రెడ్‌మి నోట్5 ఫుల్ స్పెషిఫికేషన్లు ఇవేనట..
రెడ్‌మి నోట్5 ఫుల్ స్పెషిఫికేషన్లు ఇవేనట..
Published Mon, Jul 3 2017 7:32 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతో షియోమి మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెడ్‌మి నోట్4 విజయవంతమైన నేపథ్యంలో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్5తో మన ముందుకు రాబోతుంది షియోమి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్ స్పెషిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకైపోయాయి. ఒరిజినల్ రెడ్‌మి నోట్4 మాదిరిగానే ఇది ఫుల్ మెటల్ బాడీతో మార్కెట్లోకి రాబోతుందని తెలుస్తోంది. అయితే ఈసారి తీసుకొస్తున్న ఎడిషిన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌లో కంపెనీ మేజర్ రీఫ్రెష్ చేసిందని లీకేజీ వివరాలు వెల్లడిస్తున్నాయి. రెడ్‌మి నోట్ 4కు ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుకవైపు ఉంటే, ఈ ఫోన్‌లో ముందు వైపు ఉండబోతుందని లీకేజీల టాక్.
అంతేకాక లీకేజీ వివరాల ప్రకారం రెడ్‌మి నోట్5 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 3జీబీ/4జీబీ ర్యామ్, 32జీబీ/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 ఎంపీ రియర్ కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, 3,790 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఇతర ప్రత్యేకతలని లీకేజీ వివరాలు చెబుతున్నాయి. ఎంఐయూఐ ఆధారిత ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఓఎస్‌ను ఇది కలిగి ఉండబోతుందని లీకేజీలు పేర్కొంటున్నాయి. కాగ, రెడ్‌మి నోట్ 4ను కంపెనీ ఈ ఏడాది జనవరిలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2జీబీ, 3జీబీ 4జీబీ ర్యామ్ మోడల్‌లను 9,999 రూపాయలు, 10,999రూపాయలు, 12,999 రూపాయల ధరల శ్రేణిలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
Advertisement
Advertisement