Xiaomi Redmi 4
-
షావోమీ లవర్స్‌కు గుడ్ న్యూస్: స్పెషల్ సేల్
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి దేశ 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అమ్మకాలను ప్రారంభించింది. ముఖ్యంగా భారీ విక్రయాలతో టాప్ లో నిలిచిన షావోమి రెడ్ మి 4 విక్రయానికి అందుబాటులో ఉంచింది. అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన రెడ్మి 4 మరోసారి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఎంఐ.కామ్‌లో లభ్యం కానుంది. మంగళవారం ఉదయం 10నుంచి ప్రారంభకానున్న ఇండిపెండెన్స్ సేల్‌లో రెడ్ మి 4 ఏ,ఎంఐ మాక్స్ 2 లను విక్రయిస్తోంది. ఆతరువాత మధ్యాహ్నం 12గం. లకు స్పెషల్ సేల్ నిర్వహించనుంది. దీంతోపాటు ప్రత్యేక ఆఫర్లను, క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. దీని ధర రూ. 6,999 . రిలయన్స్ జియో కస్టమర్లకు అదనపు 4జీ డేటా, ఇతర ఆఫర్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన రెడ్ మి 4 పేటిఎం ద్వారా కొనుగోలుపై 10శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. జియో కస్టమర్లకు అదనపు 4జీ డేటా అందిస్తోంది. అలాగే హంగామా ప్లే , మ్యూజిక్ (12 నెలలు మరియు 3 నెలలు), సబ్స్క్రిప్షన్, మొబీ క్విక్ క్యాష్‌బ్యాక్, కిండ్లే యాప్ లో ఈ బుక్ క్రెడిట్ లభించనుంది. 2 జీబీ/16 జీబీ స్టోరేజ్ ధర రూ. 6,999, 3 జీబీ/32జీబీ స్టోరేజ్ ధర రూ. 8,999, 4జీబీ/32 జీబీ స్టోరేజ్ ధరరూ .10,999 మూడు వేరియంట్లలో లభిస్తుంది. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 720x1280 పిక్సెల్ రిజల్యూషన్ 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా , 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సర్ తదితర మెయిన్ ఫీచర్స్ రెడ్ మి 4 స్మార్ట్‌ఫోన్ సొంతం. Sale is live now! Get your favourite Mi products today including Redmi 4, Redmi 4A and Mi Max 2! A very Happy #IndependenceDayIndia pic.twitter.com/kOUuwNxFcI — Mi India (@XiaomiIndia) August 15, 2017 -
హిస్టరీ రిపీట్: 2.5 లక్షలకుపైగా ఫోన్లు అమ్మకం
షియోమి ఫోన్ల విషయంలో మరోసారి హిస్టరీ రిపీట్ అయింది. ఇటీవల లాంచ్ అయిన రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ కు భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే ఈ స్మార్ట్ ఫోన్ హాట్ కేకులా అమ్ముడుపోయింది. ఎనిమిది నిమిషాల్లో రెండున్నర లక్షలకు పైగా ఫోన్లు అమ్ముడుపోయినట్టు షియోమి ప్రకటించింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ లలో విక్రయానికి వచ్చింది. యూజర్ల నుంచి రెడ్ మి 4 కోసం 2.3 మిలియన్లకు పైగా 'నోటిఫై మి' అనే అలర్ట్ లు వచ్చినట్టు అమెజాన్ ఇండియా కూడా వెల్లడించింది. నిమిషానికి 10 మిలియన్లకు పైగా హిట్స్ కూడా వచ్చినట్టు అమెజాన్ తెలిపింది. కస్టమర్ల ఈ అనూహ్య స్పందనకు తాము ఆశ్చర్యానికి గురయ్యామని పేర్కొంది. అమెజాన్.ఇన్ లో టాప్ సెల్లింగ్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్లు ఉంటాయని, నేటి సేల్ తో కస్టమర్లకు మరిన్ని బెస్ట్ ప్రొడక్ట్ లు అందించడానికి, ఎంపికచేసుకోవడానికి తమ ఫోకస్ ను మరింత విస్తరించాలని తెలిసిందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ కేటగిరీ మేనేజ్ మెంట్ నూర్ పటేల్ తెలిపారు. అయితే నేడు వచ్చిన ఈ అనూహ్య స్పందనతో అమెజాన్ ఇండియా వెబ్ సైట్ కొద్దిసేపటి వరకు క్రాష్ కూడా అయింది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ గతవారం లాంచైంది. ప్రస్తుతం 2జీబీ/16జీబీ స్టోరేజ్, 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్లు అమ్మకానికి వచ్చాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర 6999 రూపాయలు. బడ్జెట్ సెగ్మెంట్లో ప్రీమియం ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంతో రెడ్ మి 4ను తీసుకొచ్చామని, తమ ఎంఐ ఫ్యాన్స్ నుంచి వచ్చిన ప్రేమ చాలా అద్భుతంగా ఉందని షియోమి ఇండియా ఆన్ లైన్ సేల్స్ హెడ్ రఘు రెడ్డి తెలిపారు. మూడు స్టోరేజ్ వేరియంట్లతో పాటు 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 13ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో మిగతా ఫీచర్లు. Howzat!! It's a hat-trick! Redmi Note 4 followed by Redmi 4A and now Redmi 4. Can't thank all you #MiFans enough for so much love! <3 pic.twitter.com/b8N3iFT4zy — Redmi India (@RedmiIndia) May 23, 2017 -
బంపర్ ఆఫర్లతో విక్రయానికి వస్తున్న రెడ్మి 4
షియోమి స్మార్ట్ ఫోన్లంటేనే మార్కెట్లో తెగ క్రేజ్. ఆన్ లైన్ అమ్మకానికి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోన్లకు భలే గిరాకి వస్తుంది. గతవారం షియోమి లాంచ్ చేసిన రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ రేపే(మంగళవారం) అమ్మకానికి వస్తోంది. అమెజాన్ ఇండియా, మి.కామ్ లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ను విక్రయానికి ఉంచుతోంది కంపెనీ. విక్రయానికి వస్తున్న ఈ ఫోన్ తో పాటు బంపర్ ఆఫర్లను కూడా షియోమి తీసుకొస్తోంది. అమెజాన్ ఇండియాలో రెడ్ మి4 కొనుగోలు చేస్తే, వొడాఫోన్ నెట్ వర్క్ పై 45జీబీ ఉచిత డేటాను ఐదు నెలల పాటు అందించనుంది. అయితే వొడాఫోన్ 1జీబీ లేదా 4జీ డేటా ప్యాక్ ను రెడ్ మి 4 కస్టమర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ 45జీబీ ఉచిత డేటా కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. అదేవిధంగా యస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు కస్టమర్లకు 500 రూపాయల క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేయనుంది. అమెజాన్ ఇండియాలో రెడ్ మి 4 పై ఉన్న మరిన్ని ఆఫర్లివివే... ఎంఐ కేసెస్ లేదా కవర్ల రేటు రూ.499 రూపాయల నుంచి రూ.349 రూపాయలకు దిగిరానుంది. ఎంఐ హెడ్ ఫోన్లు కూడా 599 రూపాయల నుంచే దొరకనున్నాయి. గోల్ బిబో విమానం, హోటల్ బుకింగ్స్ లో 5000 రూపాయల వరకు తగ్గింపు కిండ్ల్ యాప్ పై 200 రూపాయల క్రెడిట్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో రెడ్ మి4 లాంచ్ అయింది. 2జీబీ ర్యామ్/ 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 రూపాయలు, 3జీబీ వేరియంట్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 రూపాయలు, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలు. అయితే 4జీబీ వేరియంట్ మంగళవారం విక్రయానికి రావడం లేదు. జూన్ చివరి నుంచే ఈ వేరియంట్ విక్రయానికి వస్తోంది. -
మార్కెట్లో రెడ్ మి 4, 4 ప్రైమ్, 4ఎ
బీజింగ్: అంచనావేసినట్టుగా గానే చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. పాపులర్ మోడల్ రెడ్మి 3 స్మార్ట్ఫోన్ల సిరీస్ లో మరో మూడు స్మార్ట్ ఫోన్లను శుక్రవారం బీజింగ్‌లో విడుదల చేసింది. రెడ్మి4, రెడ్మి 4ఏ రెడ్ మి4 ప్రైమ్ పేరుతో మూడు వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మధ్యశ్రేణి మార్కెట్ లక్ష్యంగా ఈ ఉత్పత్తులను తీసుకొచ్చినట్టు కంపెనీ ప్రకటించింది. నవంబరు 11 నుంచి మార్కెట్ లోవిక్రయానికి సిద్ధంగాఉండనున్నట్టు ప్రకటించింది. రెడ్ మీ 4 ధరను సుమారు రూ.6900 (699 యెన్) రూ. రెడ్ మి 4 ఎ ధర సుమారు రూ.4900 (499 యెన్)లు గా ఉండనున్నాయి. మెటల్ యూనీబాడీ, 2.5డీ కర్వ్డ్ డిస్ప్లేలు, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్, వెనుక ప్యానెల్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి కామన్ గానే ఉన్నా, ర్యాం, మెమరీ, ప్రాసెసర్, స్టోరేజ్ అంశాల్లో స్వల్ప తేడాలతో, గోల్డ్, గ్రే అండ్ సిల్వర్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉండనున్నాయి. రెడ్ మి 4 ప్రైమ్ 5 అంగుళాల డిస్ప్లే 1080x1920 రిజల్యూషన్, 3జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ 13 ఎంపీ వెనుక కెమేరా 5 ఎంపీ ఫ్రంట్ కెమేరా 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ 2.0 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి 4 5 అంగుళాల డిస్ప్లే, 720x1280 రిజల్యూషన్ 3జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ 13 ఎంపీ వెనుక కెమేరా 5 ఎంపీ ఫ్రంట్ కెమేరా 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్ రెడ్మి 4ఏ 5 అంగుళాల డిస్ప్లే, 720x1280 రిజల్యూషన్ 2జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ 13 మెగా పిక్సెల్ వెనుక కెమేరా 5 మెగా పిక్సెల్ ముందు కెమేరా 3120 ఏంఎహెచ్ బ్యాటరీ కాగా గత ఏడాది కంపెనీ లాంచ్ చేసిన రెడ్ మి 3 బహుళ ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే.