షావోమి ఆఫర్లు ‌: రూ.1కే ఫ్లాష్‌ సేల్స్‌ | Xiaomi Diwali With Mi Sale Begins | Sakshi
Sakshi News home page

షావోమి ఆఫర్లు ‌: రూ.1కే ఫ్లాష్‌ సేల్స్‌

Published Wed, Sep 27 2017 5:39 PM | Last Updated on Wed, Sep 27 2017 8:04 PM

Xiaomi Diwali With Mi Sale Begins

ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల మెగా సేల్‌ ఈవెంట్లు ముగియగానే.. చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి తన ఫెస్టివల్‌ సీజన్‌ సేల్‌ను ప్రారంభించింది. దివాలి విత్‌ ఎంఐ సేల్‌ పేరుతో నేటి ఉదయం నుంచి దీన్ని నిర్వహిస్తోంది. ఎంఐ.కాంమ్‌, ఎంఐ స్టోర్‌ యాప్‌లో శుక్రవారం వరకు ఈ సేల్‌ జరుగనుంది. వేరియబుల్స్‌, షావోమి మొబైల్‌ ఫోన్లు, యాక్ససరీస్‌పై ఆఫర్లను అందించనుంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సేల్‌ సందర్భంగా రూపాయికే ఫ్లాష్‌ సేల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో యూజర్లు ప్రతిరోజూ రూ.100, రూ.500 విలువైన కూపన్లు పొందుతారు. పైన పేర్కొన్న ఫ్లాష్‌ సేల్‌ ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తోంది. యాప్‌కు మాత్రమే నిర్వహించే బిడ్‌ టూ విన్‌ కంటెస్ట్‌ను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుపనుంది. వీటిలో గెలుచుకునే కూపన్లను పలు షావోమి ఉత్పత్తులు కొనుగోలు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చు. డీల్స​, ఆఫర్లే కాకుండా.. ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలుచేసే కస్టమర్లకు డిస్కౌంట్లు, ఒక్కో కార్డుపై 8వేల మొత్తంలో కనీస లావాదేవీ జరిపిన వారికి 1000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. రెడ్‌మి నోట్‌4 కొనుగోలు చేసిన పేటీఎం యూజర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను షావోమి ఇవ్వనుంది. 

మొబైల్స్‌పై షావోమి ఆఫర్లు..
రెడ్‌మి నోట్‌4 స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌  ధర రూ.10,999కు తగ్గింపు
రెడ్‌మి నోట్‌4 స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ, 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌  ధర రూ.9,999కు తగ్గింపు
రెడ్‌మి 4పై రూ.1,500 తగ్గింపు, ఎంఐ మ్యాక్స్‌2 పై రూ.2000 తగ్గింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement