రూపాయికే షియామీ స్మార్ట్ ఫోన్! | Buy Xioami Redmi 3S Prime at just one Rupee here's how! | Sakshi
Sakshi News home page

రూపాయికే షియామీ స్మార్ట్ ఫోన్!

Published Sun, Oct 16 2016 5:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

రూపాయికే షియామీ స్మార్ట్ ఫోన్!

రూపాయికే షియామీ స్మార్ట్ ఫోన్!

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ దీపావళి అమ్మకాల్లో భాగంగా వినియోగదారులకు సర్ ప్రైజింగ్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూపాయికే రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీపావళి సందర్భంగా షియోమీ అక్టోబర్ 17-19 మధ్య ఫ్లాష్ అమ్మకాలు నిర్వహించనుంది. ఇందుల్లో భాగంగా రెడ్ మీ 3ఎస్ స్మార్ట్ ఫోన్ ను రూపాయికే విక్రయించనుంది.

సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లాష్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. అయితే ముందుగా ఎంఐ డాట్ కామ్, ఎంఐ స్టోర్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. రూపాయికి 30 రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్లు అమ్మకానికి ఉంచుతామని షియోమీ వెల్లడించింది. రూపాయికి ఫోన్ కోలుగోలు చేసిన తర్వాత రెండు గంటల్లో సొమ్ము చెల్లించాలని, లేకుంట్ ఆర్డర్ రద్దవుతుందని షియోమీ తెలిపింది.

రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ ఫీచర్లు
5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
మెటల్ బాడీ
1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ మెమరీ
128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ
13 ఎంపీ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4100 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement