flash sale
-
డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:‘ఈ-కామర్స్ వేదికల్లో ఫ్లాష్ సేల్స్ గురించి ప్రభుత్వం ఆందోళన చెందడం లేదు. వినియోగదారుల ఎంపికలను పరిమితం చేయడానికి ఈ-రిటైలర్లు ఉపయోగించే దోపిడీ ధర, ఇతర మోసపూరిత పద్ధతులకు తాము వ్యతిరేకం’ అని వాణిజ్య, పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం స్పష్టం చేశారు. ‘ఫ్లాష్ సేల్స్ ప్రయోజనాలను పొందేందుకు తరచుగా ఈ-మార్కెట్ ప్లేస్ వేదికల్లోవస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆన్లైన్ రిటైలర్ ఇష్టపడే లేదా ప్రమోట్ చేసిన సంస్థల ఉత్పత్తుల వైపునకు మళ్లించబడుతున్నారు. ఇది మోసం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు విరుద్ధం’ అని అన్నారు. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) డిస్కౌంట్లతో మంచి డీల్.. ‘ఎవరైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే నేనెందుకు ఫిర్యాదు చేయాలి. వినియోగదారులకు మంచి డీల్ లభిస్తోంది. ఈ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వస్తువులను డంపింగ్ చేయడం ద్వారా దోపిడీ ధరలను అనుసరించడం, వినియోగదారుల ఎంపికలను పరిమితం చేసే పద్ధతుల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ-కామర్స్ విధానం ద్వారా అటువంటి మోసాలను ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. ఫ్లాష్ సేల్స్ విషయంలో ఈరోజు వినియోగదారుడు ఉత్సాహంగా ఉండవచ్చు. కానీ ఒక విధానకర్తగా నేను భారతీయ కస్టమర్లకు దీర్ఘకాలిక మంచిని చూడవలసి ఉంటుంది. దోపిడీ ధరలను లేదా ప్రజల ఎంపికలను మోసం చేసే విధంగా ఇటువంటి పద్ధతులను మేము వ్యతిరేకిస్తున్నాము’ అని మంత్రి తెలిపారు. (షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!) చిన్నవారిని రక్షించుకుంటాం.. ‘విదేశీ ఈ-కామర్స్ సంస్థల వద్ద ఇబ్బడిముబ్బడిగా నిధులున్నాయి. వారికి భారతదేశంలో కొన్ని బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం, భారీ నష్టాలను నమోదు చేయడం సమస్య కాదు. ధర, వ్యయాలకు సంబంధం లేకుండా కస్టమర్లను సముపార్జించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టాలను ఈ–కామర్స్ సంస్థలు గౌరవించాల్సిందే. మార్కెట్ ప్లేస్ మార్కెట్ ప్లేస్‌గా మాదిరిగానే పనిచేయాలి. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థల కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కుటుంబ వ్యాపారాలు మూతపడ్డాయి. చిన్న రిటైల్ వ్యాపారులను కాపాడేందుకు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం చివరివరకు వారికి అండగా ఉంటుంది. చిన్న వ్యాపారులను రక్షించే ఈ ప్రయత్నానికి భారత్ లేదా విదేశీయులైనా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. -
వినియోగదారులకు ప్రతికూలంగా ఈ-కామర్స్ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వినియోగదారుల హక్కుల పరిరక్షణ (ఈ–కామర్స్) నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. వీటిలో చాలా ప్రతిపాదనలు అస్పష్టంగా ఉన్నందున అనుకోని విధంగా వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫ్లాష్ సేల్ కాన్సెప్టు మొదలైన వాటికి తగిన నిర్వచనం ఇవ్వాలని, వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు సంబంధించి ప్రస్తుత చట్టాలకు లోబడి ఈ–కామర్స్ సంస్థలు పనిచేసేలా చూడాలని కోరింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తాము పూర్తి మద్దతునిస్తామని, అయితే ఈ–కామర్స్ వ్యాపారంపరంగా ప్రతిపాదిత సవరణల్లో పలు అంశాలు అస్పష్టంగా ఉండటం ఆందోళనకరమని ఐఏఎంఏఐ తెలిపింది. కొన్ని సవరణల వల్ల ఆన్లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారాలకు సమాన అవకాశాలు దక్కకుండా పోతాయని పేర్కొంది. అలాగే ఈ–కామర్స్ కంపెనీలపై ఆంక్షలు మరింతగా పెరుగుతాయని, మరిన్ని నిబంధనలను పాటించాల్సిన భారం గణనీయంగా పెరుగుతుందని ఐఏఎంఏఐ అభిప్రాయపడింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు తన అభిప్రాయాలను తెలియజేసింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలపై మోసపూరిత ఫ్లాష్ సేల్స్‌ను, తప్పుగా ఉత్పత్తులు, సేవలను అంటగట్టే విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా జూన్ 21న కేంద్రం ఈ–కామర్స్ నిబంధనల ముసాయిదాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగస్టు 5 దాకా పరిశ్రమవర్గాలు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఇప్పటికే ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర పరిశ్రమ వర్గాలు తమ ఆందోళనలను ప్రభుత్వానికి తెలియజేశాయి. చదవండి : వ్యాక్సిన్ వేయించుకోండి, లేదంటే ఇకపై బస్సు ప్రయాణం కష్టమే -
కస్టమర్లకు యప్ టీవీ మెగా ఆఫర్
ముంబై: కరోనా వైరస్ దెబ్బతో ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరు ఇంట్లోనే సినిమాలు, కార్యక్రమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో(ఆన్లైన్) ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన యప్ టీవీ కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ క్రమంలో వినోధం కోరుకునే వారికి యప్ టీవీ 24జులై నుంచి జులై 28వరకు ఐదు రోజుల కాలపరిమితితో ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్ ప్రకటించిన రోజులలో యప్ టీవీ ద్వారా అందించే సినిమాలు, అన్ని కార్యక్రమాలకు ఆఫర్ వర్తించనుంది. ప్రస్తుతం తెలుగులో విశేషాధారణ పొందిన జబర్దస్త, క్యాష్ లాంటి కార్యక్రమాలతో యప్ టీవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలమాళం, బెంగాళీ, కన్నడ, మరాఠి తదితర భాషలలో తక్కువ ప్యాకేజీతో కస్టమర్లను అలరిస్తోంది. అయితే వివిధ దేశాలలో యూప్ టీవీ వివిధ ప్యాకేజీలతో ప్రకటించింది. యూప్ టీవీలో క్లాసికల్ సినిమాల నుంచి ప్రస్తుత బ్లాక్‌బ్లస్టర్ సినిమాల వరకు 3,000సినిమాలు యప్ టీవీ అందిస్తోంది. వివిధ దేశాలలో యప్ టీవీ ప్రత్యేక ప్యాకేజీ వివరాలు ఆస్ట్రేలియాలో సంవత్సర ప్యాకేజీ 119.99డాలర్లు న్యూజిలాండ్‌లో సంవత్సర ప్యాకేజీ 119.99డాలర్లు యూకేలో సంవత్సర ప్యాకేజీ 69.99డాలర్లు యూరప్‌లో సంవత్సర ప్యాకేజీ 69.99డాలర్లు యూఎస్ఏ సంవత్సర ప్యాకేజీ 99.99డాలర్లు -
షావోమి బడ్జెట్ఫోన్ ఫ్లాష్‌సేల్ షురూ
ప్రముఖ చైనా కంపెనీ షావోమి తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి 8 ఫ్లాష్ సేల్స్ గురువారం మధ్యాహ్నం 12 గంటలనుంచి మొదలయ్యాయి. గత నెల (అక్టోబర్) లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్, ఎంఐఇండియా అధికార వెబ్సైట్లతో పాటు ఎంఐ హోమ్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. రెడ్మి 8 ఫీచర్లు 6.22 అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 439 సాక్ ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9 720x1520 పిక్సెల్స్‌రిజల్యూషన్ 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ 512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 12+2 ఎంపీ ఏఐ రియల్ డ్యుయల్ కెమెరా 8 ఎంపీ ఏఐ సెల్పీకెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్మి 8 ధరలు 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ ధర రూ. 7,999 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ రూ. 8,999 -
రూ.1 కే స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ
సాక్షి, న్యూఢిల్లీ : చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమి ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ రేపటి (ఏప్రిల్4 )నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్‌లో ఎంఐ ఫ్యాన్స్‌కు పలు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగాఈ సేల్‌లో భాగంగా రూ.1 ఫ్లాష్ సేల్‌ను కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి ఎంఐ ట్విటర్ ద్వారా వీడియోలను కూడా పోస్ట్ చేస్తోంది. ఒక రూపాయికే తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్తోపాటు, ఎంఐటీవీని సొంతం చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. ముఖ్యంగా రెడ్మి నోట్ 7 ప్రొ, పోకో ఎఫ్ 1, ఎంఐ సౌండ్‌బార్, ఎంఐ ఎల్ఈడీ4 ప్రొ(32) టీవీ ని ఒక రూపాయి ఫ్లాష్ సేల్‌లో విక్రయిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమౌతుంది. అంతేకాదు రూ. 2400 విలువైన ప్రొడక్ట్‌లను కేవలం 99 రూపాయలకే అందిస్తోంది. పోకో ఎఫ్1 (6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్) రూ.1 సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది షావోమి. దీని ధర రూ.22,999. ఫ్లాష్ సేల్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌పై 2వేల డిస్కౌంట్ లభ్యం. అలాగే ఎంఐ ఎల్ఈడీ4 ప్రొ(55) అంగుళాల టీవీని డిస్కౌంట్ అనంతరం రూ.45,999 కు అందిస్తోంది. మరిన్ని వివరాలు ఎంఐ వెబ్సైట్లో . Can you guess this right? Share the screenshot of your guess in comments to win a prize. Hints here --> https://t.co/Jl3A9uBmQY #MakeTheMostOfMi #MiFanFestival pic.twitter.com/vtOOiTLLlX — Redmi India (@RedmiIndia) April 2, 2019 #MakeTheMostOfMi by grabbing your favourite #Xiaomi products at unbelievable prices. Here's what the #MiFanFestival has to offer. What's more? Get a chance to win #RedmiNote7 and other prizes. Visit - https://t.co/5tWlIXPzyk RT if you're excited! pic.twitter.com/vmU0LwQWar — Mi India (@XiaomiIndia) April 3, 2019 -
జియో ఫెస్టివ్ గిఫ్ట్‌కార్డ్ బొనాంజా
రిలయన్స్ జియో కస్టమర్లకోసం హ్యాపీ న్యూయర్ బొనాంజా ఆఫర్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఫెస్టివ్ గిఫ్ట్ కార్డ్ ఆఫర్‌ను జియో ప్రకటించింది. దీని ద్వారా జియో యూజర్లు జియో కొత్త ఫోన్‌తోపాటు, ఆరు నెలలపాటు ఉచిత వాయిస్, డేటా సర్వీసులను పొందవచ్చు. జియో ఫెస్టివ్ గిఫ్ట్‌కార్డ్ విలువ రూ.1095. ఈ మొత్తం రెండు భాగాలుగా విభజించపడతాయి. రూ. 501, రూ. 594 విలువైన కూపన్లు లభిస్తాయి. రూ.501తో జియో ఫీచర్ ఫోన్‌తో పాటు నెలకు రూ.99 విలువైన కూపన్లు ఆరు నెలలకు అన్నమాట. గిఫ్ట్‌కార్డు కొనుగోలు చేసిన కస్టమర్ దగ్గరలోని జియో స్టోర్‌లోగానీ, రిలయన్స్ డిజిటల్లోగాని పాత జియో ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా కొత్త జియో ఫోన్ 2 కోనుగోలు చేయవవచ్చు. మరోవైపు నేడు ( గురువారం, జనవరి 3) మధ్యాహ్నం 12 గంటలనుంచి జియో ఫీచర్ ఫోన్ -2 ఫ్లాష్ సేల్ కూడా ఉంది. ధర. 2,999 జియో ఫోన్ 2 ఫీచర్లు 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే 512 ర్యామ్ 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వీజీఏ ఫ్రంట్ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ Flash Sale Alert! Buy your #JioPhone2 today at 12PM. https://t.co/sAJL85V7RF pic.twitter.com/8KfpJyoo1r — Reliance Jio (@reliancejio) January 3, 2019 -
షావోమి ఎంఐ ఫ్యాన్ షేల్ షురూ!
సాక్షి,న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమి నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్ పేరుతో డిస్కౌంట్ అమ్మకాలను ప్రారంభించింది. నేటి (డిసెంబరు19వ తేదీ నుంచి 21వ తేదీ ) నుంచి మూడు రోజుల పాటు ఈ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఎంఐ ఎల్ఈడీ టీవీలు, ఇతర ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లతోపాటు రాయితీలను కూడా అందిస్తోంది. ఎంఐ ఆన్లైన్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 5 ప్రొ, ఎం ఏ2, రెడ్ మీవై2 స్మార్ట్ఫోన్లతో పాటు ఎంఐటీవీలపై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఎంఐ ఎ2 6జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999లకే లభ్యం. ఎంఐ ఎ2 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,999 ధరకు అందుబాటులో ఉంది. రెడ్మీ నోట్ 5 ప్రొ 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.14,999 ధరకు లభ్యమవుతోంది. 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.12,999 ధరకు విక్రయిస్తోంది. రెడ్మీ వై2 4జీబీ ర్యామ్ వేరియెంట్ వెయ్యి రూపాయల తగ్గింపుతో రూ.10,999లభ్యం. 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.8,999 ధరకు లభ్యం. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ (49 ఇంచెస్) రూ.1వేయి తగ్గింపుతో రూ.30,999 ధరకు లభ్యం కానుంది. అలాగే ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ (43 ఇంచెస్) రూ.21,999 ధరకు, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సి ప్రొ (32 ఇంచెస్) రూ.14,999 ధరకు లభ్యం కానున్నాయి. అంతేకాదు ఈ సేల్‌లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.50, రూ.100, రూ.200, రూ.500 విలువైన కూపన్లు ఇస్తారు. మొబిక్విక్ యూజర్లకు 10 శాతం ఇన్స్టంట్ సూపర్ క్యాష్ వస్తుంది. గూగుల్ పే యూజర్లు రూ.500, . పేటీఎం యూజర్లు రూ.300 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అలాగే మొబిక్విక్ యూజర్లు 10శాతం దాకా డిస్కౌంట్ పొందే అవకాశం. Smartphone or a smart device, choose your pick. Because we've offers on your favourite products in #1MiFanSale. Check out for more offers here: https://t.co/uhKAPsvyYj pic.twitter.com/Qw9cjGQHLX — Mi India (@XiaomiIndia) December 17, 2018 -
షావోమీ బడ్జెట్ ఫోన్ ఫ్లాష్ సేల్
షావోమీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ' రెడ్మి 6ఎ' ఫోన్లకు బుధవారం (నవంబరు 28) మరోసారి ఫ్లాష్‌సేల్ నిర్వహించనుంది. అమెజాన్, ఎంఐ.కామ్ వెబ్సైట్లలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్‌సేల్ ప్రారంభం. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్ కొనుగోలుపై 5 శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే జియో వినియోగదారులకు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,200 ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్‌తోపాటు, షరతులతో 100 జీబీ జియో 4జీ డేటా ఉచితం. ఇక ఈ ఫోన్ ధరల విషయానికొస్తే.. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.600 పెరిగి రూ.6,599గా ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.500 పెరిగి రూ.7,499 వద్ద లభ్యం. రెడ్మీ 6ఎ ఫీచర్లు 5.45 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే 18:9 యాస్పెక్ట్ రేషియో ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10 హీలియో ఏ 22 2జీబీ ర్యామ్,16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి నోట్ 6 ప్రో సెకండ్ ఫ్లాష్ సేల్ నేడే
మొదటి సేల్‌లో రికార్డు స్థాయిలో అమ్ముడు బోయిన రెడ్మి నోట్ 6ప్రో రెండవసారి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు (నవంబరు 28) మధ్యాహ్నం 12గంటలనుంచి ఫ్లాష్‌సేల్ ప్రారంభం. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ సేల్ ఉంటుంది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి నోట్ సిరీస్‌లో కొత్త ఫోన్ రెడ్మి నోట్ 6ప్రోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనవంబరు 23న మధ్యాహ్నం 12, 3, 6, 9 గంటలకు వరుసగా స్పెషల్ సేల్ నిర్వహించింది. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో తమ స్మార్ట్‌ఫోన్ నిమిషాల్లో ఔట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచిందని షావోమీ చీఫ్ మను జైన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెడ్మి నోట్ 6ప్రో ఫీచర్లు 6.26 ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
పేటీఎం మాల్ సేల్ : ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: పేటీఎం మాల్ మళ్లీ డిస్కౌంట్ ధరలకు తెరతీసింది. ఇటీవలి అన్లైన్ సేల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న సంస్థ దాజాగా 'ఫ్లాష్ సేల్ వీక్' ను తిరిగి ప్రారంభించింది. ఇందులో ల్యాప్‌టాప్‌లపై క్యాష్ బ్యాక్‌లు ఇతర ఆఫర్లను అందిస్తోంది. వారం రోజుల పాటుఈ సేల్ నిర్వహించనున ఈ సేల్‌లో దేశంలో టాప్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను, ఈఎంఐ ఆఫర్లను అందిస్తోంది. సెప్టెంబర్ 24 -30 వరకు పేటీఎం మాల్ ప్రతి రోజూ సాయంత్రం 4-8 గంటలదాకా ఫ్లాష్ సేల్ వీక్ కొనసాగనుంది. ముఖ్యంగా హెచ్‌పీ, డెల్, యాసెర్, ఆసుస్, లెనోవో బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లను ఈ సేల్‌లో విక్రయిస్తోంది. రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇంటెల్ కోర్ ఐ5, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, 15.6 అంగుళాల డిస్ప్లే , టర్బో బూస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ల్యాప్‌టాప్‌ను రూ. 39,490కే ఆఫర్ చేస్తోంది. దీ ని వాస్తవ ధర రూ. 45,889. అదే విధంగా, లెనోవా ఇడిప్యాడ్ 320 (ఇంటెల్ ఐ3 ప్రాసెసర్, 4జీబీర్యామ్, 1 టిబి హార్డ్ డిస్క్ డ్రైవ్) కొనుగోలుపై 27శాతం డిస్కౌంట్, 3,500 రూపాయల క్యాష్‌బ్యాక్‌తో రూ. 21,490లభిస్తుంది. దీని ధరను వాస్తవ ధర రూ. 34,490. వీటితోపాటు డెల్, యాసెర్, ఆసుస్ లాంటి ఇతర ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌లాప్‌లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. -
రెండు నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్
న్యూఢిల్లీ : నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ అంటే వినియోగదారులకు అదో క్రేజ్. ఈ స్మార్ట్ఫోన్లకు చైనీస్ దిగ్గజం షావోమి స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పోటాపోటీగా వస్తోంది. అటు షావోమి స్మార్ట్ఫోన్లు సెకన్ల వ్యవధిలో అవుటాఫ్ స్టాక్ అవుతుండగా.. ఇటు నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు కూడా అదే రేంజ్లో విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి. తాజాగా నోకియా 6.1 ప్లస్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాష్ సేల్కు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి వచ్చిన రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ డివైజ్ అవుటాఫ్ స్టాక్ అయింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి వచ్చిన ఈ ఫోన్, 12:02 కల్లా అవుటాఫ్ స్టాక్ బోర్డును పెట్టేసింది. అంటే ఆ మేర డిమాండ్‌తో నోకియా 6.1 ప్లస్‌ను వినియోగదారులు సొంత చేసుకున్నారు. అయితే ఈ సేల్‌లో ఎన్ని యూనిట్లను విక్రయానికి ఉంచారో తెలియదు. నోకియా 6.1 ప్లస్‌కు ఇది మూడో సేల్. తొలి సేల్ ఆగస్టు 30న నిర్వహించారు. అప్పుడే వినియోగదారుల నుంచి ఈ ఫోన్‌కు మాంచి డిమాండ్ వచ్చింది. తొలి సేల్కు వచ్చిన మూడు వారాల్లోనే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు వస్తున్న రేటింగ్స్, రివ్యూలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే 10,680 రేటింగ్స్, 2,329 రివ్యూలు ఫ్లిప్‌కార్ట్‌లో రికార్డయ్యాయి. తర్వాత సేల్ సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు... 5.8 అంగుళాల నాచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ గ్లాస్ శాండ్విచ్ డిజైన్ విత్ 2.5డీ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డ్యూయల్ సిమ్(నానో) వెనుక వైపు రెండు కెమెరాలు(ఒకటి 16 మెగాపిక్సెల్, రెండోది 5 మెగాపిక్సెల్ సెన్సార్) ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 400 జీబీ వరకు విస్తరణ మెమరీకి అవకాశం ముందు 93 శాతం గ్లాస్ సర్ఫేస్తో అల్యూమినియం బాడీ 3060 ఎంఏహెచ్ బ్యాటరీ ధర రూ.15,999 -
జియో ఫోన్ -2 ముచ్చటగా మూడోసారి
సాక్షి, ముంబై: రిలయెన్స్ జియో ఫోన్ హై-ఎండ్ మోడల్ జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ ముచ్చటగా మూడోసారి కస్టమర్లను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ రోజు (సెప్టెంబరు12, బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు జియో ఫోన్2 ఫ్లాష్‌సేల్ ప్రారంభం కానుంది. మొదటి, రెండు ఫ్లాష్‌సేల్ ద్వారా కొద్ది నిమిషాల్లోనే రికార్డు అమ్మకాలను నమోదు చేసి ఔట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచింది. ఈ సేల్‌ద్వారా జియో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు వారం రోజుల్లోగా ఆ ఫోన్లను డెలివరీ చేయనున్నారు. జియో 4జీఫోన్లు రెండింటిలోనూ వాట్సాప్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు నిన్న ప్రకటించింది. దీంతో వాట్సాప్, ఫేస్బుక్,యూట్యుబ్లాంటి పాపులర్ యాప్‌లన్నీ జియో ఫోన్లలో అందుబాటులోకి వచ్చాయి. కాగా ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తూ, అట్టహాసంగా లాంచ్ చేసిన జియో మొదటి ఫోన్‌కు మంచి స్పందన రావడంతో, హై-ఎండ్ మోడల్ జియో ఫోన్-2 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జియో ఫోన్ 2 ధర రూ.2,999 మాత్రమే. క్వెర్టీ కీప్యాడ్, 2.4 అంగుళాల హారిజాంటల్ డిస్ప్లే, 4జీ సపోర్ట్‌తోపాటు స్టోరేజ్ కెపాసిటీని 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం. జియో ఫోన్-2 ఫీచర్లు 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకువిస్తరించుకునే అవకాశం 2 ఎంపీ రియర్ కెమెరా వీజీఏ ఫ్రంట్ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రూ.1 కే హానర్ 9ఎన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా దిగ్గజం హానర్ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. హానర్ భారతీయ వినియోగదారులకోసం ఫ్లాష్ సేల్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 11న ఈ ప్రత్యేకంగా ఈ విక్రయాన్ని చేపట్టబోతోంది. ఈ సేల్‌లో హానర్ 9ఎన్ (3 జీబీ, 32 జీబీ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒక రూపాయికే అందించనుంది. హానర్ 9ఎన్ 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర. రూ. 11,999గా ఉంది. సెప్టెంబర్ 11 న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు హానర్ వెబ్సైట్ ద్వారా ఈ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తుంది. అయితే ఇది కేవలం కంపెనీ వెబ్సైట్ అలాగే స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. లిమిటెడ్ డివైస్‌లపై అందిస్తున్న ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే హానర్ ఆన్లైన్ స్టోర్‌లో రిజిస్టర్ చేసుకొని వ్యకిగత వివరాలను నమోదు చేయాలి. అలాగే ఆన్లైన్ చెల్లింపులకు మాత్రమే అనుమతి. దీంతోపాటు ఈ ఫ్లాష్ సేల్ ద్వారా హానర్ 7ఎస్, హానర్ 9ఎన్, హానర్ ప్లే ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. -
జియో ఫోన్ 2 రెండో ఫ్లాష్ సేల్ నేడే
సాక్షి,ముంబై: రిలయెన్స్ జియో ఫోన్ హై-ఎండ్ మోడల్ జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ మరోసారి కస్టమర్లను ఊరించనుంది. ఈ రోజు (ఆగస్టు30, గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు జియో ఫోన్2 ఈ ఫ్లాష్‌సేల్ నిర్వహించనున్నారు. మొదటి సేల్ లో కొద్ది నిమిషాల్లోనే రికార్డు అమ్మకాలను నమోదు చేసి ఔట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచింది. ఈ సేల్‌ద్వారా జియో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు వారం రోజుల్లోగా ఆ ఫోన్లను డెలివరీ చేయనున్నారు. కాగా ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తూ, అట్టహాసంగా లాంచ్ చేసిన జియో మొదటి ఫోన్‌కు మంచి స్పందన రావడంతో, హై-ఎండ్ మోడల్ జియో ఫోన్-2 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జియో ఫోన్ 2 ధర రూ.2,999 మాత్రమే. క్వెర్టీ కీప్యాడ్, 2.4 అంగుళాల హారిజాంటల్ డిస్ప్లే, 4జీ సపోర్ట్, వీఓవైఫై, బ్లూటూత్, వైఫై, జీపీఎస్, ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, వాట్సాప్ సపోర్ట్ ఈ ఫోన్ స్పెషాలిటీలు. అంతేకాదు మెమొరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. జియో ఫోన్-2 ఫీచర్లు 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే 512 ఎంబీ ర్యామ్ 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకువిస్తరించుకునేఅవకాశం 2 ఎంపీ రియర్ కెమెరా వీజీఏ ఫ్రంట్ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ -
హానర్ 9ఎన్ ఫ్లాష్ సేల్
సాక్షి, న్యూఢిల్లీ: హానర్ స్మార్ట్ఫోన్లకోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గ్రేట్ న్యూస్. హానర్ లేటెస్ట్ మొబైల్ హానర్ 9 ఎన్ ఫ్లాష్ సేల్ మళ్లీ ప్రారంభం కానుంది. నేడు(ఆగస్టు 21, మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు మూడు ఫ్లాష్ సేల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ మంచి విక్రయాలనే నమోదు చేసింది. నాలుగో విడత ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. స్మార్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్, బ్యూటీ ఆల్ అరౌండ్ , అమేజింగ్ కలర్ ఆప్షన్స్ అంటూ హువావే ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్ 3/4 జీబీ ర్యామ్, 32, 64 జీబీ స్టోరేజ్, 4జీబీ/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో అందుబాటులోఉంది. వీటి ధరలు వరుసగా రూ.11,999, రూ.13,999, 4జీబీ 64 జీబీ స్టోరేజ్ రూ.17,999గా ధరలకు లభించనుంది. హానర్ 9ఎన్ ఫీచర్లు 5.84 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1080 x 2280 రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 3/4 జీబీ ర్యామ్ 32/64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
