రెడ్ మి4 సేల్: అమెజాన్ వెబ్సైట్ క్రాష్
రెడ్ మి4 సేల్: అమెజాన్ వెబ్సైట్ క్రాష్
Published Tue, May 23 2017 2:40 PM | Last Updated on Fri, May 25 2018 7:14 PM
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెబ్ సైట్, మొబైల్ యాప్ రెండూ క్రాష్ అయ్యాయి. బంపర్ ఆఫర్లతో షియోమి రెడ్ మి4 నేడు తొలిసారి మధ్యాహ్నం 12 గంటల సమయంలో విక్రయానికి వచ్చిన నేపథ్యంలో అమెజాన్ ఇండియా వెబ్ సైట్, యాప్ స్తంభించాయి. కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య తలెత్తినట్టు తెలిసింది. రెడ్ మి4 ఫోన్ ను కొనుగోలు చేయాలని భావించిన కస్టమర్లకు, ప్రస్తుతం ఇది రద్దీ సమయం, ఈ పేజీలో ట్రాఫిక్ విపరీతంగా ఉంది, కొద్దిసేపయ్యాక ప్రయత్నించండి అనే మెసేజ్ అమెజాన్ వెబ్ సైట్ లో, యాప్ లో దర్శనమిచ్చింది. ఒకవేళ ఆర్డర్ ను ప్లేస్ చేయాలనుకుంటే, ఈ సమయంలో ప్రాసెస్ కాదని కూడా సందేశాలు కనిపించాయి. షియోమి మోడల్స్ అమెజాన్ లో విక్రయానికి వచ్చిన ప్రతిసారి సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి. ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్లను అమెజాన్ ఇండియాలో, ఎంఐ.కామ్ లో విక్రయానికి ఉంచుతున్నారు. తాజా స్మార్ట్ ఫోన్ రెడ్ మి4 విక్రయం సందర్భంగా ఏకంగా ఈ సారి అమెజాన్ వెబ్ సైటే క్రాష్ అయింది. బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ ను షియోమి విడుదల చేసింది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 6,999 రూపాయలు. 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 435 చిప్ సెట్ ను ఈ ఫోన్ కలిగి ఉంది.
Advertisement
Advertisement