ఒప్పో ఏ3ఎస్ స్మార్ట్‌ఫోన్
షావోమి రెడ్‌మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ తెలిసే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అదిరిపోయే ఫీచర్లతో, బడ్జెట్ ధరలో షావోమి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి పోటీగా ఒప్పో రంగంలోకి దిగింది. ఎట్టకేలకు తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఏ3ఎస్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది. ఒకే ఒక్క స్టోరేజ్ ఆప్షన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. అది 2 జీబీ ర్యామ్ , 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఫీచర్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ‘సూపర్ ఫుల్ స్క్రీన్’ డిస్‌ప్లే, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్‌ఓసీ, ఒప్పో ఏఐ బ్యూటీ టెక్నాలజీ 2.0తో సెల్ఫీ కెమెరా ఇవన్నీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లుగా ఉన్నాయి. దక్షిణ ఆసియా మార్కెట్‌లో 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చిన తొలి ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఏఐ ఆధారితంగా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇది కలిగి ఉంది. ‘ఏ3ఎస్‌తో మేము యువతను లక్ష్యంగా చేసుకున్నాం. ఎవరైతే అడ్వాన్స్ కెమెరా ఫోన్‌ను, బలమైన బ్యాటరీ లైఫ్‌ను కావాలనుకుంటారో వారికోసం దీన్ని తీసుకొచ్చాం’ అని ఒప్పో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ విల్ యాంగ్ చెప్పారు.
ఒప్పో ఏ3ఎస్ ధర...
ఈ స్మార్టఫోన్ ధర రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది. జూలై 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎంతో పాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇది విక్రయానికి వస్తుంది. డార్క్ పర్పుల్, రెడ్ కలర్స్‌లో ఇది లభ్యమవుతుంది.
ఒప్పో ఏ3ఎస్ స్పెషిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 8.1 ఓరియా ఆధారిత కలర్‌ఓఎస్ 5.1
6.2 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే
1.8గిగాహెడ్జ్‌తో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్‌ఓసీ
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఏఐ బ్యూటీ టెక్నాలజీ 2.0
4230 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment