Redmi 5
-
పేలిన రెడ్మీ 5ఏ స్మార్ట్‌ఫోన్
శాలిగౌరారం(తుంగతుర్తి) : శాలిగౌరారంలో శనివారం స్మార్ట్‌ఫోన్ పేలింది. యువకుడు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణపాయం తప్పింది. వివరాలు.. శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధిలోని మార్కెట్‌కాలనీకి చెందిన రావుల సురేశ్ అనే యువకుడు నాలుగు నెలల క్రితం నల్లగొండలోని ఓ ప్రముఖ మొబైల్ దుకాణంలో ఎంఐ(రెడ్మీ)–5ఏ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి వినియోగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యాహ్నం సెల్‌ఫోన్ అకస్మాత్తుగా స్విచ్ఆఫ్ కావడంతో పాటు ఆ సెల్‌ఫోన్ నుం చి చిన్నపాటి శబ్దం వస్తుండడంతో ఆ సెల్‌ఫోన్‌ను చూపించేందుకని వెంటనే మండలకేంద్రంలోని ఓ సెల్‌ఫోన్ రిపేర్షాపువద్దకు వెళ్లాడు. తనషర్ట్ జేబులో నుంచి ఆ సెల్‌ఫోన్‌ను తీసి షాపులోని టేబుల్‌పై పెడుతుండగానే ఒక్కసారిగా సెల్‌ఫోన్ నుంచి మంటలు వచ్చాయి. గమనించిన సురేశ్‌తో పాటు షాపు నిర్వాహకుడు వెంటనే బయటకు పరుగెత్తుతుండగానే పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో చుట్టుపక్కల షాపుల నిర్వాహకులు ఏమి జరిగిందోనని భయాందోళనకు గురయ్యారు. సురేశ్ ఏ మాత్రం ఆలస్యం చేసినా అతని జేబులోనే ఆ సెల్‌ఫోన్ పేలి ఉండేది. ఒకవేళ అదే జరిగితే సురేశ్ ప్రాణానికే ముప్పు వాటిల్లేది. దీంతో సురేశ్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మండలకేంద్రంలో జరిగిన ఈ సంఘటన గంటల వ్యవధిలోనే ప్రజలకు తెలియడంతో ప్రతి ఒక్కరూ సెల్ఫోన్ల వాడకంపై కొంత ఆందోళనకు గురయ్యారు. -
ఓపెన్ సేల్‌లో రెడ్మి 5
షావోమి అత్యంత పలుచనైన అద్భుత స్మార్ట్‌ఫోన్ రెడ్మి 5 ఓపెన్ సేల్కు వచ్చింది. అమెజాన్.ఇన్, అమెజాన్ ఇండియా యాప్, ఎంఐ.కామ్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ ఇక శాశ్వతంగా ఓపెన్ సేల్‌లో అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇక నుంచి ఫ్లాష్‌సేల్ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఎల్లప్పుడూ ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 2జీబీ/ 16జీబీ, 3జీబీ/ 32జీబీ, 4జీబీ/ 64జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ ఓపెన్ సేల్‌లో ఉంటుంది. గోల్డ్, బ్లాక్, రోజ్ గోల్డ్, బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి అమెజాన్ కిండ్లీ ఈబుక్స్‌పై 90 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు 5 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్, రిలయన్స్ జియో నుంచి డేటా, రూ.2200 క్యాష్‌బ్యాక్ లభించనుంది. రెడ్మి 5 స్పెషిఫికేషన్లు 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఫుల్‌స్క్రీన్ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్ఓసీ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ సెల్ఫీ లైట్ -
రెడ్మి 5 సేల్: ఈరోజే త్వరపడండి
న్యూఢిల్లీ: చైనా కంపెనీ షావోమి నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. రెడ్మి 5 పేరుతో తయారుచేసిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారత్‌లో ఈరోజు నుంచి ప్రారంభించనున్నట్టు షావోమి ప్రకటించింది. ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఎమ్ఐ.కాట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. 4 లక్షలకుపైగా ఫోన్లను విక్రయించనున్నట్టు వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో చైనా మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ ఫోన్, నేడు ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ఇండియా ద్వారా అమ్మకాలు జరపనుంది. 7.7 మిల్లీమీటర్ల మందంతో రెడ్మి సిరీస్‌లో అత్యంత పలుచనైన స్మార్ట్‌ఫోన్‌గా చెప్పబడుతున్న రెడ్మి 5 మూడు వేరియంట్లలో లభించనుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999 కాగా.. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999గా షావోమి ప్రకటించింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలుగా నిర్ణయించింది. బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్లు లభించనున్నాయి. జియో ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ రెడ్మి 5 స్మార్ట్‌ఫోన్‌తో 100జీబీ అదనపు డేటాతో రిలయన్స్ జియో నుంచి రూ. 2,200 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ 5 శాతం డిస్కౌంట్ ప్రకటించాయి. తొలిసారి కిండ్లీ ఈ-బుక్స్ కొనేవారికి 90 శాతం తగ్గింపు లభించనుంది. రెడ్మి 5 ఫీచర్లు 5.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ఎస్ఓసీ 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లు 16జీబీ, 32జీబీ, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లు మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణకు అవకాశం 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ సెల్ఫీ లైట్ ఫేస్ రికగ్నైజేషన్, స్మార్ట్ బ్యూటీ 3.0 యాప్ -
రెడ్మి 5కి కౌంటర్ : మైక్రోమ్యాక్స్ బడ్జెట్ ఫోన్
షావోమి కొత్తగా భారత్‌లోకి లాంచ్ చేసిన రెడ్మి 5 స్మార్ట్‌ఫోన్‌కు, మైక్రోమ్యాక్స్ కౌంటర్ ఇచ్చింది. తన భారత్ లైనప్‌లో మరో బడ్జెట్ ఫోన్‌ను, రెడ్మి 5 లాంచింగ్ రోజే ప్రవేశపెట్టింది. భారత్ 5 ప్రొ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆశ్చర్యకరంగా రెడ్మి 5 స్మార్ట్‌ఫోన్, భారత్ 5 ప్రొ ధరలు రెండు కూడా సమానంగా 7,999 రూపాయలుగా ఉన్నాయి. అయితే మైక్రోమ్యాక్స్ భారత్ 5 ప్రొ కేవలం ఒక్క వేరియంట్లోనే లాంచ్ అయితే.. రెడ్మి 5 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. మైక్రోమ్యాక్స్ భారత్ 5 ప్రొ ఫీచర్లు.. 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణ మెమరీకి అవకాశం భారీగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్‌లాక్ ఫీచర్