రెడ్‌మి 5 సేల్‌: ఈరోజే త్వరపడండి | Xiaomi Redmi 5 To Go On Sale Today | Sakshi
Sakshi News home page

రెడ్‌మి 5 సేల్‌: ఈరోజే త్వరపడండి

Published Tue, Mar 20 2018 9:43 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

Xiaomi Redmi 5 To Go On Sale Today - Sakshi

రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్లు

న్యూఢిల్లీ: చైనా కంపెనీ షావోమి నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వస్తోంది. రెడ్‌మి 5 పేరుతో తయారుచేసిన స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను భారత్‌లో ఈరోజు నుంచి ప్రారంభించనున్నట్టు షావోమి ప్రకటించింది. ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌, ఎమ్‌ఐ.కాట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. 4 లక్షలకుపైగా ఫోన్లను విక్రయించనున్నట్టు వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ ఫోన్‌, నేడు ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌ ఇండియా ద్వారా అమ్మకాలు జరపనుంది.

7.7 మిల్లీమీటర్ల మందంతో రెడ్‌మి సిరీస్‌లో అత్యంత పలుచనైన స్మార్ట్‌ఫోన్‌గా చెప్పబడుతున్న రెడ్‌మి 5 మూడు వేరియంట్లలో లభించనుంది. 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,999 కాగా.. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 8,999గా షావోమి ప్రకటించింది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 10,999 రూపాయలుగా నిర్ణయించింది. బ్లాక్‌‌, గోల్డ్‌‌, లేక్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో ఈ ఫోన్లు లభించనున్నాయి.

జియో ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌
రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌తో 100జీబీ అదనపు డేటాతో రిలయన్స్‌ జియో నుంచి రూ. 2,200 ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు అమెజాన్‌ ఇండియా, ఎంఐ.కామ్‌ 5 శాతం డిస్కౌంట్‌  ప్రకటించాయి. తొలిసారి కిండ్లీ ఈ-బుక్స్‌ కొనేవారికి 90 శాతం తగ్గింపు లభించనుంది.

రెడ్‌మి 5 ఫీచర్లు
5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ
2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్‌ వేరియంట్లు
16జీబీ, 32జీబీ, 64జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు
మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణకు అవకాశం
12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ సెల్ఫీ లైట్‌
ఫేస్‌ రికగ్నైజేషన్‌, స్మార్ట్‌ బ్యూటీ 3.0 యాప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement