
హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం(2023–24) ప్రారంభం సందర్భంగా ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా.. ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’ పేరుతో గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, ఔత్సాహికుల భిన్న అవసరాలను తీర్చేందుకు హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ ఆఫర్లు పొందేందుకు సమీప క్రోమా స్టోర్టు లేదా ఆన్‌లైన్‌లో www.croma.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ల్యాప్‌టాప్‌లపై డీల్స్
నెలకు రూ. 1,412 కంటే తక్కువ ఈఎంఐతో 350కి పైగా ల్యాప్‌టాప్‌లు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్‌లు రూ. 32,990 నుంచే ప్రారంభమవుతాయి. రైజెన్ 3 ద్వారా ఆధారితమైన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను రూ. 37,990 నుంచే కొనుగోలు చేయవచ్చు. వీటిలో మైక్రోసాఫ్ట్ హోమ్, స్టూడెంట్స్ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. ఇక అన్ని యాపిల్ ఉత్పత్తులపైనా డీల్స్ ఉన్నాయి.
టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లపై..
క్రోమా సేల్‌లో రూ.11,999తో టాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ. 1,337 ఈఎంఐతో స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు. క్రోమా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై కేవలం రూ. 499లకే రూ.9,999 విలువైన కాలింగ్-ఎనేబుల్డ్ స్మార్ట్‌వాచ్‌ను పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment