ఓపెన్‌ సేల్‌లో రెడ్‌మి 5 | Xiaomi Redmi 5 Open Sale Now Permanent On Amazon India, Mi.com | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ సేల్‌లో రెడ్‌మి 5

Published Sat, Apr 7 2018 11:51 AM | Last Updated on Sat, Apr 7 2018 11:51 AM

Xiaomi Redmi 5 Open Sale Now Permanent On Amazon India, Mi.com - Sakshi

రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌

షావోమి అత్యంత పలుచనైన అద్భుత స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 5 ఓపెన్‌ సేల్‌కు వచ్చింది. అమెజాన్‌.ఇన్‌, అమెజాన్‌ ఇండియా యాప్‌, ఎంఐ.కామ్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇక శాశ్వతంగా ఓపెన్‌ సేల్‌లో అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇక నుంచి ఫ్లాష్‌సేల్‌ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఎల్లప్పుడూ ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

2జీబీ/ 16జీబీ, 3జీబీ/ 32జీబీ, 4జీబీ/ 64జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఓపెన్‌ సేల్‌లో ఉంటుంది. గోల్డ్‌, బ్లాక్‌, రోజ్‌ గోల్డ్‌, బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే వారికి అమెజాన్‌ కిండ్లీ ఈబుక్స్‌పై 90 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు 5 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌, రిలయన్స్‌ జియో నుంచి డేటా, రూ.2200 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. 

రెడ్‌మి 5 స్పెషిఫికేషన్లు
5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
ఫుల్‌స్క్రీన్‌ డిస్‌ప్లే
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ
12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ సెల్ఫీ లైట్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement