అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్, ఆఫర్‌లను అందిస్తోంది అమెజాన్. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా షావోమీ, ఒప్పో, శాంసంగ్ వంటి బ్రాండ్‌ల లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరకు ఇప్పుడే కొనుక్కోవచ్చు. ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లు కానివారు మాత్రం అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి ➤ మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై అందుబాటులోకి వచ్చిన బెస్ట్ డీల్స్‌లో కొన్నింటి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం..
ఐఫోన్ 14 (iPhone 14)
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 విక్రయానికి ముందు ప్రైమ్ ఎర్లీ డీల్స్‌లో భాగంగా ఐఫోన్ 14 రూ. 67,499లకే అందుబాటులోకి వచ్చింది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌తో కూడిన ఈ ఫోన్ కార్ క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌లతో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది భారత్‌లో రూ. 79,900 ధరతో లాంచ్ అయింది. దీంతోపాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లను వినియోగిస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎంపికచేసిన మోడల్స్‌కు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్‌లోకి అత్యంత ఖరీదైన టీవీ
షావోమీ 12 ప్రో 5జీ (Xiaomi 12 Pro 5G)
Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో వచ్చే షావోమీ 12 ప్రో 5జీ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా తగ్గింపు ధర రూ. 41,999లకే లభిస్తోంది. లాంచింగ్ సమయంలో దీని బేస్ మోడల్ ధర రూ.62,999 ఉండగా తర్వాత రూ.52,999లకు తగ్గింది. కొనుగోలుకు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ. 1,250 తగ్గింపు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ.36,000 డిస్కౌంట్ లభించే ఆస్కారం ఉంది.
ఐకూ 9 5జీ (iQoo 9 5G)
ప్రైమ్ మెంబర్‌షిప్ కలిగి ఉంటే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ సమయంలో ఐకూ 9 5జీ స్మార్ట్‌ఫోన్‌ని రూ.29,990లకే కొనుక్కోవచ్చు. భారతదేశంలో ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 42,990. ఈ హ్యాండ్‌సెట్ 5nm స్నాప్‌డ్రాగన్ 888+ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 120 వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీ ప్రస్తుత ఫోన్‌ని ఎక్సేంజ్‌కు ఇస్తే రూ. 26,650 వరకు తగ్గింపు లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ (Samsung Galaxy M33 5G)
6.6-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, Exynos 1280 చిప్‌సెట్, 5జీ కనెక్టివిటీతో వచ్చే ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ధర రూ.18,999. ఇది ఇప్పుడు ప్రైమ్ ఎర్లీ డీల్స్‌లో భాగంగా రూ.16,999లకే అందుబాటులో ఉంది. అదనంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ.1,000. పాత హ్యాండ్‌సెట్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.16,100 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.
రెడ్‌మీ 12సీ (Redmi 12C)
MediaTek Helio G85 ప్రాసెసర్, 6.72-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌తో వచ్చే ఎంట్రీ లెవల్ రెడ్‌మీ 12సీ హ్యాండ్‌సెట్‌ని ప్రైమ్ ఎర్లీ డీల్స్ సమయంలో రూ.7,699లకే కొనుగోలు చేయవచ్చు. అయితే దీని అసలు లాంచ్ ధర రూ. రూ.8,999. పాత హ్యాండ్‌సెట్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.7,300 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment