రెడ్‌మి 5కి కౌంటర్‌ : మైక్రోమ్యాక్స్‌ బడ్జెట్‌ ఫోన్‌ | Micromax Bharat 5 Pro Launched In India To Take On Redmi 5 | Sakshi
Sakshi News home page

రెడ్‌మి 5కి కౌంటర్‌ : మైక్రోమ్యాక్స్‌ బడ్జెట్‌ ఫోన్‌

Published Thu, Mar 15 2018 9:19 AM | Last Updated on Thu, Mar 15 2018 9:19 AM

Micromax Bharat 5 Pro Launched In India To Take On Redmi 5 - Sakshi

మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 5 ప్రొ

షావోమి కొత్తగా భారత్‌లోకి లాంచ్‌ చేసిన రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌కు, మైక్రోమ్యాక్స్‌ కౌంటర్‌ ఇచ్చింది. తన భారత్‌ లైనప్‌లో మరో బడ్జెట్‌ ఫోన్‌ను, రెడ్‌మి 5 లాంచింగ్‌ రోజే ప్రవేశపెట్టింది. భారత్‌ 5 ప్రొ పేరుతో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆశ్చర్యకరంగా రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌, భారత్‌ 5 ప్రొ ధరలు రెండు కూడా సమానంగా 7,999 రూపాయలుగా ఉన్నాయి. అయితే మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 5 ప్రొ కేవలం ఒక్క వేరియంట్‌లోనే లాంచ్‌ అయితే.. రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. 
 

మైక్రోమ్యాక్స్‌  భారత్‌ 5 ప్రొ ఫీచర్లు..
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణ మెమరీకి అవకాశం
భారీగా 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement