రెడ్‌మి నోట్ 5 ప్రొ (ఫైల్ ఫోటో)
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ షావోమికి చెందిన కొత్త స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మి నోట్5, రెడ్‌మి నోట్ 5 ప్రొలకు భలే గిరాకీ వచ్చింది. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో తొలి ఫ్లాష్ సేల్‌కు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు అవుటాఫ్ స్టాక్ అయ్యాయి. 3 నిమిషాల్లోనే 3 లక్షల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లు, అంటే నిమిషానికి లక్ష ఫోన్లు అమ్ముడుపోయినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ తెలిపారు. ఇండియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సేల్‌గా అభివర్ణించారు. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అయిన రెడ్‌మి నోట్ 5, రెడ్‌మి నోట్ 5 ప్రొ తర్వాతి సేల్ ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉండబోతున్నట్టు పేర్కొన్నారు. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అవడంపై, కస్టమర్లు తీవ్ర నిరాశ వ్యక్తంచేస్తున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లతో పాటు షావోమి ఎంఐ టీవీ 4ను కూడా కంపెనీ నేడు విక్రయానికి తీసుకొచ్చింది.
షావోమి రెడ్‌మి నోట్ 5 ఫీచర్లు
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
3/4 జీబీ ర్యామ్
32/64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12 ఎంపీ బ్యాక్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
షావోమి రెడ్‌మి నోట్ 5 ప్రొ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్,
4/6 జీబీ ర్యామ్,
64 జీబీ స్టోరేజ్,
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
20 ఎంపీ సెల్ఫీ కెమెరా,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
#RedmiNote5 & #RedmiNote5Pro: we sold 3L+ units in <3 mins. This means 1L+ phones/min! 😎
— Manu Kumar Jain (@manukumarjain) February 22, 2018
After the amazing success of Redmi Note 4, we had put in a lot of effort to increase supply of Redmi Note 5. This was the biggest ever sale in India!
Gear up for the next sale on 28th Feb! pic.twitter.com/qbOWYxClFZ
Comments
Please login to add a commentAdd a comment