RedMi note 4
-
పేలిన రెడ్మీ నోట్–4 సెల్‌ఫోన్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్ పేలిపోయింది. రామ్‌నగర్ కాలనీకి చెందిన సూర్యచంద్ర ఏడాదిగా రెడ్మీ నోట్–4 ఫోన్ వాడుతున్నాడు. శుక్రవారం ఫోన్‌కు చార్జింగ్ పెట్టి ఇంటి బయట ఉన్నాడు. ఉన్నట్టుంది శబ్దం రావడంతో లోపలికి వెళ్లి చూడగా ఫోన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పేలిన రెడ్ మీ ఫోన్..
ఆదిలాబాద్ / ఖానాపూర్: మండల కేంద్రంలోని శివాజినగర్‌లో సోమవారం సెల్‌ఫోన్ పేలిన ఘటనలో ప్రమాదం తప్పింది. కాలనీకి చెందిన మణి తన రెడ్ మీ నోట్ ఫోర్ ఫోన్ జేబులో వేడి అవుతోందని పక్కన పెడుతుండగా ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన యువకుడు దూరంగా వెళ్లిపోగానే ఫోన్ పేలిపోయింది. రూ.10 వేలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్ పేలడంతో బాధితుడు కంపెనీ యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో పలుచోట్ల ఫోన్లు పేలాయనే విషయాన్ని వాట్సప్‌లో, పత్రికల్లో చూసిన వినియోగదారులు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. -
పేలిన రెడ్మీ నోట్–4 ఫోన్
సదుం: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో సోమవారం ఓ రెడ్మీ నోట్–4 సెల్‌ఫోన్ పేలింది. బాధితుడు సుధీర్ తెలిపిన వివరాల ప్రకారంసుధీర్ షామియానా దుకాణం నిర్వహిసున్నాడు. దుకాణంలో సెల్‌ఫోన్ ఉంచి పనులు చూసుకుంటుండగా హఠాత్తుగా పేలిన శబ్దం వినబడింది. లోపలికి వెళ్లి పరిశీలించగా ఫోన్ పేలిపోయి కనిపించింది. 4 నెలల క్రితమే తిరుపతిలో ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లు సుధీర్ తెలిపాడు. -
మళ్లీ పేలిన రెడ్మీ నోట్-4 ఫోన్
-
షావోమి ఆఫర్లు : రూ.1కే ఫ్లాష్ సేల్స్
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల మెగా సేల్ ఈవెంట్లు ముగియగానే.. చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన ఫెస్టివల్ సీజన్ సేల్‌ను ప్రారంభించింది. దివాలి విత్ ఎంఐ సేల్ పేరుతో నేటి ఉదయం నుంచి దీన్ని నిర్వహిస్తోంది. ఎంఐ.కాంమ్, ఎంఐ స్టోర్ యాప్‌లో శుక్రవారం వరకు ఈ సేల్ జరుగనుంది. వేరియబుల్స్, షావోమి మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్‌పై ఆఫర్లను అందించనుంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సేల్ సందర్భంగా రూపాయికే ఫ్లాష్ సేల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో యూజర్లు ప్రతిరోజూ రూ.100, రూ.500 విలువైన కూపన్లు పొందుతారు. పైన పేర్కొన్న ఫ్లాష్ సేల్ ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తోంది. యాప్‌కు మాత్రమే నిర్వహించే బిడ్ టూ విన్ కంటెస్ట్‌ను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుపనుంది. వీటిలో గెలుచుకునే కూపన్లను పలు షావోమి ఉత్పత్తులు కొనుగోలు చేసుకునేందుకు వినియోగించుకోవచ్చు. డీల్స, ఆఫర్లే కాకుండా.. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలుచేసే కస్టమర్లకు డిస్కౌంట్లు, ఒక్కో కార్డుపై 8వేల మొత్తంలో కనీస లావాదేవీ జరిపిన వారికి 1000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. రెడ్మి నోట్4 కొనుగోలు చేసిన పేటీఎం యూజర్లకు రూ.400 క్యాష్‌బ్యాక్‌ను షావోమి ఇవ్వనుంది. మొబైల్స్‌పై షావోమి ఆఫర్లు.. రెడ్మి నోట్4 స్మార్ట్‌ఫోన్ 4జీబీ, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999కు తగ్గింపు రెడ్మి నోట్4 స్మార్ట్‌ఫోన్ 3జీబీ, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999కు తగ్గింపు రెడ్మి 4పై రూ.1,500 తగ్గింపు, ఎంఐ మ్యాక్స్2 పై రూ.2000 తగ్గింపు -
దుమ్మురేపుతున్న షావోమి ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ పండుగ సీజన్‌ను చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి భారీగా అందిపుచ్చుకుంటోంది. ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలు నిర్వహిస్తున్న మెగా సేల్ ఈవెంట్స్‌లో షావోమి స్మార్ట్ఫోన్లు దుమ్మురేపుతున్నాయి. రెండు రోజుల్లో 10 లక్షల షావోమి స్మార్ట్ఫోన్లు అమ్ముడుపోయాయి. భారీ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ-కామర్స్ దిగ్గజాలు ఈ సేల్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. రెండు రోజుల గణాంకాల ప్రకారం, సగటున ప్రతి నిమిషానికి 300కు పైగా స్మార్ట్ఫోన్లు అమ్ముడపోయినట్టు షావోమి తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్లో విక్రయాలు భారీ ఎత్తున్న పెరిగినట్టు కంపెనీ చెప్పింది. షావోమి ఇండియాకు ఇది కీలక మైలురాయిగా కంపెనీ అభివర్ణించింది. రెడ్మి నోట్ 4 స్మార్ట్ఫోన్లు హాట్‌కేక్‌లా అమ్ముడుపోతున్నట్టు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్‌ఫోన్‌గా రెడ్మి నోట్4 పేరులోకి వచ్చిన కంపెనీ చెప్పింది. అమెజాన్ ఇండియాలో కూడా అమ్ముడుపోతున్న తొమ్మిది స్మార్ట్ఫోన్లలో ఎనిమిది షావోమికి చెందినవే ఉన్నాయని తెలిసింది. మొబైల్ కేటగిరీలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో షావోమి నెంబర్ వన్ బ్రాండుగా నిలుస్తోంది. ఇంత అద్భుతమైన మద్దతు అందిస్తున్నందుకు ఎంఐ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు షావోమి ఇండియా ఆన్లైన్ సేల్స్ హెడ్ రఘు రెడ్డి చెప్పారు. -
రెడ్మి 4, ఎంఐ మ్యాక్స్ 2లపై పేటీఎం క్యాష్‌బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ఫ్లాట్ఫామ్స్లపై సంచలన విక్రయాలను నమోదుచేస్తున్న రెడ్మి ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. షావోమి పాపులర్ స్మార్ట్ఫోన్లు రెడ్మి నోట్4, ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్ఫోన్లపై పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంఐ స్టోర్ యాప్, ఎం.కామ్ వెబ్‌సైట్‌పై ఈ రెండు స్మార్ట్ఫోన్లను పేటీఎం డిజిటల్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.300 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. వాలెట్‌లోనే ఈ రూ.300 క్యాష్‌బ్యాక్ లభించనుంది. కేవలం ఒకే ఒక్క లావాదేవీకి, ఒకే యూజర్‌కు ఈ పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. షావోమి రెడ్మి నోట్4 స్మార్ట్‌ఫోన్ 2017 తొలి క్వార్టర్లో అత్యధికంగా రవాణా అయిన స్మార్ట్‌ఫోన్‌గా తాజా రిపోర్టుల్లో నిలిచింది. ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆధారితంగా ఎంఐయూఐ 8 ద్వారా రెడ్మి నోట్4 పనిచేస్తుంది. 5.5 అంగుళాల పుల్ హెచ్డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్ప్లేను, స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీని కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో ఇది లాంచ్ అయింది. ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆధారితంగా ఎంఐయూఐ 8 ద్వారా పనిచేస్తుంది. 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీతో 4జీబీ ర్యామ్‌ను ఇది కలిగి ఉంది. 6.44 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే, 12ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీనిలో ఫీచర్లు. -
రెడ్ మి నోట్ 4 లవర్స్‌కు శుభవార్త
చైనా మొబైల్ దిగ్గజం షియామి రెడ్ సిరీస్ ఫోన్ లవర్స్‌కు శుభవార్త. మేకిన్ ఇండియా పథకంలో భాగంగా ఇటీవల విడుదల చేసిన రెడ్మి నోట్ 4 ఫ్లాష్ సేల్ మనోసారి ప్రారంభించింది. నిమిషాల్లో లక్షల ఫోన్ల అమ్మకాలతో సునామీ సృష్టించి, అవుట్ ఆఫ్ స్టాక్ గా నిలిచిన క్రేజీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తిరిగి నేడు (బుధవారం) ప్రారంభంకానున్నాయి. ఎమ్ఐ.కామ్, ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12గంటలనుంచి ప్రత్యేకంగా లభ్యంకానుంది. దీని ప్రారంభ ధర రూ .9,999గా ఉంది. ఫోన్ వేరియంట్ల ఆధారంగా ధర మారుతుంది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. షియోమి రెడ్ మి నోట్ 4 ఫీచర్లు 2.5డి కర్వ్డ్ గ్లాస్‌తో 5.5 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఐయూఐ 8 ఇంటర్ఫేస్ 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్ డెకాకోర్ మీడియా టెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్ 2జీబీ/3జీబీ /4జీబీర్యామ్, 32జీబీ/32జీబీ/64జీబీ ఇంటర్నల్ మెమొరీ 128జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ 13 మెగాపిక్సెల్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్ఫ్రార్డ్ సెన్సార్ 4100 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా ఈ మూడు వేరియంట్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి. 2జీబీ+ 32జీబీ వేరియంట్ధర రూ. 9999 3జీబీ + 32జీబీ వేరియంట్ధర రూ. 10,999 4జీబీ + 64జీబీ వేరియంట్ ధరరూ. 12,999 -
ఇండియాలో చాలా ఫాస్ట్‌గా అమ్ముడుపోతున్న ఫోన్ ఇదే!
రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదుచేస్తున్న రెడ్ మి నోట్4 సరికొత్త ఘనతను సాధించింది. భారత్ లో చాలా త్వరగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ గా రెడ్మి నోట్ 4 నిలుస్తుందని షియోమి వెల్లడించింది. 2016లో 1 బిలియన్ రెవెన్యూలను తాకిన షియోమి, ఈ సందర్భంగా రెడ్మి నోట్4 సంచలన విక్రయాలను సృష్టిస్తుందని పేర్కొంది. విక్రయానికి వచ్చిన తొలి 45 రోజుల్లోనే 1 మిలియన్ యూనిట్ల రెడ్మి నోట్4 ఫోన్లు అమ్ముడుపోయినట్టు మంగళవారం వెల్లడించింది. జనవరి 23న ఈ ఫోన్ తొలి విక్రయానికి వచ్చింది. ప్రతి నాలుగు సెకన్లకు ఒక ఫోన్ అమ్ముడుపోతుందని, తొలిరోజు సేల్ లో పది నిమిషాల్లోనే 2,50,000 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారని కంపెనీ రివీల్ చేసింది. ఎలాంటి ప్రి-రిజిస్ట్రేషన్లు లేకుండా ఫ్లిప్ కార్ట్, మి.కామ్ ద్వారా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను విక్రయిస్తోంది. ఎంపికచేసిన రోజుల్లో మాత్రమే ఈ ఫోన్ విక్రయానికి వస్తోంది. విక్రయానికి వచ్చిన కొద్ది సేపట్లోనే వినియోగదారులు భారీ ఎత్తున దీన్ని కొనుగోలు చేస్తున్నారు. నేడు(బుధవారం) మళ్లీ ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, మి.కామ్ లలో విక్రయానికి వస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజు షియోమికి ప్రత్యర్థిగా ఉన్న లెనోవో మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేయబోతుంది. మూడు మెమరీ యూనిట్లలో రెడ్మి నోట్4ను షియోమి లాంచ్ చేసింది. రూ.9,999కు 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, రూ.10,999కు 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, రూ.12,999కు 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. -
రెడ్ మి నోట్ 4 బ్లాక్ ఈజ్ కమింగ్...
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ రెడ్ మీ నోట్ 4 లో కొత్త వేరియంట్ అమ్మకాలకు తెరలేపింది. రికార్డు అమ్మకాలతో దూసుకుపోయిన ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్ వేయింట్ అమ్మకాలను భారత మార్కెట్లలో బుధవారం నుంచి ప్రారంభించింది. పాపులర్ రెడ్మీ నోట్ 4 లో బ్లాక్ వేరియంట్ ను లాంచ్ చేయనున్నట్టు గత వారం ప్రకటించింది. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ ద్వారా ఈరోజు (మార్చి 1) మధ్యాహ్నం 12 గంటలకు ఈ విక్రయాలను ప్రారంభించనుంది. జనవరిలో లాంచ్ అయిన రెడ్ మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ హాట్‌కేకుల్లా అమ్ముడుబోయిన సంగతి తెలిసిందే. మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చిన కేవలం పది నిమిషాల్లోనే ఏకంగా 2.5 లక్షల ఫోన్లను విక్రయించినట్టు సంస్థ పేర్కొంది. రెడ్మీ నోట్ 4 మూడు వేరియంట్లలో లభిస్తోంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ.. 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ.. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీతో ఇవి లభిస్తున్నాయి. ధరలు వరుసగా రూ.9,999, రూ.10,999, రూ.12,999 ధరల్లో లభిస్తున్నాయి. రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్ 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1 4100 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఫ్లిప్‌కార్ట్.. జడేజా.. ఓ సరదా గొడవ
చవక ధరలకే స్మార్ట్ ఫోన్లు అందించే షియోమి సంస్థ తన ఆల్ రౌండర్ ఫోన్ రెడ్మీ నోట్ 4ను ఈనెల 19న విడుదల చేస్తోంది. కానీ, టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మాత్రం అది నచ్చలేదు. అందుకే ట్విట్టర్లో సరదాగా ఓ చిన్నపాటి గొడవేసుకున్నాడు. కేవలం తమ సైట్లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకాలు సాగబోతున్న షియోమి రెడ్మి నోట్ 4 గురించి ఫ్లిప్‌కార్ట్ సంస్థ టీజింగ్‌గా ఒక ట్వీట్ చేసింది. ''భారత కొత్త ఆల్‌రౌండర్ జనవరి 19న మమ్మల్ని విజిట్ చేస్తున్నారు. ఎవరో ఏంటో తెలుసా?'' అని అందులో పేర్కొంది. వెంటనే 'సర్' రవీంద్ర జడేజా దానికి రెస్పాండ్ అయ్యాడు. ఆ ప్రకటన చేయడానికి ముందు తనను సంప్రదించాలి కదా, ఎందుకు చేయలేదు అని అడిగాడు. ఆ కార్యక్రమాన్ని జనవరి 20వ తేదీకివాయిదా వేయాలని కోరాడు. తనకు 19వ తేదీన ఒక మ్యాచ్ ఉంది కాబట్టి అలా చేయాలన్నాడు. దానిపై ఇక నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఒకరి తర్వాత ఒకరుగా దానిమీద ట్వీట్లు వెల్లువెత్తించారు. దాంతో ఫ్లిప్‌కార్ట్ ఆశించిన స్పందన వచ్చినట్లయింది. షియోమి రెడ్మి నోట్ 3 మార్కెట్లో క్లిక్ కావడంతో.. దాదాపు దాని ధరలోనే మరికొంత అప్‌గ్రేడెడ్ వెర్షన్, మరింత ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో నోట్ 4ను తీసుకొస్తోంది. (పూర్తి వివరాలకు చదవండి: నోట్ 3 ధరకే రెడ్మి నోట్ 4?) India's new all-rounder is visiting us on January 19th. One of the best in India! Any guesses who it is? — Flipkart (@Flipkart) 14 January 2017 @Flipkart Why this Kolaveri di? Should have informed me before announcing? Anyway, got a match on the 19th… let's push this to 20th? — Ravindrasinh jadeja (@imjadeja) 14 January 2017