Redmi 4
-
షావోమి ఆఫర్లు : రూ.1కే ఫ్లాష్ సేల్స్
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల మెగా సేల్ ఈవెంట్లు ముగియగానే.. చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన ఫెస్టివల్ సీజన్ సేల్‌ను ప్రారంభించింది. దివాలి విత్ ఎంఐ సేల్ పేరుతో నేటి ఉదయం నుంచి దీన్ని నిర్వహిస్తోంది. ఎంఐ.కాంమ్, ఎంఐ స్టోర్ యాప్‌లో శుక్రవారం వరకు ఈ సేల్ జరుగనుంది. వేరియబుల్స్, షావోమి మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్‌పై ఆఫర్లను అందించనుంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సేల్ సందర్భంగా రూపాయికే ఫ్లాష్ సేల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో యూజర్లు ప్రతిరోజూ రూ.100, రూ.500 విలువైన కూపన్లు పొందుతారు. పైన పేర్కొన్న ఫ్లాష్ సేల్ ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తోంది. యాప్‌కు మాత్రమే నిర్వహించే బిడ్ టూ విన్ కంటెస్ట్‌ను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుపనుంది. వీటిలో గెలుచుకునే కూపన్లను పలు షావోమి ఉత్పత్తులు కొనుగోలు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చు. డీల్స, ఆఫర్లే కాకుండా.. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలుచేసే కస్టమర్లకు డిస్కౌంట్లు, ఒక్కో కార్డుపై 8వేల మొత్తంలో కనీస లావాదేవీ జరిపిన వారికి 1000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. రెడ్మి నోట్4 కొనుగోలు చేసిన పేటీఎం యూజర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను షావోమి ఇవ్వనుంది. మొబైల్స్‌పై షావోమి ఆఫర్లు.. రెడ్మి నోట్4 స్మార్ట్‌ఫోన్ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999కు తగ్గింపు రెడ్మి నోట్4 స్మార్ట్‌ఫోన్ 3జీబీ, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999కు తగ్గింపు రెడ్మి 4పై రూ.1,500 తగ్గింపు, ఎంఐ మ్యాక్స్2 పై రూ.2000 తగ్గింపు -
అమెజాన్ ప్రైమ్ డే సేల్: ఆఫర్ల పండుగ
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఆఫర్ల పండుగకు తెరలేపింది. తన తొలి ప్రైమ్ డే సేల్‌ను ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి భారత్‌లో ప్రారంభించింది. 12 ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ నేడు ఈ స్పెషల్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇతర వస్తువులపై డిస్కౌంట్లను, ఆఫర్లను, డీల్స్‌ను అమెజాన్ ప్రకటించింది. 30 గంటల పాటు ఈ సేల్ జరుగబోతుంది. అంటే రేపు అర్థరాత్రి వరకు ఈ సేల్ కొనసాగనుంది. అయితే ఇది ఎక్స్‌క్లూజివ్‌గా రూ.499తో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తన ప్రైమ్మెంబర్లకు మాత్రమే. ఈ సేల్‌లో ఆఫర్ చేసే డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు దేశం దేశంలోనే భిన్నంగా ఉండనున్నాయి. భారత్‌తో పాటు నేడు ప్రైమ్ డే సేల్ జరుగబోయే దేశాల్లో ఫ్రాన్స్, చైనా, జర్మనీ, కెనడా, బెల్జియం, జపాన్‌లు ఉన్నాయి. గతేడాదే అమెజాన్ ఈ సేల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ సారి భారత్‌లో కూడా ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ డీల్స్.. స్మార్ట్ఫోన్లను తీసుకున్నట్లు అయితే, షియోమి లవర్స్ ఫేమస్ ఫోన్ రెడ్మి 4ను ఓపెన్ సేల్ కింద నేటి సాయంత్రం 5 గంటల నుంచే అందుబాటులో ఉంచింది. అది ఎక్స్‌క్లూజివ్‌గా తన ప్రైమ్ మెంబర్లకు మాత్రమే. అంతేకాక వన్ ప్లస్ తాజాగా లాంచ్ చేసిన వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపైన 2000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.. ఈ ఆఫర్ కేవలం డివైజ్ ఎక్స్చేంజ్ చేసుకున్నవారికే. ఇప్పటికే వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్లో కొనుగోలుచేసిన వారికి 19వేల రూపాయల తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఇక ఈ స్పెషల్ సేల్ సందర్బంగా మరో రెండు వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు యూజర్లకు మరో రూ.2000 తగ్గింపును అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. మోటోఫోన్లపై రూ.1000 తగ్గింపును, హానర్ 6ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌పై 3000 రూపాయల తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. కిచెన్, హోమ్ అప్లయెన్స్‌పై 45 శాతం తగ్గింపును ఇస్తోంది. అమెజాన్ ఫైర్‌టీవీ స్టిక్ ధరను 1000 రూపాయల వరకు తగ్గించింది. అంతేకాక 499 రూపాయల క్యాష్ బ్యాక్‌ను ఇస్తున్నట్టు అమెజాన్ చెప్పింది. ఫిట్‌బిట్ ఫిట్నెస్ ట్రాకర్లపై 40 శాతం తగ్గింపు, వస్త్రాలపై 70 శాతం తగ్గింపు, స్విగ్గీ ఫుడ్ డెలవరీపై రూ.150 తగ్గింపు, బుక్‌మైషోలో మూవీ టిక్కెట్లను కొనుగోలుచేసిన వారికి రూ.200 వరకు తగ్గింపు వంటి పలు డీల్స్‌ను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో కొనేవారికి 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లకు అందిస్తున్నారు. ఇవే కాకుండా మరెన్నో డీల్స్, ఆఫర్లు సేల్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉంటాయని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు.30 కొత్త బ్రాండ్లను కూడా ఈ సేల్‌లో లాంచ్చేసింది. -
రెడ్మి 4 కి షాక్: భారీ బ్యాటరీతో టర్బో 5
న్యూఢిల్లీ: ఇన్ఫోకస్ బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా షియామి క్రేజీ ఫోన్ రెడ్ మి 4 కి షాకిచ్చే ధరలో అత్యధిక పోటీ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. భారీ బ్యాటరీతో టర్బో 5 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 2, 3 జీబీ ర్యామ్‌తో, 16జీబీ అంతర్గత మెమరీతో అందుబాటులోకి తెచ్చింది. ఇవి జూలై 4 నుంచి అమెజాన్‌లో లభించనున్నాయని కంపెనీ ఒక ప్రకటనలోతెలిపింది. ఇక ధరల విషయానికి వస్తే 2జీజీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 6,999, 3 జీబీ వేరియంట్ ధరను రూ .7,999గా నిర్ణయించింది. టర్బో 5 ఫీచర్లు: 5.2 అంగుళాల డిస్ప్లే 1280x720 రిజల్యూషన్ 1.25 క్వాడ్- కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టం 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం Introducing #InFocusTurbo5 that allows you to #ChargeLessDoMore, starting at just INR 6999!! Open sale: 4th July'17 only on @amazonIN pic.twitter.com/ANwc1N8jJH — InFocus India (@InFocus_IN) June 28, 2017 -
రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న షియోమి రెడ్మి 4
అతితక్కువ సయమంలో వినియోగదారులను మన్ననలను పొందిన ఫోన్లలో షియోమి రెడ్ మి ముందజలో ఉంటుంది. రెడ్ మి నోట్ 4, రెడ్ మి 4ఏ గ్రాండ్ సక్సెస్ అనంతరం మరో అదరగొట్టే స్మార్ట్ ఫోన్ రెడ్ మి 4ను షియోమి గతనెలలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. లాంచ్ అయిన 30 రోజుల్లో ఈ ఫోన్ 10 లక్షల యూనిట్లు అమ్ముడు పోయాయి. రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ ఫ్లాష్ సేల్, ప్రీ-ఆర్డర్స్ ద్వారా విక్రయిస్తోంది. తమకు ఇది అతిపెద్ద మైలురాయి అని కంపెనీ పేర్కొంది. భారత్ లో తమ జర్నీ ప్రారంభించినప్పటి నుంచి రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ తమ రికార్డులన్నింటిన్నీ బ్రేక్ చేస్తుందని కంపెనీ ఎంతో ఆనందంతో వ్యక్తంచేసింది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర 6,999 రూపాయలు, 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ధర 8,999 రూపాయలు, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలుగా ఉంది. అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ లలో కంపెనీ ప్రతివారం ఫ్లాష్ సేల్స్, ప్రీ-ఆర్డర్లను చేపడుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసినప్పుడే షియోమి ఈ ఫోన్ కచ్చితంగా రెడ్ మి3 ఎస్ వేరియంట్ల విక్రయాలను నమోదుచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది. గతేడాదిలో లాంచ్ అయిన రెడ్ మి 3ఎస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ''హ్యయస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఆన్ లైన్'' గా నిలిచింది. ఈ ఫోన్ 40 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. రెడ్ మి 4 కీలక స్పెషిఫికేషన్స్... 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ 4100ఎంఏహెచ్ బ్యాటరీ 1.4గిగాహెడ్జ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ చిప్ 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్ మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 13ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ 4జీ ఎల్టీఈ బ్లాక్, మెటల్ రంగుల్లో అందుబాటు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ హైబ్రిట్ సిమ్ ట్రే -
రెడ్మీ 4 సేల్ ఒక గంట మాత్రమే..
న్యూడిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షియామి తన క్రేజీ మొబైల్ అమ్మకాలను మరోసారి ప్రారంభించింది. మంగళవారం కేవలం ఒకగంట పాటు రెడ్ 4 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనుంది. మధ్యాహ్నం 12గం. ఎంఐ.కామ్, ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుందని షియామి ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్‌లో, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, మూడు వేరియంట్లలో, రూ .6,999 , రూ.8999, రూ. 10,999 ధరల్లో లభ్యంకానుంది. మధ్నాహ్నం 12:00 గంటల నుండి 1:00 గంటల మధ్య కేవలం ఒక గంట మాత్రమే అందుబాటులో ఉండనుంది. You don't need to keep track of the score, 'cause everyone is already saying the winner is Redmi 4. Sale starts at noon! pic.twitter.com/zFd8c2co8X — Redmi India (@RedmiIndia) May 30, 2017 హిస్టరీ రిపీట్: 2.5 లక్షలకుపైగా ఫోన్లు అమ్మకం -
రెడ్ మి4 సేల్: అమెజాన్ వెబ్సైట్ క్రాష్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెబ్ సైట్, మొబైల్ యాప్ రెండూ క్రాష్ అయ్యాయి. బంపర్ ఆఫర్లతో షియోమి రెడ్ మి4 నేడు తొలిసారి మధ్యాహ్నం 12 గంటల సమయంలో విక్రయానికి వచ్చిన నేపథ్యంలో అమెజాన్ ఇండియా వెబ్ సైట్, యాప్ స్తంభించాయి. కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ సమస్య తలెత్తినట్టు తెలిసింది. రెడ్ మి4 ఫోన్ ను కొనుగోలు చేయాలని భావించిన కస్టమర్లకు, ప్రస్తుతం ఇది రద్దీ సమయం, ఈ పేజీలో ట్రాఫిక్ విపరీతంగా ఉంది, కొద్దిసేపయ్యాక ప్రయత్నించండి అనే మెసేజ్ అమెజాన్ వెబ్ సైట్ లో, యాప్ లో దర్శనమిచ్చింది. ఒకవేళ ఆర్డర్ ను ప్లేస్ చేయాలనుకుంటే, ఈ సమయంలో ప్రాసెస్ కాదని కూడా సందేశాలు కనిపించాయి. షియోమి మోడల్స్ అమెజాన్ లో విక్రయానికి వచ్చిన ప్రతిసారి సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి. ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్లను అమెజాన్ ఇండియాలో, ఎంఐ.కామ్ లో విక్రయానికి ఉంచుతున్నారు. తాజా స్మార్ట్ ఫోన్ రెడ్ మి4 విక్రయం సందర్భంగా ఏకంగా ఈ సారి అమెజాన్ వెబ్ సైటే క్రాష్ అయింది. బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ ను షియోమి విడుదల చేసింది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 6,999 రూపాయలు. 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 435 చిప్ సెట్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. -
