యక్తంచేస్తున్నారు. ఈ రెండు స్మార్ట్ఫోన్లతో పాటు షావోమి ఎంఐ టీవీ 4ను కూడా కంపెనీ నేడు విక్రయానికి తీసుకొచ్చింది. షావోమి రెడ్మి నోట్ 5 ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. షావోమి రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ #RedmiNote5 & #RedmiNote5Pro: we sold 3L+ units in -
రెడ్మి ఫోన్లపై క్యాష్‌బ్యాక్, 4.5టీబీ డేటా
షావోమి రెండు రోజుల క్రితమే రెడ్మి నోట్5, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.9999తో ఈ స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. షావోమి కొత్తగా తీసుకొచ్చిన ఈ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.2,200 వరకు ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ అందించనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. జియో, షావోమి భాగస్వామ్యంలో ఈ క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు పేర్కొంది. అంతేకాక 4.5టీబీ వరకు 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. జియో అందించే క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు ఓచర్ల రూపంలో పొందనున్నారు. ఈ ఓచర్లను రీఛార్జ్‌ల కొనుగోళ్లపై వినియోగించుకోవచ్చని పేర్కొంది. మొత్తం 44 క్యాష్‌బ్యాక్ ఓచర్లను జియో యూజర్లు పొందనున్నారు. రూ.198, రూ.299 ప్లాన్లపై వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. మైజియో యాప్ ద్వారా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రూ.198 లేదా ఆపై రీఛార్జ్‌లపై డబుల్ డేటా అందుబాటులో ఉంటుంది. కేవలం తొలి మూడు రీఛార్జ్‌లకే ఈ డబుల్ డేటా ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. అంటే గరిష్టంగా 4.5టీబీ వరకు 4జీ డేటాను యూజర్లు పొందవచ్చు. కాగ, రెడ్మి నోట్ 5 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9999 కాగ, 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర 11,999 రూపాయలు. అదేవిధంగా రెడ్మి నోట్ 5 ప్రొ 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగ, 6జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర రూ.16,999గా కంపెనీ పేర్కొంది. -
రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ వచ్చేశాయ్
షావోమి న్యూఢిల్లీ వేదికగా రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. రెడ్మి నోట్ 4కు సక్ససర్‌గా రెడ్మి నోట్ 5ను విడుదల చేస్తున్నట్టు కంపెనీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ తెలిపారు. రెడ్మి నోట్ 4తో పోలిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ బెజెల్-లెస్ డిజైన్, అతిపెద్దగా 5.99 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. రెడ్మి నోట్ 4 బ్యాటరీ కెపాసిటీ కూడా 4000 ఎంఏహెచ్. గతేడాది మోడల్ కంటే సగం మిల్లీమీటర్ పలుచగా ఉందని తెలిపారు. ముందస్తు నోట్ స్మార్ట్ఫోన్ల కంటే మెరుగ్గా లో-లైట్ ఫోటోగ్రఫీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్625 ప్రాసెసర్ కింద 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.9,999గా, రూ. 11,999గా ఉన్నాయి. నాలుగు రంగుల్లో రెడ్మి నోట్ 5 అందుబాటులో ఉంచనున్నట్టు మను కుమార్ జైన్ తెలిపారు. షావోమి లాంచ్ చేసిన మరో స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.13,999గా, రూ.16,999గా ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌తో షావోమి తన యూజర్లకు ప్రవేశపెట్టింది. 20 మెగాపిక్సెల్‌తో సెల్ఫీ షూటర్ కలిగి ఉండగా.. వెనుకవైపు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లను వచ్చే వారం నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లలో ఫ్లాష్ సేల్కు రానున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆఫ్‌లైన్‌గా కూడా వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. వీటితో పాటు తొలిసారి భారత్‌లో ఎంఐ టీవీ4ను కూడా కంపెనీ విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 కంటే పలుచగా ఈ ఎంఐ టీవీ ఉంది. ప్రపంచంలోనే అత్యంత పలుచైన ఎల్ఈడీ టీవీ ఇదేనని షావోమి తెలిపింది. దీని ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. హాట్‌స్టార్, వూట్, సోనీ లివ్, హంగామా ప్లే, జీ5, సన్ నెక్ట్స్, వియూ, టీవీఎఫ్, ఫ్లిక్‌స్ట్రీ వంటి వాటితో షావోమి భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. వీటి భాగస్వామ్యంతో 5 లక్షల గంటల కంటెంట్‌ను అందించనున్నట్టు పేర్కొంది. దీనిలో 80 శాతం కంటెంంట్ను పూర్తిగా ఉచితమని తెలిపింది. ఎంఐ టీవీ 4 తోపాటు ఎంఐ టీవీ రిమోట్‌ను కూడా షావోమి తీసుకొచ్చింది. దీనిలో కేవలం 11 బటన్లు మాత్రమే ఉన్నాయి. -
షావోమి ఫ్యాన్స్‌కు వాలెంటైన్స్ డే కానుక
వాలెంటైన్స్ డే కానుకగా షావోమి ఫ్యాన్స్ ముందుకు ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. రెడ్మి నోట్ 5 ను షావోమి రేపు విడుదల చేయబోతుంది. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించి ఆహ్వానాలను కూడా కంపెనీ పంపించేసింది. రేపు విడుదల కాబోతున్న స్మార్ట్‌ఫోన్ పేరు రెడ్మి నోట్ 5 అని షావోమి వెబ్సైట్ ధృవీకరించింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే విక్రయానికి రానుంది. రెడ్మి ఫోన్ లాంచ్ ఈవెంట్ గురించి, ఈ ఈ-కామర్స్ వెబ్సైట్ ఓ బ్యానర్‌ను లిస్టు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ రెడ్మి నోట్ 5 ఈవెంట్‌ను షావోమి లైవ్ స్ట్రీమ్ చేయనుంది. లైవ్‌స్ట్రీమ్ కోసం యూజర్లు తమ షావోమి అకౌంట్‌తో ఎం.కామ్ వెబ్సైట్లో రిజిస్ట్రర్ అవ్వాలి. లేదా ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కూడా వీక్షించవచ్చు. రెడ్మి నోట్ 5తో పాటు కంపెనీ తొలి టీవీని కూడా లాంచ్ చేస్తోందని తెలుస్తోంది. ఎంఐ టీవీ 4 పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. షావోమి లాంచ్ చేస్తున్న ఈ టీవీ 49 అంగుళాలు, 55 అంగుళాలు లేదా 65 అంగుళాలు ఉండబోతుందని టాక్. -
రెడ్మి నోట్5 ఫుల్ స్పెషిఫికేషన్లు ఇవేనట..
బడ్జెట్ స్మార్ట్ఫోన్లతో షియోమి మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెడ్మి నోట్4 విజయవంతమైన నేపథ్యంలో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్5తో మన ముందుకు రాబోతుంది షియోమి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్ స్పెషిఫికేషన్లు కూడా ఆన్లైన్లో లీకైపోయాయి. ఒరిజినల్ రెడ్మి నోట్4 మాదిరిగానే ఇది ఫుల్ మెటల్ బాడీతో మార్కెట్లోకి రాబోతుందని తెలుస్తోంది. అయితే ఈసారి తీసుకొస్తున్న ఎడిషిన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌లో కంపెనీ మేజర్ రీఫ్రెష్ చేసిందని లీకేజీ వివరాలు వెల్లడిస్తున్నాయి. రెడ్మి నోట్ 4కు ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుకవైపు ఉంటే, ఈ ఫోన్లో ముందు వైపు ఉండబోతుందని లీకేజీల టాక్. అంతేకాక లీకేజీ వివరాల ప్రకారం రెడ్మి నోట్5 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల డిస్ప్లేతో, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 3జీబీ/4జీబీ ర్యామ్, 32జీబీ/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 ఎంపీ రియర్ కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, 3,790 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఇతర ప్రత్యేకతలని లీకేజీ వివరాలు చెబుతున్నాయి. ఎంఐయూఐ ఆధారిత ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఓఎస్‌ను ఇది కలిగి ఉండబోతుందని లీకేజీలు పేర్కొంటున్నాయి. కాగ, రెడ్మి నోట్ 4ను కంపెనీ ఈ ఏడాది జనవరిలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2జీబీ, 3జీబీ 4జీబీ ర్యామ్ మోడల్లను 9,999 రూపాయలు, 10,999రూపాయలు, 12,999 రూపాయల ధరల శ్రేణిలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.