భలే గిరాకీ : నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ షావోమికి చెందిన కొత్త స్మార్ట్ఫోన్లు రెడ్మి నోట్5, రెడ్మి నోట్ 5 ప్రొలకు భలే గిరాకీ వచ్చింది. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో తొలి ఫ్లాష్ సేల్కు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఈ రెండు స్మార్ట్ఫోన్లు అవుటాఫ్ స్టాక్ అయ్యాయి. 3 నిమిషాల్లోనే 3 లక్షల యూనిట్ల స్మార్ట్ఫోన్లు, అంటే నిమిషానికి లక్ష ఫోన్లు అమ్ముడుపోయినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ తెలిపారు. ఇండియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సేల్‌గా అభివర్ణించారు. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అయిన రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ తర్వాతి సేల్ ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉండబోతున్నట్టు పేర్కొన్నారు. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అవడంపై, కస్టమర్లు తీవ్ర నిరాశ వ్యక్తంచేస్తున్నారు. ఈ రెండు స్మార్ట్ఫోన్లతో పాటు షావోమి ఎంఐ టీవీ 4ను కూడా కంపెనీ నేడు విక్రయానికి తీసుకొచ్చింది. షావోమి రెడ్మి నోట్ 5 ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. షావోమి రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ #RedmiNote5 & #RedmiNote5Pro: we sold 3L+ units in -
నోకియా 7 హాట్ సేల్..నిమిషాల్లోనే
బీజింగ్: త్వరలోనే భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న నోకియా తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ నోకియా 7 చైనాలో రికార్డ్ అమ్మకాలను సాధించింది. కేవలం నిమిషాల వ్యవధిలో హాట్ సేల్ ను నమోదు చేసింది. చైనాలో తన మొదటి ఫ్లాష్ సేల్ నిమిషాల్లోనే పూర్తయిందని నోకియా వెల్లడించింది. స్థానిక ఇ-కామర్స్ వెబ్సైట్లు జెడి.కాం, సునింగ్ ద్వారా లక్షన్నర రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. మొత్తం ఎన్ని యూనిట్లు విక్రయించిందీ స్పష్టం చేయనప్పటికీ చైనాలో మొట్టమొదటి ఫ్లాష్ విక్రయానికి ముందే నోకియా 7 150,000 రిజిస్ట్రేషన్లను పొందిందని తెలిపింది. నోకియా 6కి, నోకియా 8 కి మధ్య గ్యాప్ ను పూర్తి చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ డివైస్‌తో మరోసారి నోకియా తన ప్రాభవాన్ని చాటుకోనుందనే అభిప్రాయం మార్కెట్లో నెలకొంది. అక్టోబర్ 31న భారతమార్కెట్లో విడుదల కానుంది. కాగా 4 జీబీ, 6 జీబీ ర్యామ్ వేరియంట్స్ వస్తున్నాయి. 4 జీబీ వేరియంట్ మన కరెన్సీలో సుమారు రూ.25 వేలు కాగా.. 6 జీబీ వేరియంట్ రూ.26500గా ఉంది. 360 డిగ్రీ రికార్డింగ్‌ను సపోర్ట్ చేసే నోకియా ఓజో ఆడియా టెక్నాలజీతో నోకియా 7 లభించనుంది. అలాగే ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్కు నోకియా 7 సిద్ధంగా ఉందని హెచ్ఎండీ గ్లోబల్ వెల్లడించిన సంగతి విదితమే. నోకియా 7 ఫీచర్లు 5.2 ఇంచ్ ఐపీఎస్ 2.5డీ డిస్ప్లే 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 64 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం 16 మెగాపిక్సెల్ రియర్‌కెమరా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్ 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ -
జియో ఫోన్ సెకండ్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా?
-
జియో ఫోన్ సెకండ్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: జియో తన అభిమానులకు మరో శుభవార్త అందించింది. జియోఫోన్ పేరుతో ఉచితంగా ఫోన్ అందిస్తామని గతంలో ప్రకటించిన జియో తన తొలిసేల్‌ను గత ఆగస్టులో నిర్వహించింది. ఈ బిగ్‌సేల్‌లో మూడు రోజుల్లో ఏకంగా దాదాపు 60 మిలియన్ల ఫోన్లను అమ్మిన జియో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. తొలి విడుత ఫోన్ల డెలివరీ సైతం దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో రెండో సేల్ నిర్వహించాలని జియో భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను త్వరలో విడుదల చేస్తామని జియో ప్రతినిధి వెల్లడించారు. రెండో దశ జియో ఫోన్ బుకింగ్స్‌ను దీపావళి తరువాత ప్రారంభిచవచ్చని, అది అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదటి వారం ఉండొచ్చని జియో వర్గాలు ప్రకటించాయి. గత జులైలో జరిగిన రియలన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఫోన్ ఉచితమే అయినప్పటికీ రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఆ డబ్బును వినియోగదారులకు వాపసు ఇస్తామని జియో ప్రకటించిన విషయం తెలిసిందే. -
నోకియా 6 ష్లాష్ సేల్: స్పెషల్ ఆఫర్స్
న్యూడిల్లీ: నోకియా 6 స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ మరోసారి ప్రారంభం. నోకియా బ్రాండ్ లైసెన్స్ పొందిన హెచ్ఎండీ గ్లోబల్ ఎఫర్డబుల్ మిడ్-రేంజ్ హ్యాండ్ సెట్‌ను కొనుగోలు చేయడానికి భారతీయ వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఇండియాలో ఈ హ్యాండ్ సెట్ ప్రత్యేకంగా కొనుగోలుకు లభ్యమవుతుంది. ఫస్ట్ సేల్ ( ఆగష్టు 23న) సందర్భంగా ఒకే ఒక్క నిమిషంలో మొత్తం ఫోన్లన్నీ అమ్ముడుపోయాయి. మరి ఈసారి ఎన్ని నిమిషాల్లో ముగుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రూ.14,999ధరలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ మాట్ట్ బ్లాక్, సిల్వర్, కాపర్ వైట్, టెంపర్డ్ బ్లూ, కలర్ వేరియంట్లలో లభిస్తోంది. ఆగస్టు 28 న సోమవారం ఇ-కామర్స్ సైట్లో రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ అమ్మకం. అలాగే ఆగస్టు 23 లేదా ఆగస్టు 30న రిజిష్టర్ చేసుకున్నవారు సెప్టెంబరు 6 న జరగబోయే తరువాతి సేల్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు ఈ ఫ్లాష్ సేల్ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తోంది. నోకియా 6 సేల్ ఆఫర్స్ అమెజాన్ పే ద్వారా నోకియా 6ను కొనుగోలు పై అమెజాన్ ప్రైమ్ యూజర్లకు రూ.1000 డిస్కౌంట్. కిండ్లే యాప్ ద్వారా ఈ-బుక్స్ పై 80శాతం రాయితీ(దాదాపు రూ.300దాకా) . రూ.2500 మేక్ మై ట్రిప్ డిస్కౌంట్ (రూ. 1,800 హోటళ్లు, విమానాల మీద రూ .700), ఐదు నెలల కాలంలో 45జీబి వొడాఫోన్ ఉచిత 4జీడేటా ఉచితం నోకియా 6 ఫీచర్స్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ప్లే రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్ విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ 3జీబి ర్యామ్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్ మి 4ఏ ఫ్లాష్ సేల్: స్పెషల్ ఆఫర్లు
ముంబై: చైనా మొబైల్ దిగ్గజం షియామి తన జీ ఫోన్ రెడ్మీ 4 ఏ విక్రయాలను మరోసారి ప్రారంభించింది. బుధవారం మధ్నాహ్నం 12గం. లనుంచి అమెజాన్ లో ప్రత్యేకంగా ఈ అమ్మకాలు మొదలయ్యాయి. అంతేకాదు రెడ్మీ 4ఏ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ తో పాటు రూ. 349 కు కస్టమర్లు ఎంఐ కేసులను ఆఫర్ చేస్తోంది. దీని అసలు ధర రూ. 399 . అలాగే ఆసక్తిగల కస్టమర్లు ఎంఐ బేసిక్ హెడ్ ఫోన్లను 599 రూపాయలు పొందవచ్చు. ముఖ్యంగా మొదటి లక్ష కస్టమర్లకు కిండ్లే యాప్ ద్వారా బుక్స్ కొనుగోలుపై రూ.200 క్రెడిట్ అందిస్తోంది. ఐడియా సెల్యులార్ రెడ్ మి 4ఏ కొనుగోలుపై 28 జీబీ 4జీ డేటాను తన చందాదారులకు అందిస్తోంది. రోజుకు 1జీబీ ఈ డేటాను పొందడానికి కస్టమర్లు 28 రోజుల వాలిడిటీతో రూ .343 తో రీఛార్జ్ చేసుకోవాలి. దీంతోపాటు అదనంగా రోజుకి 300 నిమిషాల టాక్ టైం ఫ్రీ. -
రెడ్ మి4 సేల్: అమెజాన్ వెబ్సైట్ క్రాష్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెబ్ సైట్, మొబైల్ యాప్ రెండూ క్రాష్ అయ్యాయి. బంపర్ ఆఫర్లతో షియోమి రెడ్ మి4 నేడు తొలిసారి మధ్యాహ్నం 12 గంటల సమయంలో విక్రయానికి వచ్చిన నేపథ్యంలో అమెజాన్ ఇండియా వెబ్ సైట్, యాప్ స్తంభించాయి. కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య తలెత్తినట్టు తెలిసింది. రెడ్ మి4 ఫోన్ ను కొనుగోలు చేయాలని భావించిన కస్టమర్లకు, ప్రస్తుతం ఇది రద్దీ సమయం, ఈ పేజీలో ట్రాఫిక్ విపరీతంగా ఉంది, కొద్దిసేపయ్యాక ప్రయత్నించండి అనే మెసేజ్ అమెజాన్ వెబ్ సైట్ లో, యాప్ లో దర్శనమిచ్చింది. ఒకవేళ ఆర్డర్ ను ప్లేస్ చేయాలనుకుంటే, ఈ సమయంలో ప్రాసెస్ కాదని కూడా సందేశాలు కనిపించాయి. షియోమి మోడల్స్ అమెజాన్ లో విక్రయానికి వచ్చిన ప్రతిసారి సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి. ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్లను అమెజాన్ ఇండియాలో, ఎంఐ.కామ్ లో విక్రయానికి ఉంచుతున్నారు. తాజా స్మార్ట్ ఫోన్ రెడ్ మి4 విక్రయం సందర్భంగా ఏకంగా ఈ సారి అమెజాన్ వెబ్ సైటే క్రాష్ అయింది. బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ ను షియోమి విడుదల చేసింది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 6,999 రూపాయలు. 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 435 చిప్ సెట్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. -
రెడ్ మి నోట్ 4 లవర్స్‌కు శుభవార్త
చైనా మొబైల్ దిగ్గజం షియామి రెడ్ సిరీస్ ఫోన్ లవర్స్‌కు శుభవార్త. మేకిన్ ఇండియా పథకంలో భాగంగా ఇటీవల విడుదల చేసిన రెడ్మి నోట్ 4 ఫ్లాష్ సేల్ మనోసారి ప్రారంభించింది. నిమిషాల్లో లక్షల ఫోన్ల అమ్మకాలతో సునామీ సృష్టించి, అవుట్ ఆఫ్ స్టాక్ గా నిలిచిన క్రేజీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తిరిగి నేడు (బుధవారం) ప్రారంభంకానున్నాయి. ఎమ్ఐ.కామ్, ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12గంటలనుంచి ప్రత్యేకంగా లభ్యంకానుంది. దీని ప్రారంభ ధర రూ .9,999గా ఉంది. ఫోన్ వేరియంట్ల ఆధారంగా ధర మారుతుంది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. షియోమి రెడ్ మి నోట్ 4 ఫీచర్లు 2.5డి కర్వ్డ్ గ్లాస్‌తో 5.5 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఐయూఐ 8 ఇంటర్ఫేస్ 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్ డెకాకోర్ మీడియా టెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్ 2జీబీ/3జీబీ /4జీబీర్యామ్, 32జీబీ/32జీబీ/64జీబీ ఇంటర్నల్ మెమొరీ 128జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ 13 మెగాపిక్సెల్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్ఫ్రార్డ్ సెన్సార్ 4100 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా ఈ మూడు వేరియంట్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి. 2జీబీ+ 32జీబీ వేరియంట్ధర రూ. 9999 3జీబీ + 32జీబీ వేరియంట్ధర రూ. 10,999 4జీబీ + 64జీబీ వేరియంట్ ధరరూ. 12,999 -
సెకన్లలో ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి ఏదైనా కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తుందంటే చాలు. ఆన్ లైన్ వినియోగదారులందరూ ఎప్పుడెప్పుడు కొంద్దామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ కంపెనీ ఫోన్లు ఫ్లాష్ సేల్ కు వచ్చిన సెకన్లలో అమ్ముడుపోతున్నాయి. ఇదే తరహాలో ఇటీవలే అదిరిపోయే ఫీచర్లతో చైనా మార్కెట్లోకి వచ్చిన ఎంఐ 6 ఫ్లాగ్ షిప్ కు అనూహ్య స్పందన వచ్చింది. నిన్న చైనాలో ఈ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ కు వచ్చింది. ఫ్లాష్ సేల్ కు వచ్చిన వెంటనే ఎంఐ 6 స్మార్ట్ ఫోన్లు అవుటాఫ్ స్టాక్ అయ్యాయి. సెకన్లలోనే స్టాకంతా అమ్ముడుపోయినట్టు కంపెనీ ప్రకటించింది. ఎంఐ 6 తర్వాతి ఫ్లాష్ సేల్ మే 5న కంపెనీ నిర్వహించనుంది. అయితే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందా? లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రిపోర్టులైతే, ఎంఐ6ను భారత్ లో లాంచ్ చేయడం లేదని చెబుతున్నాయి. కంపెనీ సైతం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2.45గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, 6జీబీ ర్యామ్, 64/128జీబీ స్టోరేజ్, డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా, ఆల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, నాలుగు వైపులు కర్వ్డ్ గ్లాస్/ సెరామిక్ బాడీ, 3,350ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. ఈ ఫోన్ ధర సుమారు రూ.23,999గా ఉంది. -
షియోమీ సంచలన ఆఫర్.. ప్చ్!
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ ప్రకటించిన రూపాయి సేల్ వినియోగదారులను ఉసూరు మనిపించింది. రూపాయికే స్మార్ట్ ఫోన్ దక్కించుకోవాలని ప్రయత్నించిన యూజర్లుకు నిరాశే ఎదురైంది. దీపావళి అమ్మకాల్లో భాగంగా రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ను రూపాయికే విక్రయిస్తామని షియోమీ ప్రకటించడంతో కోట్లాది మంది ఎంఐ వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఫ్లాష్ అమ్మకాల కోసం ముందుగానే ఎంఐ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి వేచి చూశారు. ఫ్లాష్ అమ్మకాలు మొదలయి సెకన్ సమయం అయినా గడవకుండానే రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్లు అమ్ముపోయాయన్న సందేశం చూసి వినియోగదారులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే కేవలం 30 ఫోన్లు మాత్రమే రూపాయికి విక్రయిస్తామని షియోమీ ముందుగానే ప్రకటించింది. ఫోన్లు తక్కువ, పోటీ ఎక్కువ కారణంగానే అతి తక్కువ సమయంలో అమ్మకాలు పూర్తయినట్టు భావిస్తున్నారు. దీపావళి అమ్మకాలకు ప్రచారం కోసమే షియోమీ రూపాయి ఆఫర్ ప్రకటించిందని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. అయితే షియోమీ ప్రకటించినట్టుగా 30 మందికైనా ఫోన్లు దక్కాయో, లేదో చూడాలి. కాగా, రెడ్ మీ 3ఎస్(రూ.6,499) , రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ ( రూ.8,499) స్మార్ట్ ఫోన్లను ఈ రోజు లాంచ్ చేసిన వెంటనే ఈరోజుకు అమ్మకాలు పూర్తయినట్టు ఎంఐ వెబ్ సైట్ లో కనబడింది. ఈ రెండు ఫోన్లను దక్కించుకునేందుకు రేపు, ఎల్లుండి కూడా అవకాశముంది.