ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్.. వినడానికి విడ్డూరంగా ఉందా..! కానీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న షావోమి, రూపాయికే స్మార్ట్‌ఫోన్ అందిస్తుంది. ఒక్క స్మార్ట్‌ఫోన్లను మాత్రమే కాక, వీఆర్ హెడ్‌సెట్స్, రూటర్స్, ఫిట్‌నెస్ బ్రాండ్లను కూడా రూపాయికే ఆఫర్ చేస్తుంది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్‌లో షావోమి ఈ ఆఫర్‌ను ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 21 వరకు షావోమి అధికారిక వెబ్‌సైట్ ఎంఐ.కామ్‌లో ఈ సేల్‌ను నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, కేసెస్, ఇతర యాక్ససరీస్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసింది. ఈ డిస్కౌంట్‌లతో పాటు రూ.1 ఫ్లాష్ సేల్‌ను నిర్వహిస్తుంది. అయితే రూ.1 ఫ్లాష్ సేల్ రెండు రోజుల్లో కూడా మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది.
అంతకంటే ముందు అదే రోజు ఉదయం 10 గంటలకు రూపాయి సేల్స్ కు సంబంధించి కూపన్స్ సేల్స్ ప్రారంభం అవుతుంది. ఇందులో రూపాయి పెట్టి.. కూపన్స్ కొనుగోలు చేయాలి. ఇది కూడా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఇలా కూపన్స్ దక్కించుకున్న వారు.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అయ్యే రూపాయి సేల్స్ లోకి ఎంట్రీ వస్తుంది. అక్కడ మీరు రూపాయి పెట్టి కొనుగోలు చేసిన కూపన్స్ ను యాడ్ చేస్తే చాలు.. స్మార్ట్ ఫోన్ మీ సొంతం అవుతుంది. ఆ సేల్‌లో పరిమిత స్టాక్స్‌నే అందుబాటులో ఉంచుతున్నారు. రూ.1కే షావోమి ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు వెంటనే ప్రొడక్ట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ రూపాయి సేల్స్ కింద.. రెడ్‌మి 5ఏ, రెడ్‌మి వై1, ఎంఐ వీఆర్ 2 ప్లే, ఎంఐ రూటర్స్, వైఫై రూటర్లు ఇతర ఉత్పత్తులు ఈ సేల్స్ లో అందుబాటులో ఉంటాయి. అంతేకాక మొబిక్విక్ మొబైల్ వాలెట్ యూజర్లకు రూ.4000 వరకు సూపర్‌క్యాష్ లభ్యమవుతుంది. హంగామా ప్లేకు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, 12 నెలల హంగామా మ్యూజిక్ వంటి డీల్స్ ఈ సేల్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment