మార్కెట్లో రెడ్ మి 4, 4 ప్రైమ్, 4ఎ | Xiaomi Redmi 4, Redmi 4A launched: Price, specifications and features | Sakshi
Sakshi News home page

మార్కెట్లో రెడ్ మి 4, 4 ప్రైమ్, 4ఎ

Published Sat, Nov 5 2016 1:43 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

మార్కెట్లో రెడ్ మి 4, 4 ప్రైమ్, 4ఎ

మార్కెట్లో రెడ్ మి 4, 4 ప్రైమ్, 4ఎ

బీజింగ్:  అంచనావేసినట్టుగా గానే  చైనా  స్మార్ట్‌ఫోన్  మేకర్  షియోమి  స్మార్ట్‌ఫోన్లను లాంచ్  చేసింది.  పాపులర్ మోడల్  రెడ్‌మి 3 స్మార్ట్‌ఫోన్ల సిరీస్ లో  మరో మూడు  స్మార్ట్ ఫోన్లను  శుక్రవారం బీజింగ్లో  విడుదల చేసింది.  రెడ్‌మి4, రెడ్‌మి 4ఏ రెడ్ మి4  ప్రైమ్ పేరుతో మూడు వేరియంట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మధ్యశ్రేణి మార్కెట్‌ లక్ష్యంగా ఈ ఉత్పత్తులను తీసుకొచ్చినట్టు కంపెనీ ప్రకటించింది. నవంబరు 11 నుంచి  మార్కెట్ లోవిక్రయానికి సిద్ధంగాఉండనున్నట్టు ప్రకటించింది.  రెడ్ మీ 4 ధరను సుమారు రూ.6900 (699  యెన్) రూ. రెడ్ మి 4 ఎ ధర సుమారు రూ.4900 (499  యెన్)లు గా ఉండనున్నాయి.   మెటల్ యూనీబాడీ, 2.5డీ కర్వ్డ్  డిస్ప్లేలు, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్, వెనుక ప్యానెల్ , ఫింగర్ ప్రింట్  సెన్సార్ లాంటి కామన్ గానే ఉన్నా,  ర్యాం, మెమరీ, ప్రాసెసర్,  స్టోరేజ్ అంశాల్లో  స్వల్ప తేడాలతో,  గోల్డ్, గ్రే  అండ్ సిల్వర్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉండనున్నాయి.
రెడ్ మి 4 ప్రైమ్
5 అంగుళాల  డిస్ప్లే 1080x1920 రిజల్యూషన్,
3జీబీ ర్యామ్‌
 32 జీబీ ఇంటర్నల్  మెమొరీ
13 ఎంపీ వెనుక కెమేరా
5 ఎంపీ  ఫ్రంట్  కెమేరా
128 జీబీ  ఎక్స్ పాండబుల్ మెమొరీ  
 2.0 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌
4,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ
రెడ్‌మి 4
5 అంగుళాల  డిస్ప్లే, 720x1280 రిజల్యూషన్
 3జీబీ ర్యామ్‌
 32 జీబీ ఇంటర్నల్  మెమొరీ
13 ఎంపీ వెనుక కెమేరా
5 ఎంపీ  ఫ్రంట్  కెమేరా
1.4 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌
4,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
రెడ్‌మి 4ఏ
 5 అంగుళాల డిస్ప్లే, 720x1280  రిజల్యూషన్
 2జీబీ ర్యామ్‌
16 జీబీ  ఇంటర్నల్  మెమొరీ
13 మెగా పిక్సెల్‌ వెనుక కెమేరా
 5 మెగా పిక్సెల్‌ ముందు కెమేరా
3120 ఏంఎహెచ్‌ బ్యాటరీ
కాగా గత ఏడాది కంపెనీ లాంచ్ చేసిన  రెడ్ మి 3 బహుళ ప్రజాదరణ పొందిన సంగతి  తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement