24 గంటల పాటు రెడ్‌మి నోట్‌ 5 సేల్‌ | Xiaomi Hosts Exclusive 24 Hour Flash Sale Of Redmi Note 5 | Sakshi
Sakshi News home page

24 గంటల పాటు రెడ్‌మి నోట్‌ 5 సేల్‌

Published Wed, Apr 25 2018 8:18 PM | Last Updated on Wed, Apr 25 2018 8:19 PM

Xiaomi Hosts Exclusive 24 Hour Flash Sale Of Redmi Note 5 - Sakshi

షావోమీ కంపెనీ రెడ్‌మి నోట్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌ సేల్‌ను రోజంతా నిర్వహించబోతోంది. నేటి అర్ధరాత్రి 11:59 నుంచి రెడ్ మి నోట్ 5 విక్రయాలను తన వెబ్‌సైట్‌ ఎంఐ.కామ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభించబోతున్నట్టు షావోమి ప్రకటించింది. సాధారణంగా ఈ ఫోన్‌ను షావోమి ప్రతి వారం ఫ్లాష్ సేల్ ద్వారా విక్రయిస్తోంది. అది కూడా మధ్యాహ్నం 12 గంటలకు మొదలై నిమిషాల్లోనే ముగిసిపోతోంది. దీంతో ఈ ఫోన్ కోరుకునే వారి కోసం షావోమి, ఎంఐ.కామ్‌ ద్వారా ఒక రోజు పాటు ఫ్లాష్‌ సేల్‌ను చేపట్టబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ మి నోట్ 5ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

రెడ్‌మి నోట్‌ 5కు సక్సెసర్‌గా దీన్ని తీసుకొచ్చింది. సెమీ-బడ్జెట్‌ ఫోన్‌ అయిన రెడ్‌మి నోట్‌ 5 రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో ఒకటి 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.9,999. రెండోది 4జీబీ ర్యామ్, 64జీబీ ర్యామ్ ధర రూ.11,999. ఈ ఫోన్‌కు 5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లే  డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌, 12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని పెంచుకునే కెపాసిటీ, షావోమి ఎంఐయూఐ 9.5 ఓఎస్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ నోగట్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీనిలో ఫీచర్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement