షావోమీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌: స్పెషల్‌ సేల్‌ | Xiaomi Redmi 4 sale on Amazon, Mi.com; check out price, features, added offers | Sakshi
Sakshi News home page

షావోమీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌: స్పెషల్‌ సేల్‌

Published Tue, Aug 15 2017 11:30 AM | Last Updated on Tue, Sep 12 2017 12:09 AM

Xiaomi Redmi 4 sale on Amazon, Mi.com; check out price, features, added offers



చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమి దేశ 71వ స్వాతం‍త్ర దినోత్సవం సందర్భంగా  ప్రత్యేక అమ్మకాలను ప్రారంభించింది. ముఖ్యంగా  భారీ విక్రయాలతో టాప్‌ లో నిలిచిన షావోమి  రెడ్‌ మి 4  విక్రయానికి అందుబాటులో ఉంచింది.  అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన రెడ్‌మి 4 మరోసారి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు అమెజాన్‌, ఎంఐ.కామ్‌లో  లభ్యం కానుంది.   మంగళవారం ఉదయం 10నుంచి ప్రారంభకానున్న ఇండిపెండెన్స్‌ సేల్‌లో  రెడ్‌ మి 4 ఏ,ఎంఐ  మాక్స్‌ 2 లను విక్రయిస్తోంది.   ఆతరువాత మధ్యాహ్నం 12గం. లకు స్పెషల్‌ సేల్‌ నిర్వహించనుంది.  దీంతోపాటు  ప్రత్యేక ఆఫర్లను,  క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తోంది. దీని ధర రూ. 6,999 .   రిలయన్స్ జియో కస్టమర్లకు అదనపు 4జీ డేటా,  ఇతర ఆఫర్లను అందిస్తోంది. 

బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన రెడ్‌ మి 4 పేటిఎం  ద్వారా కొనుగోలుపై 10శాతం క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. జియో కస్టమర్లకు అదనపు 4జీ డేటా అందిస్తోంది. అలాగే హంగామా ప్లే , మ్యూజిక్ (12 నెలలు మరియు 3 నెలలు), సబ్‌స్క్రిప‍్షన్‌,  మొబీ క్విక్‌ క్యాష్‌బ్యాక్‌,  కిండ్లే  యాప్‌  లో ఈ బుక్‌  క్రెడిట్‌  లభించనుంది. 2 జీబీ/16 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 6,999,  3 జీబీ/32జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,999, 4జీబీ/32 జీబీ స్టోరేజ్‌  ధరరూ .10,999 మూడు వేరియంట్లలో లభిస్తుంది.

5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 720x1280  పిక్సెల్‌ రిజల్యూషన్‌ 13 మెగా పిక్సెల్ రియర్‌ కెమెరా , 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌  తదితర మెయిన్‌ ఫీచర్స్‌   రెడ్‌ మి 4 స్మార్ట్‌ఫోన్‌ సొంతం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement