Mi.com
-
మరోసారి సేల్కు వచ్చిన షావోమి పోకో ఎఫ్1
మొబైల్ రంగంలో దూసుకెళ్తున్న చైనీస్ దిగ్గజం షావోమి. ఈ కంపెనీ తన సబ్‌బ్రాండ్ పోకో కింద పోకో ఎఫ్1 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే నాలుగుసార్లు విక్రయానికి వచ్చి అదరగొట్టింది. నేడు కూడా ఈ స్మార్ట్‌ఫోన్ మరోసారి విక్రయానికి వచ్చింది. పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లో విక్రయానికి ఉంచింది షావోమి కంపెనీ. మూడు వేరియంట్లు ఒకటి.. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్(ధర రూ.20,999), రెండు... 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఆప్షన్(రూ.28,999), మూడు.. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ స్పెషల్ ఎడిషన్(ధర రూ.29,999)ను అందుబాటులో ఉంచింది. గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ వేరియంట్లు ఫ్లిప్‌కార్ట్, షావోమి అధికారిక స్టోర్‌లో అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ప్రకటించింది. 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ఓపెన్ సేల్‌లో అందుబాటులో ఉంది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 అంగుళాల డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్‌రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ మాస్టర్ ఆఫ్ స్పీడ్ గా ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను పేర్కొన్నకంపెనీ ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 1.4 మైక్రాన్ పిక్సెల్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ తదితర ఫీచర్లతో పోకోఫోన్ ఎఫ్1 అందుబాటులోకి తీసుకొచ్చింది షావోమి కంపెనీ. -
తొలి సేల్కు వస్తున్న ఎంఐ ఏ2
షావోమి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఏ2 తొలి సేల్కు వస్తోంది. ఆగస్టు 16న అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆన్లైన్ స్టోర్లు, అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఎంఐ ఏ2 ధర భారత్‌లో 16,999 రూపాయలుగా ఉంది. ఈ వెబ్సైట్లలో ఎంఐ ఏ2ను పలు లాంచ్ ఆఫర్లతో లిస్ట్ చేశాయి. ఆగస్టులో ఈ ఫోన్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 9 నుంచే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లోనే భారత్‌లోకి వస్తోంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను తర్వాత మార్కెట్లోకి తీసుకురానుంది. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌గా, ఇతర రిటైల్ స్టోర్లలో కూడా ఎంఐ ఏ2 అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ తెలిపింది. లాంచ్ ఆఫర్లు... ఎంఐ ఏ2 కొనుగోలుదారులకు 2,200 రూపాయల ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్, 4.5టీబీ వరకు డేటాను రిలయన్స్ జియో ఆఫర్ చేయనుంది. ఎంఐ ఎక్స్చేంజ్ ప్రొగ్రామ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్లో తక్కువ ధరలో ఈ కొత్త డివైజ్‌ను యూజ్లు పొందవచ్చు. 999 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ఎంఐ ప్రొటెక్ట్ ప్లాన్లు, ఎంఐ ఏ2కు అందుబాటులో ఉంటాయి. ఎంఐ ఏ 2 ఫీచర్లు... 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 18:9 రేషియో, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 660 ఎస్వోసీ, ప్రాసెసర్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 లేయర్ ఆర్క్ డిజైన్‌తో అల్యూమినియం యూనిబాడీ ఆండ్రాయిడ్ వన్ 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ 12+20 ఎంపి డ్యుయల్ రియర్ కెమెరా 20ఎంపీ ఫ్రంట్ కెమెరా 3010ఎంఏహెచ్ బ్యాటరీ -
ఓపెన్ సేల్‌లో రెడ్మి నోట్ 5 ప్రొ
షావోమి పాపులర్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రొ ఎట్టకేలకు ఓపెన్ సేల్కు వచ్చింది. 24 గంటల పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో ఆరు నెలల పాటు కొనసాగిన రెడ్మి నోట్ 5 ప్రొ ఫ్లాష్ సేల్స్‌కు తెరపడింది. ప్రతి వారం నిర్వహించే ఫ్లాష్‌సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుకు ఇబ్బందులు పడే కస్టమర్లు... ఇకపై ఎప్పుడైనా ఈ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లాష్ సేల్ కి రాగానే నిమిషాల వ్యవధిలో ఈ ఫోన్ సేల్ అయిపోయి అవుట్ ఆఫ్ స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తుండటంతో కంపెనీ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. షావోమి అధికారిక వెబ్సైట్ ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది. బ్లాక్, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో రెడ్మి నోట్ 5 ప్రొ మార్కెట్లోకి వచ్చింది. రెడ్మి నోట్ 5 ప్రొ బేస్ వేరియంట్ ధర రూ.14,999కాగ, హై-ఎండ్ వెర్షన్ ధర రూ16,999గా ఉంది. రెడ్మి నోట్ 5 ప్రొ లాంచ్ ఆఫర్లుగా 2,200 రూపాయల క్యాష్‌బ్యాక్, 4.5టీబీ అదనపు డేటాను జియో ఆఫర్ చేస్తోంది. 3 నెలల హంగామా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా లభించనుంది. యాక్సిస్ బ్యాంక్ బుజ్ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు... 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ 4/6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
24 గంటల పాటు రెడ్మి నోట్ 5 సేల్
షావోమీ కంపెనీ రెడ్మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్‌ను రోజంతా నిర్వహించబోతోంది. నేటి అర్ధరాత్రి 11:59 నుంచి రెడ్ మి నోట్ 5 విక్రయాలను తన వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభించబోతున్నట్టు షావోమి ప్రకటించింది. సాధారణంగా ఈ ఫోన్‌ను షావోమి ప్రతి వారం ఫ్లాష్ సేల్ ద్వారా విక్రయిస్తోంది. అది కూడా మధ్యాహ్నం 12 గంటలకు మొదలై నిమిషాల్లోనే ముగిసిపోతోంది. దీంతో ఈ ఫోన్ కోరుకునే వారి కోసం షావోమి, ఎంఐ.కామ్ ద్వారా ఒక రోజు పాటు ఫ్లాష్ సేల్‌ను చేపట్టబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ మి నోట్ 5ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెడ్మి నోట్ 5కు సక్సెసర్‌గా దీన్ని తీసుకొచ్చింది. సెమీ-బడ్జెట్ ఫోన్ అయిన రెడ్మి నోట్ 5 రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ఒకటి 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.9,999. రెండోది 4జీబీ ర్యామ్, 64జీబీ ర్యామ్ ధర రూ.11,999. ఈ ఫోన్‌కు 5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లే డిస్ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని పెంచుకునే కెపాసిటీ, షావోమి ఎంఐయూఐ 9.5 ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ నోగట్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. -
ప్రీ-ఆర్డర్‌కు వచ్చిన రెడ్మి నోట్ 5 ప్రొ
షావోమి రెడ్మి నోట్ 5 సిరీస్‌లో హై-ఎండ్ వేరియంట్ రెడ్మి నోట్ 5 ప్రొ నేడు ప్రీ-ఆర్డర్స్‌కు వచ్చేసింది. షావోమి ఈ-కామర్స్ వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రీ-ఆర్డర్లకు ఉంచింది. దీంతో ఇక నుంచి రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌సేల్ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్కు వచ్చిన ప్రతీసారి‘సోల్డ్ అవుట్’ అని దర్శనమిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర నిరాశకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ రెడ్మి నోట్ 5 ప్రొ ప్రీ-ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎంఐ వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ ఫోన్‌ను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంచింది. ఆర్డర్ చేసిన తర్వాత రెండు లేదా నాలుగు వారాల్లో ఈ ఫోన్‌ను వినియోగదారుడికి డెలివరీ అవుతుంది. ఒక వ్యక్తి ఒకటి, లేదా రెండు మాత్రమే ఫోన్లను ఆర్డర్ చేసే సౌకర్యం కల్పించింది. ఒకవేళ ముందస్తు ఆర్డర్‌ను రద్దు చేసుకోవాలనుకుంటే ఫోన్ షిప్పింగ్ కన్నా ముందే రద్దు చేసుకోవాలి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా రెడ్మి నోట్ 5 ప్రొ అందుబాటులో ఉంటుంది. కానీ వీక్లీ ఫ్లాష్ సేల్స్ ద్వారానే ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను విక్రయించనుంది. 4జీబీ ర్యామ్ 64జీబీ మెమరీ సామర్థ్యం ఉన్న రెడ్మి నోట్ 5 ప్రొ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.16,999. షావోమి ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఫోన్లన్నంటిలో ఇదే ఖరీదైనది. ఇది నలుపు, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ఆర్డర్ చేసుకున్న వారికి జియో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. రూ.2,200 విలువ కలిగిన 44 వోచర్లను ‘మై జియో’ యాప్‌లో యాడ్ చేస్తుంది. అంతేకాకుండా రూ.198, రూ.299 రీఛార్జ్‌తో 4.5టీబీ వరకూ డేటాను పొందవచ్చు. రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్స్ 5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ వెనుక 12 మెగా పిక్సెల్, 5మెగాపిక్సెల్స్‌తో డ్యుయల్ కెమెరా ముందు వైపు 20 మెగాపిక్సెల్ కెమెరా 4000 ఎంఎహెచ్ బ్యాటరీ -
ఓపెన్ సేల్‌లో రెడ్మి 5
షావోమి అత్యంత పలుచనైన అద్భుత స్మార్ట్‌ఫోన్ రెడ్మి 5 ఓపెన్ సేల్కు వచ్చింది. అమెజాన్.ఇన్, అమెజాన్ ఇండియా యాప్, ఎంఐ.కామ్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ ఇక శాశ్వతంగా ఓపెన్ సేల్‌లో అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇక నుంచి ఫ్లాష్‌సేల్ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఎల్లప్పుడూ ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 2జీబీ/ 16జీబీ, 3జీబీ/ 32జీబీ, 4జీబీ/ 64జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ ఓపెన్ సేల్‌లో ఉంటుంది. గోల్డ్, బ్లాక్, రోజ్ గోల్డ్, బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి అమెజాన్ కిండ్లీ ఈబుక్స్‌పై 90 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు 5 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్, రిలయన్స్ జియో నుంచి డేటా, రూ.2200 క్యాష్‌బ్యాక్ లభించనుంది. రెడ్మి 5 స్పెషిఫికేషన్లు 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఫుల్‌స్క్రీన్ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్ఓసీ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ సెల్ఫీ లైట్ -
రూపాయికే షావోమి స్మార్ట్‌ఫోన్: రేపటి నుంచే సేల్
ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్.. వినడానికి విడ్డూరంగా ఉందా..! కానీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షావోమి, రూపాయికే స్మార్ట్‌ఫోన్ అందిస్తుంది. ఒక్క స్మార్ట్ఫోన్లను మాత్రమే కాక, వీఆర్ హెడ్‌సెట్స్, రూటర్స్, ఫిట్నెస్ బ్రాండ్లను కూడా రూపాయికే ఆఫర్ చేస్తుంది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్‌లో షావోమి ఈ ఆఫర్‌ను ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 21 వరకు షావోమి అధికారిక వెబ్సైట్ ఎంఐ.కామ్‌లో ఈ సేల్‌ను నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, పవర్ బ్యాంకులు, కేసెస్, ఇతర యాక్ససరీస్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసింది. ఈ డిస్కౌంట్లతో పాటు రూ.1 ఫ్లాష్ సేల్‌ను నిర్వహిస్తుంది. అయితే రూ.1 ఫ్లాష్ సేల్ రెండు రోజుల్లో కూడా మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. అంతకంటే ముందు అదే రోజు ఉదయం 10 గంటలకు రూపాయి సేల్స్ కు సంబంధించి కూపన్స్ సేల్స్ ప్రారంభం అవుతుంది. ఇందులో రూపాయి పెట్టి.. కూపన్స్ కొనుగోలు చేయాలి. ఇది కూడా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఇలా కూపన్స్ దక్కించుకున్న వారు.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అయ్యే రూపాయి సేల్స్ లోకి ఎంట్రీ వస్తుంది. అక్కడ మీరు రూపాయి పెట్టి కొనుగోలు చేసిన కూపన్స్ ను యాడ్ చేస్తే చాలు.. స్మార్ట్ ఫోన్ మీ సొంతం అవుతుంది. ఆ సేల్‌లో పరిమిత స్టాక్స్‌నే అందుబాటులో ఉంచుతున్నారు. రూ.1కే షావోమి ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు వెంటనే ప్రొడక్ట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ రూపాయి సేల్స్ కింద.. రెడ్మి 5ఏ, రెడ్మి వై1, ఎంఐ వీఆర్ 2 ప్లే, ఎంఐ రూటర్స్, వైఫై రూటర్లు ఇతర ఉత్పత్తులు ఈ సేల్స్ లో అందుబాటులో ఉంటాయి. అంతేకాక మొబిక్విక్ మొబైల్ వాలెట్ యూజర్లకు రూ.4000 వరకు సూపర్‌క్యాష్ లభ్యమవుతుంది. హంగామా ప్లేకు మూడు నెలల సబ్స్క్రిప్షన్, 12 నెలల హంగామా మ్యూజిక్ వంటి డీల్స్ ఈ సేల్‌లో ఉన్నాయి. -
షావోమీ లవర్స్‌కు గుడ్ న్యూస్: స్పెషల్ సేల్
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి దేశ 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అమ్మకాలను ప్రారంభించింది. ముఖ్యంగా భారీ విక్రయాలతో టాప్ లో నిలిచిన షావోమి రెడ్ మి 4 విక్రయానికి అందుబాటులో ఉంచింది. అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన రెడ్మి 4 మరోసారి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఎంఐ.కామ్‌లో లభ్యం కానుంది. మంగళవారం ఉదయం 10నుంచి ప్రారంభకానున్న ఇండిపెండెన్స్ సేల్‌లో రెడ్ మి 4 ఏ,ఎంఐ మాక్స్ 2 లను విక్రయిస్తోంది. ఆతరువాత మధ్యాహ్నం 12గం. లకు స్పెషల్ సేల్ నిర్వహించనుంది. దీంతోపాటు ప్రత్యేక ఆఫర్లను, క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. దీని ధర రూ. 6,999 . రిలయన్స్ జియో కస్టమర్లకు అదనపు 4జీ డేటా, ఇతర ఆఫర్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన రెడ్ మి 4 పేటిఎం ద్వారా కొనుగోలుపై 10శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. జియో కస్టమర్లకు అదనపు 4జీ డేటా అందిస్తోంది. అలాగే హంగామా ప్లే , మ్యూజిక్ (12 నెలలు మరియు 3 నెలలు), సబ్స్క్రిప్షన్, మొబీ క్విక్ క్యాష్‌బ్యాక్, కిండ్లే యాప్ లో ఈ బుక్ క్రెడిట్ లభించనుంది. 2 జీబీ/16 జీబీ స్టోరేజ్ ధర రూ. 6,999, 3 జీబీ/32జీబీ స్టోరేజ్ ధర రూ. 8,999, 4జీబీ/32 జీబీ స్టోరేజ్ ధరరూ .10,999 మూడు వేరియంట్లలో లభిస్తుంది. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 720x1280 పిక్సెల్ రిజల్యూషన్ 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా , 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సర్ తదితర మెయిన్ ఫీచర్స్ రెడ్ మి 4 స్మార్ట్‌ఫోన్ సొంతం. Sale is live now! Get your favourite Mi products today including Redmi 4, Redmi 4A and Mi Max 2! A very Happy #IndependenceDayIndia pic.twitter.com/kOUuwNxFcI — Mi India (@XiaomiIndia) August 15, 2017