షావోమి ‘రెడ్మి–4’@ రూ.6,999
హైదరాబాద్‌లో ‘మి హోమ్’ స్టోర్! న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్మి–4’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.6,999. ఇందులో 5 అంగుళాల స్క్రీన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ‘రెడ్మి–4’ స్మార్ట్‌ఫోన్ 2 జీబీ ర్యామ్/16 జీబీ మెమరీ, 3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ, 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ అనే మూడు వేరియంట్ల రూపంలో లభ్యంకానుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్ అమెజాన్, మి.కామ్‌లలో మే 23 నుంచి, ‘మి హోమ్స్’లో మే 20 నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. షావోమి ఈ స్మార్ట్ఫోన్తోపాటు తొలిసారిగా ‘మి రూటర్ 3సీ’ అనే వై–ఫై రూటర్‌ను కూడా ఆవిష్కరించింది. ఇది 300 ఎంబీపీఎస్ స్పీడ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ధర రూ.1,199. హైదరాబాద్‌లో షావోమి ఔట్లెట్!! ‘షావోమి’ భారత్‌లోని ఆఫ్‌లైన్ మార్కెట్‌పై ప్రధానంగా దృషిపెట్టింది. అందులోభాగంగానే ఇది ఇటీవల బెంగళూరులో ‘మి హోమ్’ అనే సొంత రిటైల్ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేసింది. దీని సేవలు మే 20 నుంచి అందుబాటులోకి రానున్నవి. ఇప్పుడు ఈ రిటైల్ షాప్స్ను నాలుగు ప్రధాన పట్టణాలకు విస్తరించాలని చూస్తోంది. వీటిల్లో హైదరాబాద్ కూడా ఉంది. -
‘రెడ్ మి 4’ కమింగ్ సూన్..ధర ఎంత?
ముంబై: స్మార్ట్ఫోన్లతో ప్రపంచవ్యాప్తంగా ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ దిగ్గజం షియోమి మరింత వేగంగా దూసుకుపోతోంది. రెడ్ మి సిరీస్ లో భాగంగా తాజాగా ' రెడ్ మి 4' స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు రడీ అవుతోంది. అతిచవక ధరలో ఆ స్మార్ట్‌ఫోన్ ను మే 16న ఒక ప్రత్యేక కార్యక్రమంలో లాంచ్ చేయనుంది. ఎక్స్ సిరీస్‌లో అతి ఖరీదైన డివైస్‌లను లాంచ్ చేసిన సంస్థ, రెడ్ మి 3 కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ గా రెడ్ మి 4 ను స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ధరను చౌక ధరలో సుమారు రూ.8వేలుగా నిర్ణయించనుందని తెలుస్తోంది. లుక్స్‌లో రెడ్ మి3, 3 ఎస్ ను పోలి ఉండి, మెటల్ యూనిబాడీ డిజైన్త వెనుక ప్యానెల్లో వేలిముద్ర స్కానర్ కూడా పొందుపరిచింది. అలాగే అతి తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీర్యాం, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుంది. దీని ధర ఇండియాలో సుమారు రూ. 6,905గా ఉండనుంది. షియామి వైస్ ప్రెసిడెంట్, ఎండీ, మను కుమార్ రెడ్మి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోందని ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈనెలలో ఇదిరెండవ అతిపెద్ద ప్రకటన కానుందంటూ ట్వీట్ చేయడంతో మరిన్ని ఆసక్తి నెలకొంది. రెడ్ మి 4 ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్ మి 4 ఫీచర్లు 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 6.0మార్షమల్లౌ 1.4 ఆక్టా కోర్ ప్రాపెసర్ 3జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నెట్ మొమరీ, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 128జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ Announcing the launch of a new Redmi phone! This will be the 2nd BIG announcement of the month ☺️ Coming soon. Stay tuned #PowerInYourHand pic.twitter.com/jvzGCY2oyR — Manu Kumar Jain (@manukumarjain) May 5, 2017 -
రెడ్ మి 4 కమింగ్ సూన్!
ముంబై: స్మార్ట్ ఫోన్లతో ప్రపంచ వ్యాప్తంగా ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరింత వేగంగా దూసుకుపోతోంది. తాజాగా రెడ్ మి సిరీస్ లో భాగంగా ' రెడ్ మి 4' స్మార్ట్ ఫోన్ నులాంచ్ చేసేందుకు రడీ అవుతోంది. ఈ ఏడాది జనవరి లో లాంచ్ రెడ్ మి 3 కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ గా రెడ్ మి 4 విడుదలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ లో మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. చైనీస్ సర్టిఫికేషన్ సైట్ తెనా లో లీక్ అయిన వివరాలు ప్రకారం రెడ్ మి 4 ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 1.4 ఆక్టా కోర్ ప్రాపెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ 13 ఎంపీరియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ముందు కెమెరా 4100 బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.7వేలు గా నిర్ణయించినట్టు అంచనా. అయితే దీనిపై షియామి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
రెడ్మి 4, మి నోట్ 2 ఫోటోల లీకేజీ హల్చల్
ఇంకా ఒక నెలలోనే కస్టమర్ల ముందుకు గ్రాండ్ ఈవెంట్‌గా రావాలనుకున్న షియోమి రెడ్మి 4, మి నోట్ 2లు లీక్‌ల బారినపడ్డాయి. రెండు స్మార్ట్‌ఫోన్ ఇమేజ్‌లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ లీకేజీ ఫోటోల్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు మెటల్ యూనిబాడీస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇతర కీలక స్పెషిఫికేషన్లు హల్చల్ చేస్తున్నాయి. రెడ్మి 4 లీకేజీ వివరాలు.. రౌండ్ అంచులతో మెటల్ యూనిబాడీని రెడ్మి 4 కలిగి ఉందని..పైనా, కింద యాంటీనా బ్యాండ్స్ ఉన్నట్టు లీకేజీ ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. వెనుకవైపు కెమెరా టాప్ సెంటర్లో ఉండి, దానిపక్కనే కుడివైపున ఫ్లాష్ ఉంది. కెమెరా లెన్స్ కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా ఈ ఫోన్ కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. కెపాసిటివ్ నావిగేషన్ బటన్స్ ఫ్రంట్న కింద వైపు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆధారిత ఎమ్ఐయూఐ 8, ఐదు అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో రెడ్మి 4 ఫోన్ వినియోగదారుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ముందస్తు లీక్‌లు మాత్రం ఈ వేరియంట్ 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అని వెల్లడించాయి. 4100 బ్యాటరీ సామర్థ్యంతో 7వేల రూపాయలకు ఇది లాంచ్ కాబోతుందని అంచనా. ఆగస్టు 25న చైనాలో మెగా ఈవెంట్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేయాలని షియోమి భావిస్తోంది. మి నోట్ 2 స్మార్ట్‌ఫోన్ లీకేజ్‌లు.... రెడ్మి 4 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన రెండో వారంలోనే అంటే సెప్టెంబర్ 2న మి నోట్ 2ను షియోమి ఆవిష్కరించనున్నట్టు వెల్లడవుతోంది. మి నోట్ 2కు సంబంధించి కొన్ని లీక్‌లు మాత్రమే ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. వెనుకాల డ్యుయల్ కెమెరా, గెలాక్సీ నోట్ 7 మాదిరిగా కర్వ్డ్ డిస్ప్లే, ముందు బాగాన ఫింగర్‌ప్రింట్ స్కానర్, రెండు స్పీకర్ గ్రిల్స్ ఉన్నట్టు లీక్‌లో తెలుస్తోంది. ముందస్తు లీకేజీల బట్టి ఈ ఫోన్ రెండు మెమెరీ వేరియంట్లు 6 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ అలరించనుందట. దీని ధర కూడా రూ.25 వేలు, రూ.28 వేలుగా ఉంటుందని అంచనా. మెటల్ బాడీ, ఫింగర్‌ప్రింట్ స్కానర్, అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 821 ఎస్ఓసీ, 3600ఎంఏహెచ్ బ్యాటరీ లీకేజీలోని మి నోట్ 2 ప్రత్యేకతలు.