![Mahindra XUV700 new 7 seater variant check price features](/styles/webp/s3/article_images/2024/05/23/Mahindra-XUV700.jpg.webp?itok=waG3udGI)
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా XUV700లో కొత్త AX5 సెలెక్ట్ (AX5 S) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కైరూఫ్, డ్యూయల్ 26.03cm హెచ్‌డీ సూపర్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రూమి 7-సీటర్ కాన్ఫిగరేషన్ వంటి ఆకట్టుకునే ఫీచర్ల లైనప్‌ను AX5 సెలెక్ట్ వేరియంట్ అందిస్తుంది.
సాధారణంగా హై-ఎండ్ మోడల్‌లతో ఇలాంటి ఫీచర్‌లు ఉంటాయి. ఈ ఫీచర్లు బడ్జెట్ ధరలో హై-ఎండ్ ఫీచర్‌ల కోసం చూస్తున్న కస్టమర్‌లకు AX5 మంచి ఎంపికగా నిలుపుతున్నాయి. 2022లో విడుదలైన మహీంద్రా XUV700 దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నేపాల్, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లలో మంచి ఆదరణ పొంది గ్లోబల్ ఎస్‌యూవీగా మారింది.
మహీంద్రా ఇటీవలే MX వేరియంట్‌లో 7-సీటర్‌ను విడుదల చేసింది. బ్లేజ్ రెడ్ కలర్, డ్యూయల్-టోన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్, రెడ్ యాక్సెంట్‌లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌తో లిమిటెడ్ బ్లేజ్ ఎడిషన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. వేరియంట్‌ను బట్టి నాలుగు నుంచి ఎనిమిది వారాలలోపు కస్టమర్లకు డెలివరీ ఇచ్చేలా చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment